క్రీడాభూమి

బంగ్లాపై శ్రీలంక ఘనవిజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగ్లాదేశ్, ఫిబ్రవరి 18: ఇక్కడి సైల్‌హెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక జట్టు 65 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకున్న బంగ్లాదేశ్ శ్రీలంకకు బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. శ్రీలంక నిర్ణీత ఓవర్ల 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఈ జట్టులో కుశాల్ మెండిస్ అత్యధికంగా 70 పరుగులు చేశాడు. శ్రీలంక నిర్దేశించి లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన బంగ్లాదేశ్ 18.4 ఓవర్లకు 135 పరుగులు చేసి ఆలౌటైంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్ ధనుష్క గుణతిలక 37 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 42 పరుగులు చేసి, సౌమ్యా సర్కార్ బౌలింగ్‌లో తమిమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. కుశాల్ మెండిస్ 42 బంతులు ఎదుర్కొని మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 70 పరుగులు చేసి, ముస్త్ఫాజుర్ బౌలింగ్‌లో మహెదీ హసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. తిసర పెరేరా 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మూడు ఫోర్లతో 31 పరుగులు చేసి, అబూ జయేద్ బౌలింగ్‌లో సౌమ్యా సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఉపుల్ తరంగ 13 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, నాలుగు ఫోర్లతో 25 పరుగులు చేసి సైఫుద్దీన్ బౌలింగ్‌లో సౌమ్యా సర్కార్‌కు క్యాచ్ ఇచ్చాడు. దసున్ షనక 11 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఐదు ఫోర్లతో 30 పరుగులు, కెప్టెన్-వికెట్ కీపర్ దినేష్ చండీమల్ ఒక బంతి ఎదుర్కొని రెండు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 18.4 ఓవర్లలో పది వికెట్లు సమర్పించుకుని 135 పరుగులు మాత్రమే చేసింది. ఈ జట్టులో కెప్టెన్ మహమ్మదుల్లా అత్యధికంగా 41 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లెవరూ చెప్పుకోదగ్గ పరుగులేమీ చేయలేదు. ఓపెనర్‌గా దిగిన తమీమ్ ఇక్బాల్ 23 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 29 పరుగులు చేసి, అపోన్సో బౌలింగ్‌లో ధనంజయకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. సౌమ్యా సర్కార్ నాలుగు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే ధనంజయ బౌలింగ్‌లో జె.మెండిస్‌కు క్యాచ్ ఇచ్చాడు.
వికెట్ కీపర్ ముష్‌ఫికర్ రహీమ్ మూడు బంతులు ఎదుర్కొని ఒక సిక్కర్ చేసి, మధుశంక బౌలింగ్‌లో తిసర పెరెరాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. మహ్మద్ మిథున్ మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో ఐదు పరుగులు చేసి మధుశంక బౌలింగ్‌లో జె.మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కెప్టెన్ మహ్మదుల్లా 31 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 41 పరుగులు చేసి, రనౌట్ అయ్యాడు. అరిఫుల్ హక్ మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి జె.మెండిస్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. మహ్మద్ సైఫుద్దీన్ 21 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 20 పరుగులు చేసి ఉదాన బౌలింగ్‌లో వాండర్సేకు క్యాచ్ ఇచ్చాడు. మహేదీ హసన్ 11 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 11 పరుగులు చేసి, షేర బౌలింగ్‌లో ఉదానాకు క్యాచ్ ఇచ్చాడు. ముస్త్ఫాజుర్ రహ్మాన్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఫోర్‌తో ఎనిమిది పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. అబూ జయేద్ మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి గుణతిలక బౌలింగ్‌లో చండీమల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు దారిపట్టాడు. నజముల్ ఇస్లామ్ ఒక బంతిని ఎదుర్కొని కేవలం ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రీలంకలో షెహాన్ మధుషంక 2.1 ఓవర్లలో 23 పరుగులిచ్చి రెండు వికెట్లు, ధనుష్క గుణతిలక 0.4 ఓవర్లలో మూడు పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. అఖిల ధనంజయ, దాసున్ షనక, అమిల అపోన్సో, జీవన్ మెండిస్, ఇస్రు ఉదానా చెరో వికెట్ తీసుకున్నారు.
సంక్షిప్త సోరు:
శ్రీలంక ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 210/4 (కుశాల్ మెండిస్ 70, ధనుష్క గుణతిలక 42, తిసర పెరెరా 31, దాసున్ షనక 30 నాటౌట్, ఉపుల్ తరంగ 25).
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: 18.4 ఓవర్లలో 135 ఆలౌట్ (మహ్మదుల్లా 41, తమీమ్ ఇక్బాల్ 29, మహ్మద్ షఫీయుద్దీన్ 20, మెహిదీ హసన్ 11, షెహన్ మధుషంక 2/23, ధనుష్క గుణతిలక 2/3).

