బిజినెస్

‘డొల్ల’తో గుల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న 11.4వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం నేపథ్యంలో దాదాపు 200 డొల్ల కంపెనీలు, బినామీ ఆస్తులపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. వరుసగా నాలుగో రోజైన ఆదివారం కూడా వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, బంధువు వ్యాపార భాగస్వామి మెహెల్ చోక్సీ, ఇతరుల కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాదాపు రెండు డజన్లకు పైగా చరాస్తులను జప్తు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా ఆభరణాల షోరూంలు, వర్క్‌షాప్‌లు సహా మొత్తం 45 ప్రాంగణాలపై ఇడి దాడులు జరిపింది. ఇప్పటికే నీరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యుల కంపెనీలకు చెందిన 25 ఆస్తులను ఆదాయ పన్ను విభాగం జప్తు చేసుకుంది. మనీలాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వీటిని అధ్యయనం చేస్తున్నారు. ఇదే చట్టం కింద మరిన్ని ఆస్తులను జప్తు చేసుకునే అవకాశం ఉందని ఈడీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నాలుగు రోజుల దర్యాప్తులో దాదాపు 200 డమీ కంపెనీలు బయటపడటం, విదేశాల్లో కూడా వీటి ఉనికి ఉండటం దిగ్బ్రాంతి కలిగిస్తోందని అధికారులు తెలిపారు. ఈ కుంభకోణంలో భాగంగా అక్రమంగా సేకరించిన సొమ్మును ఈ డొల్ల మార్గంలోనే మళ్లించి ఉండొచ్చని, అలాగే వీటి పేరుతో రుణా లు తీసుకునీ ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ డొల్ల కంపెనీలకు ఆసరా చేసుకునే నిందితులు మనీ లాండరింగ్‌కు పాల్పడి భూమి, బంగారం, వజ్రాల పేరిట బినానీ ఆస్తులను సృష్టించుకుని ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. ఈ అంశాలన్నింటిపైనా ఇటు ఐటీ విభాగం, అటు ఈడీ అధికారులు విస్తృతస్థాయిలోనే దర్యాప్తు సాగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకూ 5674 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన రాళ్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే గీతాంజలి జెమ్స్, దాని ప్రమోటర్ మెహెల్ చోక్సీ, ఇతరులకు సం బంధించిన బ్యాంకు ఖాతాలను ఐటీ విభాగం స్తంభింపచేసింది. నీరవ్ మోదీ, ఆయన కుటుంబానికి చెందిన 29 ఆస్తులు, 105 బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది.