గుంటూరు

విభజన హామీలను నెరవేర్చక పోతే ఆందోళనలు ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట), ఫిబ్రవరి 19: కేంద్రప్రభుత్వం నవ్యాంధ్రపట్ల దారుణంగా వ్యవహరిస్తోందని, ఇదే కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని, విభజన హామీలను నెరవేర్చక పోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద టీఎన్‌యుఎస్ ఆధ్వర్యంలో మహానిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ తిరుపతిలో వెంకటేశ్వరస్వామి సాక్షిగా అమరావతి రాజధానిని ఢిల్లీకి దీటుగా నిర్మిస్తామని చెప్పి నేడు మాటమార్చి నీరు కూడా కేటాయించడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధుల కేటాయింపులో కాలయాపన చేస్తున్నారన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ అరుణ్‌జైట్లీ గతంలో రాజ్యసభలో మాట్లాడుతూ ఐదు లక్షలకు ఆదాయ పరిమితిని పెంచుతామని చెప్పి అమలు చేయలేదన్నారు. ఆదాయపన్ను స్లాబ్‌ను పెంచక పోవడం వలన 12 నెలల జీతాలకు గాను 10 నెలల జీతాలు మాత్రమే ఉపాధ్యాయులకు అందుతోందన్నారు. వ్యవసాయ మార్కెట్‌యార్డు ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న టిఎన్‌యుఎస్ కేంద్రబడ్జెట్‌పై నిరసన దీక్ష చేయడం అభినందనీయమన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్రానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి మద్దాళి గిరిధర్ మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్, విజయవాడ మెట్రోరైలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పి బడ్జెట్‌లో వాటిని కేంద్రం విస్మరించిందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఎన్‌యుఎస్ జిల్లా అధ్యక్షుడు బి హైమారావు, ఉపాధ్యాయ సంఘ నాయకులు బి నాగేశ్వరరావు, లూర్దురాజు, ప్రకాష్, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వరరావు, సుధాకర్, శ్రీనివాసరావు, అబ్దుల్ ఖలీల్, లలిత్‌బాబు, టీడీపీ నాయకులు షేక్ లాల్‌వజీర్, వట్టికూటి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

మిత్రద్రోహం మాది కాదు- మీదే
* టీడీపీ నేతలపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఫైర్
చేబ్రోలు, ఫిబ్రవరి 19: నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఏ కేంద్రప్రభుత్వం ఇంతవరకు ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే మోదీ ప్రభుత్వం ఇస్తోందని, అయినా కేంద్రప్రభుత్వం ఏపీపై చిన్న చూపు చూస్తుందని తమపై అభాండాలు వేయడం అన్యాయమని ఉత్తరాంధ్ర బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. మండల పరిధిలోని గుండవరం గ్రామంలో సోమవారం జరిగిన వాల్మీకి విగ్రహావిష్కరణలో పాల్గొన్న అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు ఏపీకి ఎంతో ప్రాధాన్యతనిచ్చి నిధులు కుమ్మరించడం జరిగిందన్నారు. 24 గంటల కరెంటు సరఫరా చేయడమే కాక ఆరున్నర లక్షల గృహాలను మంజూరు చేశామని, ఇది తాము చేసిన నేరమా అని ఆవేదన చెందారు. దేశం మొత్తంలో 7 లక్షల కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి చేయగా ఒక్క ఆంధ్రరాష్ట్రానికే రోడ్ల అభివృద్ధికి లక్ష కోట్లు ఇవ్వడం జరిగిందని, ఇది బీజేపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గమా అని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న మిత్రధర్మాన్ని విస్మరించింది తాము కాదని, టీడీపీ నేతలేనని పేర్కొన్నారు. టీడీపీ నేతలు మిత్రధర్మాన్ని విస్మరించినందువల్లే తాము కూడా విమర్శలకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ రానున్న ఎన్నికల్లో బీజేపీకి వైసీపీతో పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, ఖర్చు వివరాలు, పోలవరం వంటి పలు ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్‌లను రాష్ట్రప్రభుత్వం సకాలంలో పంపకపోవడం వలనే అనుమతులు రావడం లేదన్నారు. విభజన హామీలన్నింటినీ నెరవేర్చామని చెప్పడం లేదు గానీ, ఇంకా కొన్ని అభివృద్ధి పనులు చేయాల్సి ఉందన్నారు.