ఖమ్మం

ప్రజల వద్దకే ఎమ్మెల్యే ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 19: సమస్యల పరిష్కారానికి నేతల చుట్టూ ప్రజలు తిరుగుతుంటారు. ఎన్నికలప్పుడు మాత్రం నాయకులు ప్రజల వద్దకు వచ్చి వారితో మమేకమై వారిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఎన్నికలు లేకపోయినా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నేరుగా ప్రజల ఇండ్లవద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ, పనితీరుపై వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ ప్రజలతో మమేకమై వారితో కలసి ఉండటమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం 16వ డివిజన్‌లో ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ కమర్తపు మురళీతో కలిసి ప్రారంభించారు. ప్రజల ఇంటికే వెళ్ళి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. కార్పొరేషన్‌లో నెలకొన్న సమస్యలు, డివిజన్‌లో అందుతున్న వౌళిక సదుపాయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరాతీశారు. ఎమ్మెల్యే వెంట టిఆర్‌ఎస్ నాయకులు భారీగా ఉండటం విశేషం.