డైలీ సీరియల్

వ్యూహం-49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన వెనుక ఓ స్కార్‌పియో కారు వస్తూ ఉంది. తన కారును దాటుకుని వెళ్ళే ప్రయత్నం చెయ్యడంలేదు. తన కారు వెనుక ఫాలో అవుతుంది ఆ కారు. కారు డ్రైవరు వీలు చూసుకుని తనకారును ఢీకొట్టే ప్రయత్నంలో వున్నాడని గ్రహించాడు స్కంద.
కారు వేగం పెంచాడు.
తరుముకుంటూనే వస్తూ వుంది ఆ కారు.
ఎదురుగా గ్రెనైడ్ రాళ్ళు నింపుకుని ఓ పాత లారీ వస్తూ వుంది. లారీ డ్రైవర్ సైడ్ ఇచ్చే ప్రయత్నం చేయకుండా రోడ్డుమద్యగా వస్తున్నాడు. తనేదో ట్రాప్‌లో ఇరుక్కున్నట్లు అర్థం అయ్యింది.
వంద గజాల దూరంలో వుంది లారీ.
బ్రేక్‌మీద కాలువేసి సడెన్‌గా కారు ఆపాలా?
యాక్సిలేటర్ నొక్కి కారు ప్రక్కకు తీసుకుని లారీని దాటాలా? ఎదురుగా వస్తున్న లారీ డ్రైవర్‌కు వెనుక వస్తున్న కారు డైవర్‌కు ఒకే లక్ష్యం వున్నట్లుగా అన్పించింది.
తన కారును ఢీకొట్టి లోయలోకి తోసెయ్యాలి!
ఓ ప్రక్కకు వెళితే లోయలోకి కారు జారే ప్రమాదం, మర వైపు పెద్ద పెద్ద బండరాళ్ళు.
మానస అదేమి గమనించలేదు. ఆమె ధోరణిలో ఆమె ఉంది.
ఒకసారి సియోటల్ వెళ్ళిందట.
సియోటల్ పట్నం అంతా కొండ లోయల్లో ఎగుడు దిగుడుగా వుంటుందట- ఆ విషయాలు చెప్పుకుపోతూ వుంది.
ధైర్యం చేసి కారు స్లో చేసి లోయ అంచుమీద పోనిచ్చాడు. రెండు అంగుళాలు కారు టైర్లు పక్కకుపోతే కారు పల్టీలు కొట్టుకుంటూ లోయలో పడిపోతుంది.
సడెన్‌గా స్కంద ప్రక్కకు తప్పుకోవడం లారీ డ్రైవరు గమనించలేదు.
లారీ స్పీడు తగ్గలేదు. స్కంద కారు వెనుక వస్తున్న స్కార్పియో కారును ఢీకొట్టింది.
లోడు లారీ కావడంతో ముందుభాగం దెబ్బతింది గాని లారీ డ్రైవర్‌కు ఏం కాలేదు. స్కార్పియో కారు మాత్రం పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి.
లారీ డ్రైవరు డోరు తీసుకుని పారిపోయాడు. అతన్ని వెంబడించి పట్టుకోవాలనుకున్నాడు గాని గాయాలు తగిన వ్యక్తిని అలా వదిలేస్తే ప్రాణాలకే ప్రమాదం?
హెడ్‌క్వార్టర్స్‌కి ఫోన్ చేశాడు.
యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం ఎన్నో కిలోమీటరు రాయి దగ్గర వుందో చెప్పాడు. గాయాలైన కారు డ్రైవర్ని హాస్పిటల్లో చేర్పించాడు తన కారులో తీసుకెళ్లి.
పోలీసులు యాక్సిడెంట్ జరిగిన స్థలానికి చేరుకున్నారు.
ఒక్క విషయం స్పష్టమైంది. పాత లారీ అరిఫ్ మనుషులదే
లారీ డ్రైవర్ అరిఫ్ గ్యాంగ్‌కు చెందినవాడే! కారు డ్రైవరు కూడా వీళ్ళ గ్యాంగేనా?
కారు డ్రైవరుమాత్రం ఎవరి మనిషో తెలియడంలేదు. అతను పూర్తిగా కోలుకున్నాక వివరాలు రాబట్టవచ్చు! అనుకున్నాడు స్కంద.
***
బ్రౌన్ కలర్ బ్రీఫ్ కేస్ తీసుకుని లిఫ్ట్ దగ్గరకు వచ్చాడు డాక్టర్ అరవింద్.
నేను ముంబై వెళుతున్నాను. తిరిగి రావడానికి వారం పట్టవచ్చు! ఇక్కడ అన్ని విషయాలు గమనిస్తూ వుండు.. ఏదన్నా అర్జెంటు మాటర్ వుంటే ఫోన్ చెయ్యి’’ అన్నాడు అరవింద్ కాశితో.
తలూపేడు కాశి.
లిఫ్ట్ దగ్గర కన్పించింది డాక్టర్ లోహిత చేతిలో బ్రీఫ్‌కేసు పట్టుకుని.
‘‘ఆడపడుచు ఎదురయిందయ్యా, నేను వెళ్తున్న పని సక్సెస్ అవుతుంది. మంచి శకునం’’ అన్నాడు నవ్వుతూ అరవింద్.
‘‘బ్రీఫ్‌కేసుతో బయల్దేరావ్.. ఎక్కడికి ప్రయాణం? హైదరాబాదే అయితే నా కారులో వచ్చెయ్యి.. నిన్ను డ్రాప్ చేసి నేను ఎయిర్‌పోర్టుకు వెళతాను’’ అన్నాడు అరవింద్.
‘‘హైదరాబాద్ వెళ్తున్నాను.. మా అమ్మగారికి వొంట్లో బాగుండలేదు. చూడటానికి వెళ్తున్నాను’’ అని అందామనుకుంది. కానీ అతనితో కలిసి వెళ్ళడం ఇష్టంలేదు.
‘‘విజయవాడ వెళ్తున్నాను సార్.. అక్కడ నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. కాశిగారికి చెప్పి వెళ్తామని ఈ ఫ్లోర్‌కు వచ్చాను’’ అందామె.
లిఫ్ట్‌లోకి వెళ్లాడు డాక్టర్ అరవింద్. సూట్‌కేసు కింద పెట్టాడు.
కోటు బటన్స్ సర్దుకుంటూ ‘‘గుడ్.. స్కందతో పూర్తిగా డిటాచ్ అయిపోయినట్లేగా’’ అన్నాడు.
‘‘మిమ్మల్ని చూసినప్పుడల్లా ‘మామయ్యా’ అని పిలవాలనిపిస్తూ వుంటుంది సార్.. మా అమ్మగారికి మీరు అన్నయ్య అనే భావనలో పడిపోతూ వుంటాను’’’ అందామె. తన చేతిలోని బ్రీఫ్‌కేస్ అరవింద్ బ్రీఫ్‌కేస్ పక్కన పెట్టి గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కింది.
లిఫ్ట్ కిందకు దిగుతూ వుంది.
‘‘అలాగే పిలువు తల్లీ! నువ్వు నాకు ఆత్మీయురాల్లా కన్పిస్తావ్.. స్కంద పోలీస్ ఆఫీసర్ కాపోయినట్లయితే అతనే్న పెళ్లి చేసుకొమ్మని చెప్పేవాడిని.. ఆ అబ్బాయిని చూస్తే గుండెలో ఏదో తెలియని అనురాగం ఉప్పొంగుతుంది.. ఎందుకనో నాకే తెలియదు..’’
‘‘అతన్ని చూశారా?’’
‘‘ఒకసారి అతని ఫొటో చూశాను.. అచ్చం నాలాగే వున్నాడని మా కాశీ వాగుతూంటాడు.. మరోసారి మారువేషంలో నా దగ్గరకువచ్చడు’’.
‘‘లిఫ్ట్ గ్రౌండ్‌ఫ్లోర్‌కు చేరుకుంది’’.
బ్రీఫ్‌కేసు తీసుకుని హడావుడిగా కారుదగ్గరకు వెళ్ళాడు.

ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