ప్రకాశం

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 25: జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు ఓటరుగా నమోదుకావాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక రిమ్స్ వైద్యశాల వద్ద జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కళాశాల విద్యార్థులతో ఏర్పాటుచేసిన ర్యాలీ రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు, శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ సుజాతశర్మ, ఒంగోలు,కొండెపి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, డోలా బాలవీరాంజనేయస్వామి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఒపెన్ ఆడిటోరియంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఈ సంవత్సరం ఓటరుగా గర్విస్తున్నాం, ఓటువేసేందుకు సిద్ధంగా ఉన్నామనే నినాదం పిలుపునిచ్చిందన్నారు. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే యువఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ప్రధానభూమిక పోషిస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రతిఒక్కరు తమఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కాలేజిలో చదువుకునే విద్యార్థులకు ఓటుహక్కుపై అవగాహన కల్పించాలన్నారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువశక్తి మీద ఆధారపడి ఉందన్నారు. 1950సంవత్సరంలో ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేశారన్నారు. 18సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు ఓటరుగా నమోదుకావాలన్నారు. జిల్లాలోని పట్టణప్రాంతాల్లో 30వేల డూప్లికేట్ ఓటర్లను తొలగించామన్నారు. కాలేజిలో చదివే విద్యార్థులను విచారణ చేపట్టి అర్హత ఉన్నవారందరికి ఓటు హక్కు కల్పించాలన్నారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్లకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొండెపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ గ్రామాల్లోని వృద్దులకు, వలసలు వెళ్ళిన వారిని నిర్లక్ష్యం చేయటం వలన ఓటుహక్కు లేకుండా పోతుందన్నారు. అధికారులు విచారణ చేపట్టి అర్హత గలిగిన వారికి ఓటు హక్కు కల్పించాలన్నారు. ఎన్నికల సంఘం సరళీకృత విధానం ద్వారా ఓటు హక్కు పొందేందుకు బూత్‌స్థాయి అధికారి వ్యవస్థను ఏర్పాటుచేయటం జరిగిందన్నారు. బూత్‌స్ధాయి పనిచేసేచోట బిఎల్‌ఒ ఆఫీసును ఏర్పాటుచేయాలన్నారు. తద్వారా ఓటర్ల నమోదుసంఖ్య పెరుగుతుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ జిల్లాలో 18సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు ఓటరుగా నమోదుఅయ్యేందుకు ప్రభుత్వం అన్ని రకాల అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు నవీకరిటంచటం జరుగుతుందన్నారు. జిల్లాలో కొత్తగా ఓటర్లగా నమోదైన 25వేలమందికి ఓటరు గుర్తింపుకార్డులను పంపిణీచేయటం జరిగిందన్నారు. ఈసందర్భంగా జెసి ఓటర్లతో ప్రతిజ్ఞచేయించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపచేశారు. ఈకార్యక్రమంలో వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
పదవుల్లో ఉన్నప్పుడు ముద్రగడకు
కాపులు గుర్తుకు రాలేదా..?
* స్వప్రయోజనాల కోసమే దీక్షలు
* కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత
చంద్రబాబుదే
* రాష్ట్ర కాపుసంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్
డైరెక్టర్ మురళీమోహన్
మార్కాపురం, జనవరి 25: మంత్రి, ఎంపిగా ఉన్న సమయంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు కాపులు గుర్తుకురాలేదా అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుచేసి కాపుల అభివృద్ధికి పాటుపడుతుంటే స్వప్రయోజనాల కోసం దీక్షలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ కంటారాయల్ మురళీమోహన్ అన్నారు. సోమవారం స్థానిక లక్ష్మీచెన్నకేశవస్వామిని దర్శించుకునేందుకు మార్కాపురం వచ్చిన సందర్భంగా ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అనంతరం వాటి ఊసే ఎత్తలేదని, ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగి 16వేల కోట్ల రూపాయల లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ కార్పొరేషన్ ఏర్పాటుచేసి 100కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారని, రానున్న బడ్జెట్‌లో 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కాపులను బిసిల్లో చేర్చేందుకు కూడా రిటైర్డు న్యాయమూర్తి మంజునాథ్‌ను నియమించారని, ఈ శుభ సమయంలో ఉద్యమాలు చేయడం సరైన చర్య కాదని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయకుంటే రానున్న ఎన్నికల్లో కాపులు వారి సత్తా చూపించే అవకాశం ఉందని, అంతవరకు వేచిచూడాల్సిన నేతలు నేడు స్వలాభం కోసం ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం విడుదలైన 100 కోట్ల రూపాయలను బలిజ కులస్తులకు రుణాల రూపంలో ఇవ్వనున్నట్లు, ఇందుకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలను కూడా రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ స్థాయిలో ఇచ్చేవిధంగా ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. ఒక్కో యూనిట్‌లో 50శాతం సబ్సిడీ, మరో 50శాతం బ్యాంకు రుణంగా అందచేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రతి కాపు కుటుంబానికి ప్రభుత్వ రుణం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎపిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి నేడు కాపులను బిసిల్లో చేర్చాలని కోరుతున్నారని, అధికారంలో ఉన్న పదేళ్ళు కాపులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తాను వెనుకబడిన అనంతపురం జిల్లావాడిని అయినప్పటికీ ప్రకాశం జిల్లాకు రెండుకోట్ల రూపాయలు అదనంగా నిధులు విడుదల చేసేవిధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో రాష్ట్ర కాపు సంక్షేమాభివృద్ధి డైరెక్టర్‌గా నియమించేందుకు కృషిచేసిన ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాపులు అన్నిరంగాల్లో ఉన్నందున 35 రకాలకు చెందిన వారికి రుణాలు మంజూరు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని మురళీమోహన్ తెలిపారు. తెల్లకార్డు, ఆధార్‌కార్డు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ ఇచ్చిన కులధృవీకరణ పత్రం ద్వారా నెట్‌లో రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని ప్రతి బలిజ కుటుంబం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈసమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అందె నాసరయ్య, బలిజ నేతలు శ్రావణి వెంకటేశ్వర్లు, పి కాశయ్య, పెద్దదోర్నాల టిడిపి అధ్యక్షులు దాసయ్య, పేరూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పవన్‌కల్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి అయినా కావచ్చు
జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ రానున్న ఎన్నికల్లో టిడిపికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అంటూ పాత్రికేయులు ప్రశ్నించగా, ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగినందున రానున్న ఎన్నికల్లో తెలంగాణ నుంచి టిడిపి తరపున పోటీచేసి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని, ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయనే నిర్ణయించుకోవాలని, తాను చెప్పలేనని కాపు సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మురళీమోహన్ అన్నారు.
అభివృద్ధి పనులకు డిజిపి శంకుస్థాపన
ఆంధ్రభూమి బ్యూరో,
ఒంగోలు, జనవరి 25 : ఒంగోలులో పలు అభివృద్ధి పనులకు డిజిపి జాస్తి రాముడు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖలో ఉన్నతాధికారుల సూచనలు, అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. మంచి ఫలితాలు ఇస్తున్న పరిజ్ఞానాన్ని అన్ని ప్రాంతాల్లో అధికారికంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర డిజిపి రాముడు వెల్లడించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన వివిధ శంకుస్థాపన పనుల ప్రారంభోత్సవంలో డిజిపి రాముడు పాల్గొన్నారు. జిల్లా పోలీసు సంక్షేమ సంఘం నూతనంగా నిర్మించిన భవనాన్ని, ఎసి డార్మిటరీ, లైబ్రరీని డిజిపితోపాటు ఆయన భార్య అనంతసాయిపద్మ లాంఛనంగా ప్రారంభించారు. అదేవిధంగా పోలీసు ఫలహారాలశాలను వారు ప్రారంభించారు. కొత్తపట్నం బస్టాండుసెంటరులో నూతనంగా ఏర్పాటుచేసే పెట్రోలుబంకు ఏర్పాటుకు డిజిపి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఒంగోలు పోలీసు కల్యాణమండపంలో నిర్వహించిన సెమినార్‌లో డిజిపి పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు, సౌత్‌కోస్టల్ జోన్ గుంటూరు రేంజ్ ఐజి ఎన్ సంజయ్ జిల్లాతెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్, జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్టత్రెలుగురైతు అధ్యక్షుడు కరణం బలరాం, కొండెపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామితోపాటు తదితరులు పాల్గొన్నారు.

ఈ డీలర్ మాకొద్దు..!
రేషన్‌షాపు వద్ద లబ్ధిదారుల ఆందోళన
అద్దంకి, జనవరి 25: అద్దంకి పట్టణంలోని 51వ నెంబరు రేషన్‌షాపు డీలరు సక్రమంగా రేషన్‌సరుకులు ఇవ్వడం లేదని, డీలరుగా వేరొకరిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రేషన్‌షాపు వద్ద ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ అశోక్‌వర్ధన్ రేషన్‌షాపు వద్దకు తనిఖీ నిమిత్తం ఎమ్మారైని పంపించారు. గత రెండు నెలలుగా రేషన్ ఇవ్వకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని స్థానిక ప్రజలు ఆగ్రహం వెళ్ళబుచ్చారు. సంక్రాంతి పండుగకు ఇవ్వాల్సిన సరుకుల్లో కొన్ని మాత్రమే ఇచ్చాడని, వాటిలో కందిపప్పు కావాలంటే అదనంగా డబ్బులు తీసుకున్నాడని తెలిపారు. షాపునకు దూరంగా ఉన్న లబ్ధిదారులు కాళ్ళరిగిపోయేలా తిరుగుతున్నారని, ఎప్పుడు చూసినా దుకాణం మూసి ఉంటుందని, దుకాణం తెరిచి ఉన్న సమయంలో వెళితే సరుకు అయిపోయిందని చెబుతున్నాడని వారు ఎమ్మారైకు ఫిర్యాదు చేశారు. రేషన్ డీలరుగా వేరొకరిని ఏర్పాటు చేయాలని వారు కోరారు.
డీలరుకు షోకాజ్ నోటీసులిస్తాం - తహశీల్దార్
51వ నంబరు డీలరుకు షోకాజ్ నోటీసులిచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ అశోక్‌వర్ధన్ తెలిపారు.

20వ నాటికి జన్మభూమి దరఖాస్తులపై విచారణ చేపట్టాలి
కలెక్టర్ సుజాతశర్మ
ఒంగోలు అర్బన్,జనవరి 25: జన్మభూమి-మాఊరు కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటిని వచ్చేనెల 20వతేదీ నాటికి విచారణ పూర్తిచేసి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుజాతశర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక సిపిఒ సమావేశ మందిరంలో మీ కోసం, జన్మభూమి-మాఊరు, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అర్జీలపై ఆమె జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి సోమవారం మీకోసం కార్యక్రమానికి సూదుర ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారంకోసం వస్తున్న అర్జీదారులకు సంతృప్తికరమైన సమాధానం ఇచ్చి పరిష్కరించేందుకు అధికారులు చొరవచూపాలని ఆదేశించారు. జిల్లా అధికారులు తమరోజువారి విధులతోపాటు,మీకోసంలో వచ్చిన ధరఖాస్తులకు సంబంధించిన నిర్దేశించిన నిబంధనలప్రకారం అర్జీలను సకాలంలో పరిష్కరించేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. జన్మభూమి కార్యక్రమంలో దీపం పథకం కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి గ్రౌండింగ్‌పై దృష్టిసారించాలన్నారు. ఆర్థికపరమైన, నిధులతో సంబంధం లేకుండా ఎపిఎస్‌పిడిసిఎల్ వారికి అందిన అర్జీలన్నింటిని పరిష్కరించేందుకు ట్రాన్స్‌కో ఎస్‌ఇని ఆదేశించారు. గ్రామపంచాయతీలో సిపిడబ్ల్యు స్కీంలన్నింటని ఆయాగ్రామాల పంచాయతీల్లో నిర్వాహణ చేపట్టేలా చూడాలని జిల్లా పంచాయితీ అధికారిణి ఆదేశించారు. పంచాయతీ నిధులు సక్రమంగా వినియోగించేలా చూడాలని సూచించారు. తాగునీటికి సంబంధించిన సమస్యలను తెలియచేసేందుకు కలెక్టరేట్‌లోని సెల్‌కు వచ్చిన ఫోన్‌కాల్స్, వచ్చిన ఫోన్‌కాల్స్‌ను సమస్యలు పరిష్కరించిన వివరాలను ప్రతిరోజు సాయంత్రం 5.30గంటలకు తనకు ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ వివరించాలన్నారు.ప్రధానంగా హౌసింగ్ కార్యక్రమం కింద అత్యధికంగా దరఖాస్తులు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయని జిల్లా జాయింట్‌కలెక్టర్, ఆర్‌డిఒలు, తహాశీల్దార్‌లు, ఎంపిడిఒలు, గృహనిర్మాణ శాఖ డిఇ, ఎఇలతో సమీక్షించి పెండింగ్ ధరఖాస్తులను పరిష్కరించేలా చూడాలన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాలని సూచించారు. జన్మభూమి, మీకోసంకార్యక్రమాల్లో వచ్చిన ధరఖాస్తులపై సరైన కారణాలు తెలుసుకోకుండా తిరస్కరించకూడదని కలెక్టర్ అధికారులకు సూచించారు. వచ్చేనెల 16వతేదీన జన్మభూమి -మాఊరు ,మీకోసం అర్జీలపై జిల్లా అధికారులు, ఆర్‌డిఒలు, తహాశీల్దార్లు, ఎంపిడిఒలతో వీడియోకాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.