న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ గెలుపు
ప టీ-20 ట్రై సిరీస్

హామిల్టన్, ఫిబ్రవరి 18: ఇంగ్లాండ్ రెండు పరుగులు అధీక్యంతో నేడిక్కడ జిరిగిన ట్రై సిరీస్ టీ-20లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల ష్టానికి 194 పరుగులు సాధించింది. జట్టులో బ్యాటింగ్‌లో రాణించిన ఇహోన్ మోర్గన్ విరోచితమైన బ్యాటింగ్ చేసి 46 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్ల సహాయంతో 80 పరుగులతో అజేయంగా ఆర్థ సెంచరీ పూర్తి చేశాడు. కాగా జట్టులో డేవిడ్ మలాన్ 36 బంతుల్లో ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లతో 53 పరుగులతో ఆర్థ సెంచరీ పూర్తి చేయడంతో ఇంగ్లాండ్ స్కోరు వేంగా పేరిగింది. జసన్ రాయ్ తప్ప జట్టులో మరేవరు బ్యాటింగ్‌లో అంతగా రాణించలేక పోయారు.
195 పరుగుల విజయ లక్ష్యాంతో బ్యాటింగ్ బరిలోకి దిగిన న్యూజీలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఇంగ్లాడ్ బ్యాటింగ్‌లో మార్టిన్ గుప్టిల్ 62, కాలీన్ మున్రో57 పరుగులు చేయగా మార్క్‌చాప్‌మాన్ 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ప్రీ సీజన్ గేమ్స్‌కు
ఎన్‌బీఏ సన్నాహాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశంలో బాస్కెట్‌బాల్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు వీలుగా త్వరలో ప్రీ సీజన్ గేమ్‌కు నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ క్రీడకు ఉన్న పరిధిని మరింత విస్తృతం చేసేందుకు గల కారణాలను అనే్వషిస్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది మేలో నొయిడా జేపీ గ్రీన్స్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బాస్కెట్‌బాల్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. బాస్కెట్‌బాల్ పట్ల యువత ఆసక్తి చూపేందుకు వీలుగా ఎన్‌బీఏ చేపట్టిన చర్యల్లో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్‌తో జూనియర్ ఎన్‌బీఏ కలసి పనిచేస్తోంది.
ఈ రెండు సంస్థల కలయికవల్ల ఇప్పటికే ఆరు మిలియన్ మిలియన్ల మంది యువత ఈ క్రీడలో శిక్షణ పొందారు. వీరికి ఐదువేలకు పైగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్లు గట్టి శిక్షణ ఇచ్చారు. రిలయన్స్ ఫౌండేషన్, ఇతర కార్పొరేట్ సంస్థలతో ఎన్‌బీఏ మంచి అనుబంధం ఏర్పాటు చేసుకున్నామని, ముంబయిలో ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశామని ఏబీఏ కమిషనర్ ఆడమ్ సిల్వర్ పేర్కొన్నాడు. ముంబయిలోని కార్యాలయం ద్వారా ప్రీ సీజన్ గేమ్‌లు నిర్వహించే అవకాశం ఉందని ఆయన తెలిపాడు.
యువత ఈ ఆట పట్ల మరింత ఉత్సాహం చూపేందుకు తగిన వసతులు, శిక్షణ వంటి సౌకర్యాలు కల్పించడం వల్ల దేశానికి ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చునని, ఆ దిశగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని అన్నాడు.