క్రీడాభూమి

చెలరేగిన ధావన్, భువనేశ్వర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప మొదటి టీ-20లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం ప భువనేశ్వర్ కుమార్ 5/24
పశిఖర్ ధావన్ 72 పరుగులు ప దక్షిణాఫ్రికాపై భారత్‌కు తొలిసారి అత్యధిక స్కోరు

భారత్ (పురుషుల) తొలి టీ-ట్వంటీ - భారత్ (మహిళల) మూడో టీ-ట్వంటీ

జోహానె్సస్‌బర్గ్, ఫిబ్రవరి 18: దక్షిణాఫ్రికాతో ఇటీవల జరిగిన ఆరు వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 5-1 తేడా ఘన విజయం సాధించిన భారత్ మరో ఆరు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడే క్రమంలో ఆదివారం ఇక్కడి వాండరర్స్ ఇంటర్నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో తొలి టీ-20 మ్యాచ్‌కు దిగింది. భారత్ బ్యాట్స్‌మెన్‌ల పరుగుల ధాటికి దక్షిణాఫ్రికా తొలి టీ-20లో పరాజయం పాలైంది. ప్రతిష్ఠాత్మకమైన టీ-20 మ్యాచ్‌లో కోహ్లీ సేన 28 పరుగుల ఆధిక్యంతో సఫారీలపై విజయం సాధించింది. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్, బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్ రాణించడంతో భారత్ గెలుపు ఖాయమైంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థి జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి ఓటమిపాలైంది. దీంతో భారత్ టీ-20లో కూడా తన ఖాతాను తెరిచింది. టీ-20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో భారత్ ప్రత్యర్థిపై ముందంజలో ఉంది. తొలుత దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ జేపీ డుమినీ టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి టీ-20లో భారత్ జట్టులోకి సీనియర్ క్రికెటర్ సురేష్ రైనాకు చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరో వనే్డలో బొటనవేలి గాయం కారణంగా కుల్దీప్ యాదవ్‌ను విశ్రాంతి కల్పించారు. అదేవిధంగా ఆతిధ్య జట్టు మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కూడా గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో అతని సేవలను వినియోగించుకోలేదు. అయితే, ఆ జట్టులోకి హెన్రిచ్ క్లాసెన్, జూనియర్ దాలాను తీసుకున్నారు.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఇందులో శిఖర్ ధావన్ అత్యధికంగా 72 పరుగులు చేశాడు. మనీష్ పాండే 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 26 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టులో జూనియర్ దాలా 47 పరుగులిచ్చి రెండు వికెట్లు, తబ్రైజ్ షష్మి 37 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించారు. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఆడిన టీ-20 మ్యాచ్‌లలో ఆతిధ్య జట్టుపై 203 అత్యధిక పరుగులు చేయడం ఇదే తొలిసారి.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టులో రోహిత్ శర్మ తొమ్మిది బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 21 పరుగులు చేసి, జూనియర్ దాలా బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. శిఖర్ ధావన్ 39 పరుగులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, 10 ఫోర్ల సహాయంతో 72 పరుగులు చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే టీ-20లో ధావన్ తన విశ్వరూపం చూపాడు. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన సురేష్ రైనా తన ఆటతీరును మెరుగుపరచుకోలేకపోయాడు.
రైనా ఏడు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు ఫోర్లతో కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇతను దాలా బౌలింగ్‌లో ఔటయ్యాడు. పరుగుల యంత్రంగా పేరుగాంచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాట్‌ను జుళిపిస్తాడనుకున్న ఆశలు నెరవేరలేదు. కోహ్లీ 20 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు ఫోర్లతో 26 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యు అయ్యాడు. మనీష్ పాండే 27 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ 11 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 16 పరుగులు చేసి, క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. హార్థిక్ పాండ్య ఏడు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫికా జట్టులో జూనియర్ దాలా నాలుగు ఓవర్లు వేసి 47 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. క్రిస్ మోరిస్ నాలుగు ఓవర్లలో 39 పరుగులిచ్చి ఒక వికెట్, తబ్రైజ్ షంషి నాలుగు ఓవర్లలో 37 పరుగులిచ్చి ఒక వికెట్, ఆండిలో ఫెహ్లుక్యావో రెండు ఓవర్లలో 16 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి భారత్ చేతిలో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా జట్టులో టీ-20 సందర్భంగా కెప్టెన్ డుమినీ యువ క్రికెటర్లకు అవకాశం ఇచ్చినప్పటికీ మ్యాచ్‌ను గెలవలేకపోయారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన జేజే స్ముట్ తొమ్మిది బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతో 14 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రీజా హెండ్రిక్స్ 50 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఎనిమిది ఫోర్లతో 70 పరుగులు చేసి, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. కెప్టెన్ జీన్ పాల్ డుమినీ ఏడు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రైనాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. డేవిడ్ మిల్లర్ ఐదు బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సహాయంతో తొమ్మిది పరుగులు చేసి హార్థిక్ పాండ్య బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫర్హాన్ బెహర్‌డైన్ 27 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 39 పరుగులు చేసి, చాహల్ బౌలింగ్‌లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 16 పరుగులు చేసి భునవేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో రైనా క్యాచ్ పట్టాడు. ఆండిలో ఫెహెలుక్యావో ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 13 పరుగులు చేసి ఉనద్కత్ బౌలింగ్‌లో చాహల్‌కు క్యాచ్ ఇచ్చాడు. క్రిస్ మోరిస్ ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే భువనేశ్వర్‌కుమార్ బౌలింగ్‌లో రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. డేన్ పేటర్సన్ ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు చేసి రనౌట్ అయ్యాడు. జూనియర్ దాలా మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు, తబ్రీజ్ షంసీ రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే నాటౌట్‌గా నిలిచారు. భారత్ జట్టులో భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా ఐదు వికెట్లు తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి ఐదు వికెట్లు సాధించాడు. జయదేవ్ ఉనద్కత్ నాలుగు ఓవర్లలో 33 పరుగులిచ్చి ఒక వికెట్, హార్థిక్ పాండ్య నాలుగు ఓవర్లలో 45 పరుగులిచ్చి ఒక వికెట్, యజ్వేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో 39 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నారు.
సంక్షిప్త స్కోరు:
భారత్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 203/5 (శిఖర్ ధావన్ 72, మనీష్ పాండే 29, విరాట్ కోహ్లీ 26, జూనియర్ దాలా 2/47, ఆండిలో ఫెహ్లూక్యావో 1/16, క్రిస్ మోరిస్ 1/39, తబ్రిజ్ షంషి 1/37).
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 175/9 (రీజా హెండ్రిక్స్ 70, ఫర్‌హాన్ బెరిడియన్ 39, జేజే స్ముట్ 14, ఎండ్రిక్ క్లాసెన్ 16, ఆండిలో ఫెహలుక్యావో 13, భువనేశ్వర్ కుమార్ 5/24).