మెయిన్ ఫీచర్

సెకండ్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత నాలుగైదేళ్లుగా టాలీవుడ్‌లో ప్రత్యేకంగా వినిపిస్తున్న
పాస్‌వర్డ్ -రీ ఎంట్రీ. తప్పని పరిస్థితుల్లో వేషం వెతుక్కుంటూ వెనక్కొచ్చిన ఒకరిద్దరు ఒకప్పటి బ్యూటీలు -పరిశ్రమలో నిలదొక్కుకోవడంతో రీ ఎంట్రీలకు టాలీవుడ్ స్క్రీన్ వార్మ్ వెల్కమ్ చెప్పడం మొదలెట్టింది. ఇదెంత బలపడిందంటే -దుబాయ్‌లోనో, దూర దేశంలోనో.. ఎక్కడో ముక్కు మూసుకుని కాపురాలతో కాలక్షేపం చేస్తున్న బ్యూటీలను గుర్తుపెట్టుకుని.. వెతికి పట్టుకుని.. భారీ పారితోషికాలతో బతిమాలి మరీ లాక్కొస్తోంది టాలీవుడ్. యవ్వనపు అమ్మలుగానో, మిసమిసల ఆంటీలగానో స్క్రీన్‌మీద కనువిందు చేయడానికి ఉబలాటపడుతోంది. ఒకరి సక్సెస్‌తో మరొకరిలో ఆశ పుట్టడం సహజం కనుక -తాజాగా ఫేడవుట్ హీరోయిన్లు ఫేషియల్ చేయించుకుని పాత్రల కోసం ప్రయత్నాలు మొదలెడుతున్నారు. వయసు మీరినా -జిమ్‌లో వర్కవుట్స్‌తో ఫిగర్ మెయిన్‌టెన్ చేస్తే అక్క, వదిన, అత్త పాత్రలు దొరుకుతున్నాయి. మరికొంచెం వయసు మీరితే అమ్మ.. మరీ పాతతరమైతే అమ్మమ్మ. ఒకప్పటి ఇమేజ్‌తో ప్రయత్నించిన వాళ్లకు కాదనకుండా పరిశ్రమ అవకాశాలు కల్పిస్తూనే ఉంది.

తెరమీద కనిపించేందుకు పరుగులు పెడుతున్న పరువాల హీరోయిన్లకంటే -స్క్రీన్‌మీద మురిపించేందుకు సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టిన పాత బ్యూటీలే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు హీరోయిన్లుగా కెరీర్ కార్‌ను టాప్‌గేర్‌లో పరిగెత్తించిన బ్యూటీలే -ఇప్పుడు అక్క, ఆంటీ, వదిన, వీలైతే అమ్మలా మురిపించడానికి వ్యూహాత్మక ప్రణాళికలతో వస్తున్నారు. సౌత్ సినిమాలో.. ప్రత్యేకంగా తెలుగు పరిశ్రమలో అందరికీ తెలిసిన చిత్రమేమంటే -20ఏళ్ల వయసులో కెరీర్ మొదలెట్టిన హీరో అరవైయేళ్ల వయసులోనూ హీరోగానే దర్శనమివ్వడం. ఈ పరిస్థితీ ఫేడవుట్ భామలకు కలిసొచ్చే కెరీర్‌గా కనిపిస్తోంది. స్క్రీన్‌మీద ముదురు హీరోలకు కుర్ర హీరోయిన్లతో కెమిస్ట్రీ వర్కవుటయ్యే పరిస్థితి లేకపోవడంతో -ఒకప్పుడు ఆడిపాడిన అందాలనే హీరోయిన్లుగా వెతికితెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ‘నిజానికి సీనియర్ హీరోల సరసన హీరోయన్లని ఎంపిక చేయడం ఒకవిధంగా కష్టంగానే ఉంటుంది. వాళ్లపక్కన కొత్తగా వస్తున్న హీరోయిన్లు మరీ చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారు. హీరోలతో సమానంగా నటనను ప్రదర్శించే నైపుణ్యం కూడా ఉండటం లేదు. అందుకే కాస్త వెనక్కి వెళ్లి హీరోయిన్లను వెతిక్కోవాల్సి వస్తుంది’ అన్నది ఓ అగ్రదర్శకుడి మాట. అయితే, సెకెండ్ ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధమవుతున్న సుందరీమణుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో -సక్సెస్ కాగలమా? లేదా? అన్న సందేహాలూ వాళ్లనూ ముసురుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రీ-ఎంట్రీకి కొత్త భాష్యం చెప్తున్నవాళ్లూ లేకపోలేదు. ‘అసలు సినిమాల్లో రీ ఎంట్రీ అనేదే ఉండదు. మేం పరిశ్రమలోనే ఉన్నాం. వదిలి ఎక్కడికీ పోలేదు. పెళ్లి, లేదంటే వ్యక్తిగత జీవితం ఒకటి ఉంటుంది కనుక మధ్యలో చిన్న విరామమంతే’ అంటున్న హీరోయిన్లూ లేకపోలేదు.
