జాతీయ వార్తలు

మేమే అఖిలపక్షం నిర్వహిస్తాం: డీఎంకే కమల్ వస్తున్నారు: స్టాలిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 18:కావేరీ జలాల పంపిణీలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చాటేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని తమిళనాడులోని ప్రతిపక్ష డీఎంకే నిర్ణయించింది. వచ్చే వారం కొత్త పార్టీని పెట్టబోతున్న ప్రసిద్ధ నటుడు కమల్ హసన్ ఈ సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకరించారని డిఎంకె వర్కింగ్ ప్రసిడెంట్ ఎమ్‌కె స్టాలిన్ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగినా అధికార అన్నాడిఎంకె పట్టించుకోవడం లేదని, అందుకే అఖిలపక్ష భేటీ నిర్వహించడానికి తాము ముందుకు వచ్చామని స్టాలిన్ వివరించారు. ఈ సమావేశానికి రావాలని అన్నాడిఎంకే, బీజేపీలనూ ఆహ్వానిస్తామని తెలిపారు. అయితే ఎప్పుడు ఈ సమావేశం నిర్వహించాలన్నదీ ఇంత వరకూ నిర్ణయించలేదని పేర్కొన్న స్టాలిన్ కమల్ రాజకీయ పార్టీ యోచనపై మాట్లాడిన స్టాలిన్ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని అన్నారు. కావేరీ జలాల పంపిణీలో కర్నాటకకు ఎక్కువ వాటాను సుప్రీం కోర్టు కేటాయంచడంతో గత రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కు తున్నాయ. అధికార అన్నాడీఎంకే ఈ వ్యవహారంపై స్పందించకపోవడంతో విపక్షమే అఖిలపక్షానికి దిగింది.