కృష్ణ

మూడోజోన్‌కు సాగర్ జలాలు విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, ఫిబ్రవరి 19:నాగార్జున సాగరు కాలువల పరిధిలో మెట్టప్రాంతమైన మూడో జోన్‌కు వెంటనే సాగరు జలాలు విడుదల చేసి, ఆరుతడి పంటలను ఆదుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ళ గోపాలకృష్ణ కోరారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విశేష కృషితో నాగార్జున సాగర్ ఎడమకాలువ 2,3 జోన్‌లలో 3.60 లక్షల ఎకరాల ఆయకట్టలో ఇప్పటికే సాగు చేసిన మిర్చి, మొక్కజొన్న, ప్రత్తి, పోగాకు తదితర ఆరుతడి పంటలకు ఇప్పటి వరకు కెఆర్‌ఎమ్‌బి నాలుగు విడతలుగా 14.427 టిఎంసీ లు కేటాయించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర బోర్డరుకు 7.027 టిఎమ్‌సి లు విడుదల చేసిందని, ఈనెల 8 వ తేదిన కార్యదర్శిని స్వయంగా కలిసి 3వ జోన్‌కు సాగర్ నీటిని విడుదల చేయాలని కోరగా అతి కష్టం మీద 3వ జోన్ ఆంధ్ర బోర్డరుకు 11వ తేదిన నీటిని విడుదల చేసి పైన తెలంగాణ ప్రాంతంలో వత్తిడి ఉన్నదనే సాకుతో ఈ నేల 16వ తేదిన నీటి విడుదలను అర్థంతరంగా నిలపుదల చేశారని తెలిపారు. దీని వలన 3వ జోన్‌లో తిరువూరు, నూజివీడు, గన్నవరం, మైలవరం, నందిగామ నియోజకవర్గాలలో 2.00 లక్షల ఎకరాలలో సాగుచేసిన ఆరుతడి పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగరు జలాలు ఈ ప్రాంతానికి వెంటనే విడుదల చేయాలని తగిన ఉత్తర్వులు మంజూరు చేయాలని కెఆర్‌యమ్‌బి సభ్యకార్యదర్శి వినతిపత్రాన్ని అందజేశామని చెప్పారు. దీనిపై స్పందించిన కార్యదర్శి పరమేశం నీటి విడుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ పుల్లయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
ఆగిరిపల్లి, ఫిబ్రవరి 19: ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని దానిని సాధించే బాధ్యత అందరిపైనా ఉందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేశబోయిన శ్రీనివాసరావు తండ్రి అచ్చియ్య ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబసభ్యులను రఘువీరారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్షను రాష్ట్రంలో ప్రప్రథమంగా నూజివీడు నుండే ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. విభజన చట్టంలోని అంశాలు, హామీల అమలు కోసం ఇంకా 40 రోజులు మాత్రమే గడువు ఉందని, పల్లె నుండి ఢిల్లీ వరకు హోదా కోసం పోరాడదామని పిలుపునిచ్చారు. మార్చి 2వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధం , 6,7,8 తేదీల్లో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈసమావేశంలో మాజీ పీసీసీ అధ్యక్షులు ఎన్ తులశీరెడ్డి, రాష్ట్ర మహిళాకాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జీ షేక్ మస్తాన్‌వలీ, ఆగిరిపల్లి, పిఎసిఎస్ అధ్యక్షులు పాతూరి రవి, అనె్న నాగేశ్వరరావు, మాదాల కృష్ణారావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఫొటో(19ఎకెఆర్‌పిహెచ్ 1): మాట్లాడుతున్న మంత్రులు
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం
* ఇరువురు రాష్ట్ర మంత్రుల స్పష్టం
ఎ కొండూరు, ఫిబ్రవరి 19: రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని ఇరువురు రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్ తండ్రి అమృతం నాల్గవ వర్థంతి కార్యక్రమాలు ఇక్కడికి సమీపంలోని గానుగపాడు గ్రామంలోని మంత్రి స్వగృహంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు కూడా హాజరయ్యారు. ఈసందర్భంగా అమృతం చిత్రపటానికి ఇరువురు మంత్రులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి శ్యామ్యూల్ జవహర్ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి అవసరమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. కార్యకర్తలు గ్రామాల్లో సైనికుల్లా వర్గాలకు అతీతంగా పని చేసి పార్టీ విజయానికి దోహదం చేయాలన్నారు. తన తండ్రి అమృతం పేరున గానుగపాడులో ఒకటిన్నర ఎకరాల భూమిని కొనుగోలు చేసి జడ్పీ హైస్కూల్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా తండ్రి ఙ్ఞపకార్థం పేదలకు దుస్తులు, దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలోనే దళితుల అభ్యున్నతి అని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ మహిళా కమిషన్ సభ్యురాలు నల్లగట్ల సుధారాణి, గద్దె రమణ, ఎంపిపి గద్దె వెంకటేశ్వరరావు, అలవాల రమేష్‌రెడ్డి, కొత్తపల్లి రవీంద్రనాధ్, కటారి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.