***
అక్కలు, అమ్మల పాత్రలు వేసినంత మాత్రాన -మమ్మల్ని హీరోయిన్లు కాదని ఎవరంటారు. 18-20 ఏళ్ల వయసులో ఉంటేనే హీరోయిన్ కాదు. సినిమాలో ప్రధాన పాత్ర పోషించే వాళ్లంతా హీరోయినే్ల అంటోంది రోజా ఫేం మధుబాల. అంతకుముందు ఆ తరువాత చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. అప్పటికే హిందీ, తమిళ, మళయాలం, కన్నడ చిత్రాల్లో అడపాదడపా సినిమాలు చేస్తోంది మధు. -తెలుగులో సూర్య వర్సెస్ సూర్య, ఇటీవలే వచ్చిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంలో హీరోయిన్ తల్లిగా చక్కని పాత్రలు పోషించింది ఈ బక్కపల్చని బ్యూటీ. ఆ పాత్రలు వేసినంత మాత్రాన మమ్మల్ని అలా చూడకండి. నేనిప్పటికీ హీరోయిన్‌నే అంటోంది కూడా. -మధ్యవయసు ఆడవాళ్లు హీరోయిన్లు ఎందుకు కాకూడదన్నది ఆమె వాదన. నిజమే.. మధు వాదనను కాదనలేం. ఏదైనా సినిమాలో ముఖ్య పాత్ర ఇస్తే -నిరూపించుకోవడం పెద్ద కష్టమైన పనేంకాదన్నది మధు వాదనలో కనిపించే కాన్ఫిడెన్స్. దృశ్యం సినిమాలో హీరో వెంకటేష్‌కు జతగా కనిపించిన మీనా -హీరోయినే. సెకెండ్ ఇన్నింగ్స్‌గానే వచ్చినా -దాదాపుగా హీరోయిన్ పాత్రనే చేసింది. అలాంటి సీనియర్ హీరోల పక్కనో, కథానాయకుడి పాత్రకు ప్రతిగానో ముఖ్య పాత్రలు సృష్టిస్తే సత్తా చూపిస్తామన్న ధీమా రీ-ఎంట్రీలో వస్తున్న మధుబాల లాంటి సీనియర్ హీరోయిన్లలో కనిపిస్తోంది.
ఇక ఇప్పటికీ స్టన్నింగ్ బ్యూటీలా కనిపించే యోగా ఫిగర్ -్భమిక సైతం సీనియర్ల బాటలోనే సెకెండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నట్టు వినికిడి. ఎక్స్‌ప్రెషనల్ ఎక్స్‌పోజింగ్‌తో ఆకట్టుకున్న ఈ క్యూటీ స్మైలీ -సౌత్ స్క్రీన్‌పై ఐదేళ్లపాటు అగ్ర హీరోయిన్‌గా వెలిగింది. అటు నార్త్‌లోనూ తనేంటో ప్రూవ్ చేసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే భరత్ ఠాకూర్‌ను పెళ్లాడి షాక్ ఇచ్చిన భూమిక -పెళ్లి తరువాతా అభిమానులను నిరాశపర్చకుండా అడపాదడపా సినిమాలు చేసింది. తరువాత ప్రొడ్యూసర్‌గా చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో -సీనియర్ల స్టైల్లోనే ఇప్పుడు స్క్రీన్‌మీద సెకెండ్ ఇన్నింగ్స్ ఆడేందుకు రెడీ అవుతోందట. ఆంటీ, అమ్మ పాత్రలకైనా ఓకే అంటూనే -స్పెషల్ రోల్స్ డిజైన్ చేస్తే చేయాలని ఆసక్తి చూపుతున్నట్టు దుబాయ్‌నుంచి సంకేతాలు పంపుతోంది. సో.. భూమిక కోసం టాలీవుడ్ ఎలాంటి క్యారెక్టర్లు సృష్టిస్తుందో చూడాలి.
