విజయవాడ

టీడీపీది రాజీలేని పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నది కేవలం తెలుగుదేశం పార్టీయేనని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేడు కేసుల కోసం, బెయిళ్ల కోసం, పదవుల కోసం పుట్టిన రాజకీయ పార్టీలు టీడీపీకి ఏ విధంగా నిరసన చేయాలో, కేంద్రంపై ఎలా ఒత్తిడి తేవాలో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన 19 అంశాల గురించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తుండగా, వైసీపీ కేవలం ఒకే అంశంపై ఎందుకు మాట్లాడుతోందని ఆయన ప్రశ్నించారు. మిగతా 18 అంశాలు ఈ రాష్ట్రానికి అవసరం లేనివిగా ప్రతిపక్షం భావిస్తోందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆనాడు అరుణ్ జైట్లీ హోదా పదం తప్ప అందులో ఉండే అన్ని ప్రయోజనాలు కల్పిస్తానని చెప్పారని గుర్తుచేశారు. రైల్వేజోన్ అని, స్టీల్ ప్లాంట్ అని, కోస్టల్ కారిడార్ మొదలగు 19 అంశాల గురించి టీడీపీ పోరాడుతుంటే, ప్రతిపక్షం కేవలం ఒకే అంశాన్ని లేవనెత్తుతూ మిగతావి రాష్ట్రానికి అవసరం లేదనట్లుగా ఢిల్లీకి సంకేతాలు పంపుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా కేంద్రంపై పోరాటం చేయాలంటే తెలుగుదేశం పార్టీయే ముందుండాలని, అప్పుడే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయని అనుకుంటున్నారన్నారు. ఆఖరికి వైసీపీ కూడా తమ మనస్సాక్షిగా తెలుగుదేశం పార్టీయే ముందుండాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. అంటే వారి వల్ల రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలమనే నమ్మకం వారికే లేదని ఆయన వివరించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్ర బడ్జెట్ ఎంతో అద్భుతంగా ఉందని మాట్లాడి ఈనాటికి కూడా క్షమాపణ చెప్పకపోవటాన్ని తీవ్రంగా గర్హిస్తున్నామన్నారు. వైసీపీలోని నాయకత్వ వైఫల్యం వల్ల, పార్టీ నాయకుడిపై విశ్వాసం లేకపోవడం వల్ల పార్టీ వీడుతున్నవారిని టీడీపీ నాయకులు, అధికారులు ఒత్తిడి తెస్తున్నారని మాట్లాడటం తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన వివరించారు.