ఆంధ్రప్రదేశ్‌

స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ పాఠశాలలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ పాఠశాలలను అప్పగిస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం ప్రజలకు విద్యనందించే కనీస బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడమేనని ఎపి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ విమర్శించింది. ప్రజలకు విద్యనందించడం ప్రభుత్వం ప్రాధమిక బాధ్యతగా భావించాలి తప్ప భారంగా కాదని తెలిపింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శలు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. తమ ప్రభుత్వం మోడల్‌గా చూపెడుతున్న బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో సెకండరీ విద్య వరకు ప్రభుత్వమే ఉన్నత ప్రమాణాలతో, ఆధునిక సౌకర్యాలతో నడుపుతోందని వారు గుర్తు చేశారు. నిరంతరం అభివృద్ధి గురించి మాట్లాడే ఈ ప్రభుత్వానికి పాఠశాలలను వదిలించుకోవడం తగదని అన్నారు. ఏ దేశ అభివృద్ధి అయినా ప్రజల చదువు మీదే ఆధారపడిన చరిత్ర ఉందని గమనించాలని వారు హితవు పలికారు. పాఠశాల విద్యను కాపాడుకునేందుకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు. పాఠశాలల అభివృద్ధికి సిఎం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.

ఆర్టీసీలో ఆరు నెలల పాటు సమ్మెలపై నిషేధం
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఆంధ్రభరూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్‌ఆర్టీసి)లో ఆరు నెలల పాటు సమ్మెలు నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ నిత్యావసర సర్వీసుల నిర్వహణ చట్టం 1971 కింద ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో