బిజినెస్

ఆ ఖర్చుల వివరాలు చెప్పలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశంలో భారీ కుంభకోణాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన పారిశ్రామికవేత్తలు విజయ్‌మాల్యా, లలిత్ మోదీలను వెనక్కి రప్పించేందుకు తీసుకుంటున్న చర్యలకోసం చేస్తున్న వ్యయం వివరాలను బహిర్గతం చేయలేమని కేంద్ర దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తమకు సమాచార హక్కు చట్టం వర్తించదని తెలిపింది. వివిధ బ్యాంకుల నుంచి 9వేల కోట్ల రూపాయల రుణాన్ని పొంది ఎగవేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌మాల్యా, ఐపీఎల్ నిధుల వ్యవహారంలో హవాలా మోసాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్‌మోదీ లండన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. మాల్యా, లలిత్ మోదీలను వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందని, అందులో ప్రయాణ, న్యాయ ప్రక్రియకు ఎంత ఖర్చు చేశారో వివరాలు వెల్లడించాలని కోరుతూ పూనేకు చెందిన సామాజిక ఉద్యమ కార్యకర్త విహార్ ధ్రువే సమాచార హక్కు చట్టం కింద కోరాడు. ఈ లేఖను పరిశీలించిన ఆర్థిక మంత్రిత్వశాఖ సీబీఐకు పంపింది. కాగా దీనిపై స్పందించిన సీబీఐ, 2011లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇలాంటి వివరాలు వెల్లడించకుండా మినహాయింపు ఇచ్చినట్లు తన సమాధానంలో పేర్కొంది.

కోడి పందేలు నిర్వహించిన వారి పేర్లు ఇవ్వండి

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 20: సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు నిర్వహించిన ప్రజాప్రతినిధుల పేర్లు తమకు అందజేయాలని హైదరాబాద్ హైకోర్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గుంటూరు జిల్లా తూర్పు పాలెం గ్రామంలో ప్రజాప్రతినిధులు పలువురు కోడి పందెం నిర్వహించినట్లు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కలిదింది రామచంద్ర రాజు ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. అడ్వకేట్ టి. భాను ప్రకాష్ కూడా పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె. విజయ లక్ష్మి మంగళవారం విచారణ జరిపారు. అయితే కోడి పందాల్లో ప్రజాప్రతినిధులు ఎవరూ నిర్వహించలేదని, కేవలం వారు పాల్గొన్నారని అడ్వకేట్ జనరల్ డి. శ్రీనివాస్ కోర్టుకు విన్నవించారు. అందుకు బెంచ్ స్పందిస్తూ తామూ టివీల్లో చూశామని, ప్రజాప్రతినిధులు ప్రజలను రెచ్చగొట్టడమూ చూశామని తెలిపింది. కోర్టులు ఆదేశించినా కోడి పందాలు నిర్వహించి తీరుతామని మాట్లాడడమూ చూశాం అంది.