సబ్ ఫీచర్

తొక్కిపెడితే నిజం దాగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సప్రస్సియో వెరి-సజస్టియో ఫాల్సి’’2 అనేది ఒక లాటిన్ సామెత. దీని అర్థం సత్యాన్ని కప్పిపెట్టు. అసత్యాన్ని ప్రచారం చేయి అని. వామపక్ష చరిత్రకారులు, కుహనా మేధావులు ఇప్పుడు చేస్తున్న పని అదే. వారికి ఇంగ్లీషు మీడియా కొమ్ముకాస్తున్నది. తీవ్ర ఒత్తిడికి లోనైన రోహిత్ వేముల ఆత్మహత్య అందరినీ కలచివేసింది. కానీ ఈ ఆత్మహత్య వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అఖిల భారత విద్యార్థి పరిషత్, అంబేద్కర్ స్టూడెంట్స్ యూనియన్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే ముఖ్యమైన విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి.
నేర నిర్ధారణ జరిగి కోర్టు విధించిన శిక్షమేరకు గత జూలైలో యాకూబ్ మెమెన్‌కు మరణశిక్ష అమలు జరిగింది. ఈ సందర్భంగా అతని అభిమానులు మసీదుల్లో ప్రార్థనలు జరిపారు. కుటుంబ సభ్యులో లేక దగ్గరి బంధువులో అటువంటి ప్రార్థనల్లో పాల్గొంటే ఫరవాలేదు. కానీ మిగతావాళ్లు ప్రభుత్వంపై ఆగ్రహంతో మెమెన్ పేరుతో ర్యాలీలు నిర్వహించడం దేశ భక్తులకు ఆగ్రహం తెప్పించే చర్య. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అటువంటి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఒక మెమెన్ మరణిస్తే ఇంటింటా మెమెన్‌లు జన్మిస్తారని నినదించారు. ఇది ఎబివిపి విద్యార్థి సుశీల్ కుమార్‌ను బాధించాయి. అందువల్లనే అతను తన ఫేస్‌బుక్‌లో ర్యాలీలో పాల్గొన్నవారిని 3‘గూన్స్’2 అని వర్ణించాడు. ఇది రోహిత్ అతని మిత్రులకు నచ్చలేదు. సుశీల్‌పై దాడి చేసి చితకబాది బలవంతంగా 3క్షమాపణ పత్రం2 రాయించుకున్నారు.
దాడిలో గాయపడ్డ సుశీల్ కుమార్ మదీనాగూడ లోని ఒక ఆసుపత్రిలో 15 రోజులపాటు చికిత్స పొందాడు. ఆపరేషన్ కూడా జరిగింది. సంఘటనపై యూనివర్సిటీ అధికార్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ లోపల సుశీల్ కుమార్ తల్లి వచ్చి విశ్వవిద్యాలయ అధికార్లను నిలదీసింది. అప్పుడు అధికార్లు చర్యలకు ఉపక్రమించారు. కానీ న్యాయం జరుగుతుందో లేదోనన్న భయంతో హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు యూనివర్సిటీని ప్రశ్నించింది. దీంతో అధికార్లు ఐదుగురు విద్యార్థులు హాస్టల్‌కు మాత్రం వెళ్లకుండా ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో రోహిత్ కూడా ఉన్నాడు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ వీరు మళ్లీ హైకోర్టులో అప్పీలు చేశారు. హైకోర్టు స్టే ఇవ్వకుండా రెండు అప్పీళ్లపై ఒకేసారి విచారణ జరుపుతామంటూ కేసు విచారణను జనవరి 19కి వాయిదా వేసింది.
ఇక ఎబివిపి విద్యార్థి నేరారోపణ పత్రంపై విచారించి, చర్య తీసుకున్న కమిటీలో దళితులు లేరని యూనివర్సిటీ ఎస్‌సి, ఎస్టీ అధికార్ల ఫోరం ప్రకటించింది. కాని స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ఎక్స్‌అఫీషియో మెంబరుగా ఆ కమిటీలో ఉన్నాడు. ఆయన దళితుడే. హాస్టల్ చీఫ్ వార్డెన్ దళితుడే. ఆయనకు సస్పెన్షన్ గురించి తెలుసు.
అసలు రోహిత్ దళితుడేనా అనేది మరో ప్రశ్న. అతడి తండ్రి, తాత వడ్డెర కులానికి చెందివారని పోలీసుల విచారణలో తేలింది. అయితే రోహిత్ తల్లి దళితురాలు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రోహిత్ దళితుడే అవుతాడని ఒక ఆంగ్ల దినపత్రిక రాసింది. ఇదిలావుండగా రోహిత్ తల్లిదండ్రులు ఉద్యోగస్తులు. తండ్రిది గురజాల కాగా తల్లిది గుంటూరు. వాళ్లు కూడా తమ ఉద్యోగాలకోసం బీసీ సర్ట్ఫికెట్‌ను మాత్రమే సమర్పించారు. మరి తల్లి దళితురాలు ఎట్లా అయింది?
దళితుడిని చంపేశారంటూ రోహిత్ శవంపై రాజకీయం చేయడానికి జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులు వాలిపోయారు. ఇక ఇంగ్లీషు మీడియాకు మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి రోహిత్ మరణం ఒక ఆయుధంగా మారింది. కానీ వారి ప్రచారంలోని డొల్లతనం ఇప్పుడు బయటపడింది.

- ఎ. మధు (ఎ.బి.వి.పి.)