బిజినెస్

త్వరలో జేఎఫ్‌సీ ఉప కమిటీలు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖ జెఎఫ్‌సి సమావేశాలను విజయవంతం
చేసిన అందరికీ కృతజ్ఞతలు
ఖజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 18: తమ పార్టీ ఆధ్వర్యంలో నియమించిన సంయుక్త నిజనిర్ధారణ కమిటీ (జెఎఫ్‌సి) నియమించిన ఉప కమిటీల వివరాలను త్వరలో ప్రజల ముందు ఉంచుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నిధుల విడుదల, వ్యయం అంశంపై ఎపి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పరస్పర విరుద్ద ప్రకటనలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన జెఎఫ్‌సి గత రెండు రోజులుగా చర్చించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జెఎఫ్‌సికి సహకారంగా పని చేసేందుకు ఉప కమిటీలు కొన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటి వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. అపారమైన అనుభవం ఉన్న వ్యక్తులు ఈ కమిటీలో ఉన్నారని వారు ఎపి విభజన చట్టంలో కేంద్రం చేస్తామన్న పనులు పూర్తి చేయడం, నిధుల విడుదల, అవసరం తదితర అంశాలపై చర్చించారని తెలిపారు. జెఎఫ్‌సికి అవసరమైన రాజ్యాంగపరమైన సలహాలు అందించేందుకు సుముఖత వ్యక్తం చేసి సమావేశాలకు హాజరైన జస్టిస్ గోపాల్‌గౌడ్‌కు పవన కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశాల్లో పాల్గొన్న కేంద్రహోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, లోక్‌సత్తా వ్యవస్ధాపకుడు జయప్రకాశ్ నారాయణ్, మాజీ సిఎస్ ఐవిఆర్ కృష్ణారావు, ఐఏఎస్ అధికారి తోట చంద్ర శేఖర్, సీనియర్ పార్లమెంటేరియన్ ఉండవల్లి అరుణ్‌కుమార్, సిపిఎం, సిపిఐ కార్యదర్శులు మధు,రామకృష్ణ, కాంగ్రెస్ ప్రతినిధులు గిడు గు రుద్రరాజు తదితరులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జెఎఫ్‌సి నిజనిర్ధారణ కోసం వివరాలను పంపి న ఎపి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.

ఫ్రీయేర్ ఎనర్జీ బోర్డు సలహాదారుగా
సోమ్‌మిటల్ నియామకం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 18: హైదరాబాద్‌కు చెందిన ఫ్రీయేర్ ఎనర్జీ సోలార్ ప్రొవైడర్ సంస్థకు నాస్కాం పూర్వ చైర్మన్ సోమ్‌మిటల్‌ను నియమించినట్లు ఫ్రీయేర్ ఎనర్జీ ఎండి సౌరభ్ మార్డా ప్రకటించారు. నాలుగు దేశాల్లో ఈ సోలార్ కంపెనీ ఆపరేషన్స్‌ను నిర్వహిస్తోంది. కార్పోరేట్ సెక్టార్‌లో మూడు దశాబ్ధాలుగా పనిచేసిన అనుభవం ఉన్న సోమ్ మిటల్ గతంలో హెచ్‌పి, విప్రో, కంపాక్, డిజిటల్ ఈక్విప్‌మెంట్ కార్పోరేషన్ సంస్థల్లో వేరు వేరు హోదాల్లో పనిచేశారు. దేశంలో 16 రాష్ట్రాల్లో 900కు పైగా సోలార్ సిస్టమ్స్‌ను నెలకొల్పిన ఘనత ఫ్రీయేర్ సంస్థకు దక్కింది.

చిరుతను చంపేశాడు
ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో
వృద్ధుడి హీరోయజం
కుప్పం, ఫిబ్రవరి 18: ఓ వృద్ధుడు చిరుతపులిని చంపిన సంఘటన ఆంధ్ర-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులోని మహరాజకడై ప్రాంతంలో జరిగింది. తమిళనాడు రాష్ట్రం మహరాజకడై గ్రామానికి చెందిన వృద్ధుడు క్రిష్ణమూర్తి (62) రోజులాగే ఆదివారం కూడా గ్రామ సమీపంలోని అడవిలోకి పశువులను మేతకు తీసుకెళ్లాడు. అయితే ఇదే అదనుగా చూసుకుని ఓ చిరుతపులి పశువుల మందపై దాడిచేసేందుకు ప్రయత్నించింది. పశువులతో పాటు తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో క్రిష్ణమూర్తి తన వద్ద వున్న వేటకొడవలితో చిరుతపులిపై దాడి చేశాడు. ఈ దాడిలో క్రిష్టమూర్తికి గాయాలు కాగా చిరుతపులి అక్కడికక్కడే చనిపోయింది. తమిళనాడు అటవీ అధికారులు సంఘటన ప్రదేశానికి చేరుకుని విచారణ చేపట్టారు. మొత్తంమీద మృత్యుంజయుడు క్రిష్ణమూర్తిని చూసేందుకు గ్రామస్థులు క్యూకట్టారు.