బిజినెస్

జర్మన్‌లో ఏషియా పసిఫిక్ బిజినెస్ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 18: జర్మన్‌లో జరిగే ఏషియా పసిఫిక్ అసోసియేషన్ సదస్సుకు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఆహ్వానం అందింది. జర్మనీలో హంబర్గ్‌లో మార్చి 2న జరుగనున్న ఈ సదస్సుకు అంతర్జాతీయంగా పేరొందిన 300 మంది వాణిజ్య, దౌత్యవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు హాజరై తెలంగాణలో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించాల్సిందిగా మంత్రికి పంపించిన ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, ఆర్థిక విధానాలపై జర్మ న్ వ్యాపార వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నాయని నిర్వహకులు పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలపై ప్రత్యేకంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సదస్సు వల్ల తెలంగాణ, జర్మన్ మధ్య వాణిజ్య, వ్యాపార బంధం మరింత విస్తృతానికి దోహ దం చేస్తుందని నిర్వహకులు ఆశాభావం వ్యక్తం చేసా రు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఆహ్వానం రావడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేసారు.