బిజినెస్

కోల్ ఇండియా చైర్మన్ పదవికి సింగరేణి సీఎండీ శ్రీధర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, ఫిబ్రవరి 18: కోల్ ఇండియా చైర్మన్ పదవి కోసం సింగరేణి కాలరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ పోటీపడుతున్నారు. ఈ నెల 16న ఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఆయన హాజరైనట్లు సమాచారం. బొగ్గు మంత్రిత్వ శాఖ, విద్యుత్ పరిశ్రమల్లో చైర్మన్ హోదా లో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారులు కోలిండియా చైర్మన్ పదవికి రేసులో ఉన్నారు. తొమ్మిది మంది అధికారులు ఇంటర్వ్యూలకు హాజరు కావడంతో ఎవరు నియమితులయిందీ రెండ్రోజుల్లో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో సింగరేణి కాలరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన నర్సింగరావు కోలిండియా చైర్మన్‌గా ఎంపికైన అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించడంతో కోలిండియా చైర్మన్ పదవి ఖాళీ అయింది. తరువాత సింగరేణి కాలరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన సుతీర్థ భట్టాచార్యను కోలిండియా చైర్మన్‌గా నియమించారు. ఆయన పదవీ కాలం ముగియడంతో మళ్లీ చైర్మన్ పోస్టుకు జరుగుతున్న ఇంటర్వ్యూలకు సింగరేణి సీఎండీ శ్రీ్ధర్ పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. సింగరేణి సీఎండీగా మూడున్నరేళ్లుగా పనిచేస్తున్న శ్రీ్ధర్ సంస్థలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ప్రతి ఏడాదీ పెంచుతూ వస్తున్నారు. కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి పెద్దపీట వేసి పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు పొందారు. మరోవైపు శ్రీ్ధర్ కోలిండియా చైర్మన్‌గా ఎంపికైతే ఖాళీ అయ్యే సింగరేణి కాలరీస్ సీఎండీ పదవి కోసం ఇప్పటికే పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.