రాష్ట్రీయం

సేవలకు లభించిన గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పద్మశ్రీ’పై డా.నాయుడమ్మ

గుంటూరు, జనవరి 25: పిల్లల వైద్య నిపుణులు, విశ్రాంత జిజిహెచ్ వైద్యులు యార్లగడ్డ నాయుడమ్మకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించటంపై హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా నాయుడమ్మ సోమవారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ, కష్టించి పనిచేస్తే ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని, పిల్లలకు నిరంతరం అందించిన సేవలకు గుర్తింపుగా తనకు ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించిన నాయడమ్మ విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తయ్యాక గుంటూరు వైద్య కళాశాలలో ఎంబిబిఎస్, రోహతక్ (హర్యానా)లో ఎంఎస్, చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంసిహెచ్ కోర్సులు చదివారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీర్ఘ కాలం సేవలందించిన నాయుడమ్మ ‘సయామీ’ కవలలను (ఒకటిగా జన్మించిన కవల పిల్లలను) శస్త్ర చికిత్సలతో వేరుచేసి ఖ్యాతి పొందిన విషయం తెలిసిందే.