నిన్నటితరం హీరోయిన్లుగా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలెట్టినా -ఊహించని రేంజ్‌లా షైన్ అయిన వాళ్లూ ఉన్నారు. కెరీర్ మొదట్లో తెలుగు తెరపై నదియా చేసిన సినిమాలు కొనే్న. కానీ రీఎంట్రీతో స్టార్ ఇమేజ్‌కు రీచ్ అయ్యింది. మిర్చిలో ప్రభాస్ తల్లిగా కనిపించిన నదియా -అత్తారింటికి దారేదిలో పవన్‌కు అత్తగా సెనే్సషన్ క్రియేట్ చేసింది. ఇక దృశ్యం చిత్రంలో నెగెటివ్ షేడ్‌వున్న పోలీస్ ఆఫీసర్ రోల్‌తో అదరగొట్టడంతో -నదియాకు స్టార్ ఇమేజ్ సొంతమైపోయింది. అప్‌కమింగ్ హీరోయిన్లతో సమానంగా పారితోషికాన్ని డిమాండ్ చేయగల స్థాయికి ఎదిగింది. పదిహేనేళ్లు కెరీర్‌కు దూరంగావుండి -2012లో రీఎంట్రీ ఇచ్చిన సౌత్ బ్యూటీ శ్రీదేవి ఇప్పుడు నార్త్, సౌత్‌లోనూ దుమ్ము దులుపుతోంది. ఇంగ్లీష్-వింగ్లీష్‌తో రీఎంట్రీ ఇచ్చి -తమిళ హీరో విజయ్‌కు అత్తగా పులిలో కనిపించిన వెటరన్ బ్యూటీని -తెలుగుకీ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కెరీర్ ఆరంభంలో ఐరెన్ లెగ్ అపవాదును ఎదుర్కొని -సిల్వర్ స్క్రీన్‌పై రమ్య కనిపిస్తే చాలన్న స్థాయికి ఎదిగిన నిన్నటి స్టార్ రమ్యకృష్ణ. పెళ్లి తరువాత అడపాదడపా సినిమాలు చేస్తున్నా -బాహుబలి ప్రాజెక్టు నుంచి రమ్యకృష్ణ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అదే అందంతో కుర్రకారు మతులు పోగొడుతున్న రమ్యకృష్ణ -తాజాగా సోగ్గాడే చిన్నినాయినా చిత్రంలో నాగ్ సరసన దాదాపు హీరోయిన్ పాత్రలోనే కనిపించి మురిపించింది. సంక్రాంతి సినిమాగా వచ్చిన సోగ్గాడే ప్రాజెక్టు హిట్టుకు రమ్యకృష్ణ పాత్రే కీలకమైందని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు. హీరోయిన్‌గా నాగార్జునతో చిందులేస్తూనే, ఆలూమగల మధ్య సున్నితమైన, చమత్కారంగా నడిచే సన్నివేశాలను అద్భుతంగా పండించగలిగింది. అయితే, సెకెండ్ ఇన్నింగ్స్ అందరికీ కలిసొచ్చిందా? అంటే ఔనని చెప్పలేం. కెరీర్ మొదట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టే -సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ సక్సెస్ కాలేక స్క్రీన్‌కు దూరంగా ఉండిపోయిన వాళ్లూ ఉన్నారు. 90వ దశకంలో అగ్రశ్రేణి హీరోయిన్‌గా స్టార్ హీరోలతో స్టెప్పులేసి మురిపించిన సిమ్రాన్ -సెకెండ్స్ ఇన్నింగ్స్‌లో తన సత్తా చూపించలేకపోయింది. తరువాత కెరీర్‌ను బుల్లితెరపై కొనసాగిస్తూ -దర్శక నిర్మాతగా చేసిన ప్రయత్నాల్లోనూ సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లాంటి సీనియర్ హీరోల సరసన హిట్టు సినిమాలు అందుకున్న రోజా -సెకెండ్ ఇన్నింగ్స్ సైతం సిల్వర్ స్క్రీన్‌మీద సక్సెస్ కాలేదు. దాంతో వచ్చిన అవకాశాల మేరకు అడపాదడపా సినిమాలు చేస్తూనే -బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ రియాల్టీ షోలతో కెరీర్‌ను సాఫీగా లాగించేస్తుంది. మరోపక్క రాజకీయాల్లో సైతం తనవంతు పాత్ర పోషిస్తోంది.
