హైదరాబాద్

ఐటీ కారిడార్‌లో మోనోరైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొనే నగరంలోని వివిధ ప్రాంతాల్లో సమస్య దశలవారీగా పరిష్కారమవుతోంది. ఇప్పటికే రెండు కారిడార్లలో 30 కిలోమీటర్ల మేరకు మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది. త్వరలో మరో రెండు కారిడార్లు ప్రారంభించేందుకు పనులు వేగవంతమయ్యాయి. మరికొన్ని చోట్ల స్కైవేలు, మల్టీలెవెల్ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చే దిశగా పనులు కొనసాగుతున్నాయి. ఐటీ కారిడార్‌లో రాకపోకలను మరింత సులువుగా సాగేందుకు వీలుగా ప్రతిపాదించిన మోనోరైలు ఏర్పాటుకు అధ్యయనం చేసేందుకు టాస్క్ఫోర్స్‌ను సర్కారు నియమించింది. కొంతకాలంగా ప్రతిపాదనల స్థాయిలో ఉన్న ఈ మోనోరైలు వ్యవహారంలో మరో అడుగు ముందుకు పడింది. మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మోనోరైలు ఏర్పాటు అధ్యయనానికి టాస్క్ఫోర్స్‌ను నియమిస్తూ సోమవారం జీవో జారీ చేశారు. వివిధ శాఖలకు చెందిన పది మంది ఉన్నతాధికారులతో ప్రత్యేక టా స్క్ఫోర్సును నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మెంబర్ కన్వీనర్‌గా ప్రభుత్వ సలహాదారు జీ.వివేక్‌తో పాటు పది మంది వివిధ శాఖలకు చెందిన అధికారులను, పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను సభ్యులుగా నియమించింది. రింగ్‌రోడ్డు, జాతీయ రహదార్లు, రాష్ట్ర హైవేలు, శాటిలైట్ టౌన్స్, స్థానిక సంస్థల పరిధిలోని సుమారు వంద కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మోనోరైలును ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేయనున్నారు. మెట్రోరైలు రెండు, మూడో దశను పరిగణలోకి తీసుకుని మోనోరైలు ప్రతిపాదనపై అధ్యయనం చేయనున్నారు. ఎక్కడెక్కడ మోనో రైలు అవసరం, మరెక్కడక్కెడ మెట్రోరైలును మోనోరైలు రాకపోకలను అనుసంధానం చేయాలి, ప్రాజెక్టు కోసం నిధుల సమీకరణకు అనుసరించాల్సిన విదివిధానాలు వంటి అంశాలపై అధ్యయనం కొనసాగనుంది.