హైదరాబాద్

జర్మన్ టెక్నాలజీ ‘రోడ్ల’ పనుల తనిఖీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో రోడ్ల పరిస్థితిని మెరుగుపరిచేందుకు జర్మన్ టెక్నాలజీతో ప్రయోగాత్మకంగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనులను కమిషనర్ జనార్దన్‌రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. లుంబీనీపార్కు నుంచి నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు రూ.రెండున్నర కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పనుల విధానంలో ఎకోఫ్రెండ్లీగా చేపట్టినట్లు ఇంజనీర్లు కమిషనర్‌కు వివరించారు. ఈ టెక్నాలజీ ప్రకారం సిమెంటు, ఇతర రసాయన పదార్థాలను కలిపి రూపొందించిన మిశ్రమంతో రోడ్లను నిర్మించే సరికొత్త ప్రక్రియను అవలంభిస్తోంది.
‘స్టెబిలైజేషన్ రోడ్ బై రీ సైక్లింగ్ విత్ ఎడిషన్ సిమెంట్ అండ్ అదర్ కెమికల్స్’ అనే టెక్నాలజీతో నిర్మాణ పనులను చేపడుతున్నట్లు వివరించారు. ఒక్కో కిలోమీటర్‌కు రూ. 55లక్షల నుంచి రూ. 65 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశమున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంలో వైట్ టాపింగ్ రోడ్ల మాదిరిగానే దాదాపు పది సంవత్సరాల పాటు నాణ్యత ఉంటుందని కూడా తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత, ప్రజలు ఉపయోగిస్తున్నపుడు క్వాలిటీ కంట్రోల్ విభాగం అందించే నివేదికలను బట్టి, ఇలాంటి మరిన్ని రోడ్లను నగరంలో నిర్మించేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణ ప్రక్రియను పరిశీలించేందుకు కేరళ రాష్ట్రానికి చెందిన రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్లు ప్రభాకరన్, దేవరాజ్ కూడా కమిషనర్‌తో పాటు వచ్చారు. అంతకుముందు కమిషనర్, కేరళ అధికారుల బృందం ఈ టెక్నాలజీ రోడ్లను నిర్మించే తీరుపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.