క్రీడాభూమి

డబుల్ సిరీస్‌పై భారత్ తహతహ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంచూరియన్, ఫిబ్రవరి 20: దక్షిణాఫ్రికా జరుగుతున్న టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఇప్పటికే జరిగిన మూడు మ్యాచ్‌లలో వరుస రెండింటిలో గెలిచి, మూడోది కోల్పోయిన భారత్ బుధవారం నాటి నాలుగో మ్యాచ్‌ను ఎలాగైనా గెలవాలని తహతహలాడుతోంది. నాలుగో టీ-20లో ప్రత్యర్థిపై గెలుపు సాధిస్తే భారత్ రెండుసార్లు డబుల్ సిరీస్‌ను గెలుచుకున్న రికార్డును నెలకొల్పుతుంది. ఈ దిశగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత్ సేన సన్నాహాలు చేస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్లతో, రెండో మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయబావుటా ఎగురవేసిన భారత్‌కు మూడో మ్యాచ్‌లో నిరాశ తప్పలేదు. చావోరేవో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రత్యర్థి ఆటపై గట్టి పట్టు సాధించడంతో జోహానె్సస్‌బర్గ్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఇప్పటికే ప్రత్యర్థిపై 2-1 తేడాతో పైచేయి సాధించిన భారత్ నాలుగో మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే చిన్న ఫార్మాట్లలో ఆరు గేముల్లో గెలిచిన రికార్డును సొంతం చేసుకుంటుంది. బుధవారం జరిగే ఈ ప్రతిష్టాత్మక పోరు భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక సవాల్ కానుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఒకసారి పర్యటనలో రెండు సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్‌కు మూడో సిరీస్‌లో గెలిస్తే టీ-20లో మరో మైలురాయిని అధిగమించినట్టు అవుతుంది. ఈ విధంగా భారత్ ఒకసారి టూర్‌లో మూడు సిరీస్‌లు గెలిస్తే గతంలో టీ-20 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా సాధించిన ఘనతను కూడా సొంతం చేసుకుంటుంది. అయితే, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని భారత్ జట్టు ఆశిస్తుండగా, ప్రత్యర్థి జట్టు మాత్రం మూడో మ్యాచ్‌లో గెలుపుతో భారత్‌కు గండికొట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే మూడో మ్యాచ్‌లో భారత్ మిడిలార్డర్‌తో సహా జట్టు సభ్యులను 17.5 ఓవర్లలో కేవలం 133 పరుగులకే ప్రత్యర్థి కట్టడి చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఓపెనర్ స్మతి మంధాన బాగా ఆడినా ఫలితం కానరాలేదు. అదేవిధంగా పేసర్ జులన్ గోస్వామి గాయం కారణంగా మూడో మ్యాచ్‌లో ఆడలేకపోవడం కూడా భారత్‌కు మైనస్‌గా భావిస్తోంది. జట్టులోని మిగతా సభ్యులెవరూ ఆశించిన విధంగా పరుగులు చేయకపోవడం భారత్ ఓటమిని మూటకట్టుకుంది. అయితే, ఇపుడు బుధవారం జరిగే ప్రతిష్ఠాత్మక నాలుగో మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు కూర్పు సమతూకంగా ఉండేలా చర్యలు చేపడుతోంది. అదేవిధంగా దక్షిణాఫ్రికా కూడా బుధవారం నాటి నాలుగో మ్యాచ్‌లో గెలుపుపై గట్టి నమ్మకంతో ఉంది. వరుస రెండు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసినా, మూడో మ్యాచ్‌లో ఘన విజయంతో నాలుగో మ్యాచ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ జారవిడుచుకోకుండా కెప్టెన్ డేన్ వాన్ నైక్రిక్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జట్టు సభ్యురాలు షబ్నమ్ ఇస్మాయిల్ తొలి టీ-20లో 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసిన నేపథ్యంలో ఈమెపై భారీ అంచనాలు ఉన్నాయి.
భారత్: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్‌కెప్టెన్), మిథాలీ రాజ్, వేదా కృష్ణమూర్తి, జమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, అనుజా పాటిల్, తానియా భాటియా, నుజాహత్ పర్వీన్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రేకర్, రాధా యాదవ్, రుమేలీ ధర్.
దక్షిణాఫ్రికా: డేన్ వాన్ నైకెర్క్ (కెప్టెన్), మరిజనె్న కాప్, త్రిషా చెట్ట, షబ్నిమ్ ఇస్మాయిల్, అయబొంగా ఖాక, మసాబటా క్లాస్, సునే లూస్, ఓడిన్ క్రిస్టెన్, మిగ్‌నాన్ డు ప్రెజ్, లెజెల్లీ లీ, క్లో ట్రెయోన్, నదినె డి క్లెర్క్, రాయ్‌సిబి తొజాకే, మొస్‌లైన్ డేనియల్స్.