క్రీడాభూమి

చేజారిన మూడో టీ-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహానె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 18: దక్షిణాఫ్రికాలో మూడు వనే్డల సిరీస్‌ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు టీ-20 సిరీస్‌ను మూడో మ్యాచ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ఆత్మవిశ్వసంతో భారత మహిళల జట్టు రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఆదివారం జరిగింది. జోరు కొనసాగించి టీ-20లో కూడా ఆధిక్యంతో 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు మూడో టీ-20 మహిళల క్రికెట్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రీకా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. భారత్ దూకుడుగా ఆడినా వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసుకోవడంతో భారత్ 17.5 ఓవర్లలో 133 పరుగులు చేసి ఆలౌటైంది. సఫారీ బౌలర్ షబ్నిం ఇస్మాయిల్ ఐదు వికెట్లు తీసుకుని భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్, స్మృతి మంధాన ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఆదిలోనే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కాప్ వేసిన మొదటి ఓవర్‌లో ఐదో బంతికి మిథాలీ రాజ్ (0) లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ వైపు మళ్లింది. అనంతరం హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్‌కు వచ్చింది. మ్యాచ్‌లో మూడు ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది.
రెండో ఓవర్‌లో మంధాన వరుసగా నాలుగు ఫోర్లు బాది సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది. మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ నిలకడగా ఆడుతూ రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని అంధించారు. 7.2 ఓవర్ల వద్ద స్మృతి మంధాన, వ్యాన్ నికేర్క్ బౌలింగ్‌లో డానియెల్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. బ్యాటింగ్‌లో రాణించిన స్మృతి మంధాన 25 బంతుల్లో ఒక సిక్సర్, ఐదు ఫోర్ల సహాయంతో 37 పరుగులు సాధించింది. స్మృతి త్వరగా ఆట నుంచి నిష్క్రమించడంతో కెప్టెన్ హర్మన్ నిరుత్సాహానికి గురైంది.
11.2 ఓవర్ల వద్ద ఇస్మాయిల్ బౌలింగ్‌లో లీకి హర్మన్ ప్రీత్ కౌర్ క్యాచ్ ఇచ్చి 48 పరుగుల వద్ద ఓటైంది. అపుడు భారత్ స్కోరు 93కు చేరుకుంది.
అదే ఓవర్‌లో మరో రెండు బంతుల వద్ద 11.4 ఓవర్లలో జెమీమా రాడ్జ్రీయస్ సఫారి బౌలర్ ఇస్మాయిల్ బౌలింగ్‌లో షాట్ కోట్టబోయి వ్యాన్ రికేర్క్‌కు క్యాచ్ ఇచ్చింది. దీంతో భారత్ 11.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసి కష్టాల్లో పడింది. వేదా కృష్ణమూర్తితో కలిసి కట్టుగా అడుతుందన్నుకున్న అంజూ పాటిల్ 13.5 ఓవర్లలో 108 పరుగుల వద్ద ఇస్మాయిల్ బౌలింగ్‌లో సునే లూస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైంది. జట్టులో నిలకడగా ఆడుతుందనుకున్న డ్యాషింగ్ బాట్స్‌మన్ వేదా కృష్ణమూర్తి కూడా ఎక్కువసేపుక్రీజ్‌లో నిలవలేక పోయింది. వేదా కృష్ణమూర్తి 23 పరుగులు చేసి సఫారీ బౌలర్ డెనియాల్స్ బౌలింగ్‌లో బోల్డ్ అయింది. జట్టులో మిగతా వారందరూ స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు. సఫారీల బౌలింగ్‌లో రాణించిన షబ్నిం ఇస్మాయిల్ 3.5 ఓవర్లు వేసి కేవలం 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసుకుని సఫారీల విజయానికి కృషి చేసింది. దీంతో 134 పరుగుల విజయ లక్ష్యాంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా అమ్మాయిలు చెలరేగి ఆడారు.
సెన్ లూస్ 41, కెప్టెన్ నెక్రిక్ 26 పరుగులు చేసి జట్టు విజయానికి సహకరించారు. చివరిగా కోయిట్రాయాన్ భారీ షాట్లతో 34 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది. దీంతో దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి విజయం సాధించింది. భారత బౌలింగ్‌లో వస్త్రాకర్ 2, గైక్వాడ్, అనుజ, పూనం తలో వికెట్ తీశారు. దక్షిణాఫ్రికాలో మూడు వనే్డల సిరీస్‌ను 2-1తో గెలిచిన ఊపును టీ-20లో కూడా పునరావృతం కావాలన్న గట్టి పట్టుదలతో భారత జట్టు ఉన్న నేపథ్యంలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించి 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడంతో టీ-20 సిరీస్‌లో 2-1తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది.
సఫారీల ఆట తీరు ఈదే విధంగా కొనసాగితే టీ-20 మ్యాచ్‌ల్లో భారత్ మహిళల జట్టుకు తిప్పలు తప్పన్నట్లే అని చెప్పవచ్చు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 133 ఆలౌట్ (స్మృతి మందానా 37, హర్మన్ ప్రీత్ కౌర్ 48, జెమీమా రోడ్రిగ్స్ 6, వేదా కృష్ణమూర్తి 23, షబ్నిం ఇస్మాయిల్ 5/30, మస్‌బతా క్లాస్ 2/20, నికేర్క్ 1/16, మోస్లిన్ డానియల్ 1/23).
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134/5 ( డాన్ వ్యాన్ నికెర్క్ 26, సునే లూయిస్ 41, మగ్నాన్ డుప్రీజ్ 20, కోయ్ ట్రాయాన్ 34, పూజా 2/21).