దాదాపు రెండు దశాబ్దాల తరువాత ప్రత్యేక నటిగా గుర్తింపు తెచ్చుకున్న అమల సైతం రెండేళ్ల క్రితమే రీఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మంచి ఊపుమీద ఉండగానే నాగ్‌ను పెళ్లి చేసుకున్న అమల -తరువాత సినిమాలకు దూరమైంది. బ్యూటీఫుల్ లైఫ్‌ను ఎంజాయ్ చేసి తీరిగ్గా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అంటూ శేఖర్ కమ్ముల చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. నిజ జీవితపు అమ్మ పాత్రను పోషించి మెప్పించిన అమల -్ఫరూక్ షేక్ నటించిన అమారుూలోనూ ముఖ్య పాత్ర పోషించింది. సోషల్ లైఫ్‌కు ఏమాత్రం ఇబ్బందిలేని, నటిగా తనను నిరూపించుకునే పాత్రల్నే చేస్తానంటున్న అమల సెకెండ్స్ ఇన్నింగ్స్ సాఫీగానే నడిపిస్తోంది. సౌత్‌లో టాప్ హీరోల సరసన ఒకప్పుడు రాణించి -సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన, మొదలుపెడుతున్న హీరోయిన్లు ఇంకా ఎందరో. నటిగానే రాజకీయాల్లోకి ప్రవేశించి సక్సెస్ కాలేకపోయిన నగ్మా సైతం ఇప్పుడు మళ్లీ తెలుగు స్క్రీన్‌వైపు చూస్తోంది. నాలుగేళ్ల క్రితం ఎన్టీఆర్ అల్లరి రాముడు చిత్రంలో -చాముండేశ్వరి అత్తగా మురిపించి నిను చూడక నేనుండలేను చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన నగ్మా, హిందీ, భోజ్‌పురి సినిమాలు చేస్తూనే ఉంది. ఈ గ్లామర్ ఆంటీ త్వరలో తెలుగు స్క్రీన్‌మీద రెండు ప్రాజెక్టుల్లో కనిపించబోతున్నట్టు వినికిడి. బాహుబలి -2లో నగ్మా పేరు వినిపిస్తుంటే, తాజాగా తేజ తీయబోయే చిత్రంలోనూ నగ్మా మళ్లీ కనిపించబోతోంది. భారీ అందాల రాశి, బక్కపల్చని క్యూటీ లైలా, సూర్యను పెళ్లాడి కొంతకాలం స్క్రీన్‌కు దూరమైన జ్యోతిక, శంకర్ బాయ్స్‌నుంచి చెలాకీ పిల్లగా పేరు తెచ్చుకుని, వీలైతే నాలుగు మాటలు, కుదిరిపే కప్పు కాఫీ అంటూ ఊరించి రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన జెనీలియా, శంకర్ అపరిచితుడులాంటి సినిమాలో విక్రమ్‌తో నటించి మెప్పించిన ఒకప్పటి హీరోయిన్ సదాఫ్, సెకెండ్ ఇన్నింగ్స్‌లో మైత్రి థ్రిల్లర్‌తో వచ్చి మురిపించినా కాలం కలిసిరాక బుల్లితెర రియాల్టీ షోలకే పరిమితమైపోయిన సదాఫ్, అతనొక్కడేలో కళ్యాణ్‌రామ్‌కు పెయిర్‌గా చేసిన సింధుతులాని, వరుడు చిత్రం ఫేం భానుశ్రీ మెహ్రా.. వెటరన్ హీరోయిన్ల క్యాటగిరీలో భానుప్రియ, సుమలత, సుహాసిని, రాధికలాంటి వాళ్లూ సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఏదేమైనా వచ్చిన వాళ్లకు లేదనకుండా, అడిగినవాళ్లకు కాదనకుండా -నిన్నటి తరం అందాలకూ సౌత్ స్క్రీన్ ముఖ్యంగా తెలుగు పరిశ్రమ అవకాశాలు ఇస్తూనే ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్ సమర్థంగా ఆడిన వాళ్లు సక్సెస్ కొడుతున్నారు.. లేదంటే చతికిలపడుతున్నారు. ఇప్పుడు -సెకెండ్ ఇన్నింగ్స్ తారలమధ్యే అసలు పోటీ.

-మహాదేవ