క్రీడాభూమి

ఈ ఏడాది నెంబర్ వన్ అవుతా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 20: ఈ ఏడాది తనకు అంతా కలసి వస్తుందని ఆశిస్తున్నానని, షటిల్ బాడ్మింటన్‌లో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమిస్తానని భారత స్టార్ క్రీడాకారిణి, ఒలింపిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత పీవీ సింధు పేర్కొంది. గత సీజన్‌లో జారవిడుచుకున్న కొన్ని మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాదంతా శుభసూచకంగా భావిస్తున్నానని, త్వరలో బర్మింగ్‌హామ్‌లో జరుగనున్న ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌తో తన సత్తా చూపుతానని తెలిపింది. అదేవిధంగా కామనె్వల్త్ గేమ్స్, ఆసియన్ గేమ్స్‌కు కూడా తనకు కలసివచ్చే అంశాలని ఆమె తెలిపింది. ఒకేకాలంలో ఒక టోర్నమెంట్ ఆడాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. ఇక్కడి బ్రిడ్జిస్టోన్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె పీటీఐతో మాట్లాడుతూ ఈ ఏడాది నెంబర్ వన్ అయ్యేందుకు తానేమిటో నిరూపిస్తానని ధీమా వ్యక్తం చేసింది. గతంలో ప్రపంచ స్టార్ క్రీడాకారిణులు ఆకెనె యమగూచి, నొజోమి ఒకుహురా, కరోలినా మారిన్ వంటి వారితో ఆడిన పలు మ్యాచ్‌లలో కొన్ని పొరపాట్ల వల్ల ఎదురైన అపజయాలను దృష్టిలో ఉంచుకుని, ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నానని పేర్కొంది. గత ఏడాదితో పాటు ఈ ఏడాది ప్రథమార్థంలో మూడు ప్రధాన టోర్నీలను కోల్పోయినంత మాత్రాన తానేమీ కుంగిపోవడం లేదని, క్రీడా జీవితంలో ఒడిదుడుకులు సహజమని, అన్నింటినీ తట్టుకుని నిలబడిగలిగినపుడే ముందుకు సాగేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొంది. ప్రతీ టోర్నమెంట్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుందని, అయితే, ప్రపంచ చాంపియన్‌షిప్‌ను మిగతా మ్యాచ్‌లతో పోల్చలేమని అంది. అగ్రశ్రేణి క్రీడాకారులంతా ఏడాదిలో కనీసం 15 టోర్నమెంట్లలో ఆడాల్సి ఉంటుందని, అందుకు తగ్గట్టుగా మానిసికంగా, శారీరకంగా తగిన ఆరోగ్య పరిస్థితులు కలిసి రావాలని, అప్పుడే అన్నింటా రాణించగలుగుతారని పేర్కొంది.
బంగారు పతకంపైనే దృష్టి
2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించే దిశగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు సింధు తెలిపింది.
గత ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న తాను ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ గోల్డ్‌మెడల్ సాధనపైనే దృష్టి సారిస్తానని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ‘నా చిరకాల స్వప్నం..గోల్డ్ మెడల్ సాధించడం..కలను సాకారం చేసుకునే దిశగా ఆటతీరును ప్రదర్శిస్తానని ధీమా వ్యక్తం చేసింది. గత ఏడాది తన కెరీర్‌లో ప్రపంచ రెండవ ర్యాంక్‌కు ఎగబాకిన సింధు ప్రముఖ టైర్ల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తోంది.