హైదరాబాద్

ప్రతి శుక్రవారం ‘బయోడైవర్సిటీ డే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్య నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగించి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిద్దమైంది. ఇందులో భాగంగా వారినికోసారి బయోడైవర్సిటీ దినంగా పాటించాలని నిర్ణయించింది. ప్రతి శుక్రవారం జీవ వైవిధ్య దినంగా పాటించాలని అధికారులను కమిషనర్ డా.బీ. జనార్దన్ రెడ్డి ఆదేశించారు. అర్బన్ బయోడైవర్శిటీపై కమిషనర్ సోమవారం ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతమున్న పార్కులకు భిన్నంగా నూతన పార్కులను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. హ్యాంగింగ్ గార్డెన్, చైనీస్ మోడల్ పార్కు, పిల్లలకు ప్రత్యేకంగా పంచతంత్ర పార్కు, పాత వాహానాల మోడల్‌తో కూడిన పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పార్కులో పిల్లల ఆట వస్తువులను విధిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నగరంలో కొత్తగా వంద పార్కులను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటికే దాదాపు 75 పార్కుల నిర్మాణం పూర్తయినట్లు, వచ్చే నెలాఖరుకల్లా కొత్తగా నిర్మిస్తున్న పార్కుల్లోనూ ముందుగా కంపోస్టు గుంతల నిర్మాణాన్ని చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న పార్కుల్లో రెండు ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న పార్కుల్లో వాటర్ హార్వేస్టింగ్ పార్కును ఏర్పాటు చేయాలని అన్నారు. ఇప్పటికే నగరంలో ఉన్న పాత పార్కులను పునరుద్ధరించి నగరవాసులు ఆకర్షితిలయ్యే విధంగా తగు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వెస్ట్‌జోన్ పరధిలో నిర్మిస్తున్న పిట్ పార్కు నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నగరంలో ఏర్పాటు చేసిన 84 ఫౌంటేన్లను వెంటనే పునరుద్ధరించి, వార్షిక నిర్వాహణ కాంట్రాక్టులను ఖరారు చేయాలని అన్నారు.
‘బయోడైవర్సిటీ డే’ ఇలా..
మహానగరవాసుల్లో పచ్చదనం, పర్యావరణపై అవగాహన పెంచేందుకు ప్రతి శుక్రవారం నిర్వహించనున్న బయోడైవర్సిటీ డేలో భాగంగా పార్కుల్లో వాకర్స్, సందర్శకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పార్కులను మరింత ఆకర్షనీయంగా తీర్చిదిద్దేందుకు సూచనలు, సలహాలను స్వీకరిస్తారు. ఉత్తమ సేవలందించే సిబ్బంది, వర్కర్లను గుర్తించి సివిల్ సొసైటీలచే ఘనంగా సత్కరిస్తారు. ప్రతి పార్కుల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, అవి ఉన్నట్లు బోర్డులను ఏర్పాటు చేస్తారు. తద్వారా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట వేసినట్టు అవుతోందని అధికారులు భావిస్తున్నారు.
హరితహారంలో 40లక్షల మొక్కలు నాటే లక్ష్యం
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు సంబంధించి ప్రతి సంవత్సరం నిర్వహించే హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ మరో 40లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించింది. మొక్కలకు సంబంధించి నర్సరీలను ఇప్పటి నుంచే పెంచనున్నారు. వీటిలో 35లక్షల మొక్కలను జీహెచ్‌ఎంసీ ద్వారా పెంచటంతో పాటు మరో ఐదు లక్షల పెద్ద మొక్కలను టెండర్ ద్వారా సేకరించనున్నారు. ఈసారి ఒకే స్థలంలో కనీసం 20 నుంచి 50వేల మొక్కలు నాటే స్థలాలను ఎంపిక చేస్తున్నారు. అంతేగాక, జీహెచ్‌ఎంసీకి చెందిన 19 చెత్త తరలింపు కేంద్రాల్లో ఔషధ మొక్కలను కూడా నాటేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించినప్పుడే రామరాజ్యం
జీడిమెట్ల, ఫిబ్రవరి 19: అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించినప్పుడే దేశం రామరాజ్యంగా మార్పు చెందుతుందని స్వామి పరిపూర్ణానంద అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని రంగారెడ్డినగర్ చౌరస్తాలో సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహ పునఃప్రతిష్ఠాపన జరిగింది. స్వామి పరిపూర్ణానంద ముఖ్యఅతిథిగా విచ్చేసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మన్‌తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. పరిపూర్ణానంద స్వామిజీ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీకి రామునికి పోలికలు ఉన్నాయని అన్నారు. భారత మాతకు తిలకం దిద్దిన ఏకైక రాజు శివాజీ అని చెప్పారు. ధర్మపథంలో శ్రీరాముడు రాజ్యాన్ని నడిపించారని, భవిష్యత్తులో విశ్వ హిందూ పరిషత్ సంస్థ ప్రతి వ్యక్తితో శ్రీరామ నామం పలికిస్తుందని అన్నారు. మళ్లీ దేశంలో రాముడు రావాలంటే అయోధ్యలో రామ విగ్రహం ప్రతిష్ఠ జరగాలని అన్నారు. హిందూ దేశంగా దేశాన్ని ప్రకటించాలని ప్రధాని మోదీని అడగాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ దేశభక్తికి, ధర్మ పాలనకు శివాజీ పాలన నిదర్శనమని అన్నారు. శివాజీని, వివేకానందున్ని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేక్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కాంతారావు, నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బక్క శంకర్ రెడ్డి పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.