బిజినెస్

బండారులంకలో 364 గజాల నేత చీర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఫిబ్రవరి 20: చేనేతకు పేరొందిన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామానికి చెందిన నల్లా సత్యానందం, ఈశ్వరి దంపతులు 364 గజాల నేత చీరను రూపొందించారు. సాధారణ చీర ఆరు గజాల వరకు ఉంటుంది. అయితే ఈ దంపతులు 364 గజాల చీరను నేసి, సంచలనం సృష్టించారు. మంగళవారం చీరను ధోనీ నుండి వెలిపి మడత పెట్టారు. ఉగాది పర్వదినం సందర్భంగా మార్చి 18న గ్రామంలో వేంచేయున్న శ్రీ గంగాదేవీ మురుగులమ్మ అమ్మవారికి ఈ చీరను సమర్పించనున్నారు. అనంతరం ఆ చీరను 60 చీరలుగా విభజించి 60 మంది ముత్తయిదువులకు కానుకగా ఇవ్వనున్నట్టు వీవర్స్ సొసైటీ అధ్యక్షుడు పుత్సల వరదరాజులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ బడుగు సత్యనారాయణ, నల్లా సత్యానందం దంపతులు, గంగా సత్యనారాయణ, యాళ్ల సుబ్రహ్మణ్యం, బట్టు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.