జాతీయ వార్తలు

డిపాజిటర్లకు మరింత భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఖాతాదారుల పొదుపు మొత్తాలకు భద్రత కల్పించేందుకు పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధం బిల్లు, చిట్‌ఫండ్స్ సవరణ బిల్లులను ప్రతిపాదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 5నుంచి ఏప్రిల్ 6 వరకు రెండోవిడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. అనియంత్రిత డిపాజిట్ల నిషేధం బిల్లు, చిట్‌ఫండ్స్ సవరణ బిల్లును ప్రతిపాదించటంతో పాటు పార్లమెంటు ఆమో దం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనియంత్రిత డిపాజిట్ల పథకాల బిల్లు ద్వారా దేశంలో అనధికారికంగా కొనసాగుతున్న డిపాజిట్ల పథకాలను అదుపు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశంలో పలు సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో వందలు, వేల కోట్లు వసూలు చేసి ఆ తరువాత బోర్డు తిప్పేస్తున్నాయి. అలాగే ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. సామాన్యుల డిపాజిట్లకు భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు తీసుకునే సంస్థలు, కంపెనీలను ఈ బిల్లు ద్వారా అదుపు చేయవచ్చునని అంటున్నారు. అనియంత్రిత డిపాజిట్లను అదుపుచేసేందుకు బిల్లులో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనియంత్రిత డిపాజిట్ల సేకరణను పూర్తి గా నిషేధిస్తారు. అలాంటి స్కీములు నిర్వహించేవారు, అక్రమ కార్యక్రమాలను ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించేలా బిల్లు రూపొందిస్తున్నారు. డిపాజిటర్లకు డబ్బు చెల్లించటంలో విఫలమయ్యే సంస్థలను కఠినంగా శిక్షిస్తారు. అలాగే డిపాజిటర్లకు డబ్బు వాపస్ చేయించేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక అథారిటీని ఏర్పాటు చేసేందుకు బిల్లులో ఏర్పాటు చేస్తున్నారు. డిపాజిటర్ల సొమ్మును వాపసు చేయని పక్షంలో సంబంధిత సంస్థల ఆస్తులు జప్తుచేసే అధికారం అథారిటీకి ఉంటుంది. డిపాజిట్ల చెల్లింపు వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు. నియంత్రిత డిపాజిట్ పథకాల జాబితాను పొందుపరిచే వ్యవస్థను బిల్లులో ఏర్పాటు చేస్తున్నారు. చిట్‌ఫండ్స్ సవరణ బిల్లు చిట్‌ఫండ్స్ రంగం ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందేందుకు తోడ్పడంతోపాటు ఆ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా సవరణ బిల్లు రూపొందించారు. చిట్ వ్యాపారాన్ని ఇక మీదట ఫ్యాటర్నెటీ ఫండ్ అని సంబోధించేలా చట్టంలో సవరణ చేస్తున్నారు. ఇది వరకే నిషేధించిన ప్రైజ్‌చిట్స్ నుంచి చిట్‌ఫండ్‌కు భద్రత కల్పించడం, వ్యత్యాసం చూపించేందుకు తగు చర్యలను బిల్లులో పొందుపరుస్తున్నారు. ఇద్దరు చిట్ సబ్‌స్క్రైబర్లు వీడియో ద్వారా పాట పాడేందుకు బిల్లులో వీలు కల్పిస్తున్నారు. ఫోర్‌మ్యాన్ కమీషన్‌ను ఐదు నుంచి ఏడు శాతానికి పెంచుతున్నారు. ఫోర్‌మ్యాన్ కమీషన్ చాలా కాలం నుండి ఐదు శాతం ఉన్నందు వల్లనే ఇప్పుడ దీనిని ఏడు శాతానికి పెంచుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. బకాయిల చెల్లింపుల ఎగవేతను అరికట్టేందుకు పలు చర్యలు చట్టంలో పొందుపరుస్తున్నారు. 1982 చిట్‌ఫండ్ చట్టంలోని 85 (బి) సెక్షన్‌ను సవరించటం ద్వారా వంద రూపాయల సీలింగ్‌ను తొలగిస్తున్నారు. సీలింగ్‌ను నిర్ధారించే అధికారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేస్తున్నారు.