జాతీయ వార్తలు

ఐఐఎం, ఐఐఐటీని రాష్ట్రానికి ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), మహిళా విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం శ్రీహరి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌ను కలిశారు. అనంతరం మంత్రి శ్రీహరి విలేఖరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బాలికల విద్యా శాతం పెంచేందుకు తన అధ్యర్యంలో సబ్‌కమిటీ ఇచ్చిన సిఫార్సుల్లో కొన్నింటిని అమలు చేసేందుకు కేంద్రం అంగీకరించిందని ఆయన చెప్పారు. దేశంవ్యాప్తంగా కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ)ను 12వ తరగతి వరకు పెంచేందుకు ఈ నెలలోనే కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకం కేవలం 8వ వతరగతి వరకు మాత్రమే అమలు జరుగుతోందని, ఈ పథకాన్ని 12వ తరగతి వరకు కూడా కొనసాగించాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. 12వ తరగతి వరకు పాఠశాలల్లో బాలికలకు దుస్తులను కూడా అందించాలని కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలిపారు. దేశంలో బాలికల విద్యను పెంచేందుకు తాము చేసిన సిఫార్సులు కేంద్రం అమలు చేస్తే బాలికల విద్యాశాతం పెరుగుతుందని కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంని, అందుకోసం తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించాలని, లేనిపక్షంలో సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో ఒక మహిళా యూనివర్సిటీని కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరినట్టు ఆయన పేర్కొన్నారు. ఏపీలో మాదిరిగా తెలంగాణకు కూడా ఐఐఐటిని మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో ఐఐఎంని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరగా, దీనిపై వచ్చే కేటాయింపుల్లో తప్పకుండా ప్రాధాన్యం ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు కడియం శ్రీహరి తెలిపారు. కేంద్రమంత్రిని కలిసినవారిలో కడియం శ్రీహరితోపాటు ఎంపీ మల్లారెడ్డి కూడా ఉన్నారు.
chitram...
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌తో సమావేశమైన మంత్రి కడియం శ్రీహరి