మెయిన్ ఫీచర్

బాధ్యతా మీదే బరువూ మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని ఏడడుగులు నడిచి పదిమంది ఆశీర్వాదంతో వధూవరులు ఒకటవుతారు. గృహస్థాశ్రమంలోకి అడుగుపెడతారు. అప్పటిదాకా ఇరువురు వేరువేరు ప్రదేశాలల్లో జీవించినవారు ఇకపై ఒకచోటనే కలిసి జీవిస్తారు. ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు నిన్నటి దాకా ఉంటాయి. కాని ఇకమీద ఒకరి అభిప్రాయానికి మరొకరు గౌరవిస్తారు. ఒకరికి నచ్చిన విషయాలను మరొకరు నచ్చుకునేలా తమను తాము మార్చుకుంటారు.
ఇరుకుటుంబాల వారు వీరికి సాయంగా ఉంటారు. వీరు కొత్త జీవితాన్ని ఆరంభిస్తారు. మరికొద్దినాళ్లల్లోనే కొత్త వ్యక్తులను ఇద్దరూ కలసి ఆహ్వానిస్తారు.
కొత్తజీవితం కొంగొత్త అనుభవాలు ఆడవారికి ఎక్కువగా సొంతమవుతాయి. అంతాసజావుగా సాగితే చిక్కేలేదు. గృహిణిగా మారిన యువతి అమ్మగా మారుతుంది. ఆ పై అమ్మమ్మగానో నాయనమ్మగానో మారుతుంది. అందరికీ సలహాలుసంప్రదింపులు చేసే పవిత్రమూర్తిగా భాసిస్తుంది.
ఇదే మనభారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచదేశాలు ఆకర్షించేలా చేయగల్గిన వ్యవస్థ. దాంపత్యమంటే నూరేళ్ల పంట. ఇక్కడ భార్యాభర్తలు ఇరువురు వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ ఒక్కరుగా ఉంటారు. ఒకే నిర్ణయాలు వారిద్దరూ కలస్తేనే కుటుంబం. ఆ కుటుంబం తీసుకొనే నిర్ణయాలు నలుగురికీ ఆదర్శవంతంగా ఉంటాయి.
కాని నేడు నలుగురు మెచ్చుకోకపోయినా ఫర్వాలేదుకాని నలుగురూ ఎద్దేవా చేసేట్లుగా కుటుంబాలు కుంపట్లుగా మారుతున్నాయి. ఇక్కడ నన్ను గౌరవించలేదని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. నా సంపాదన నా సంపాదన అనే వేర్వేరు గా సంపాదనలు చెబుకుంటున్నారు. ఇది నాది ఇది నీది ఇద్దరూ ఉద్యోగస్థులం కనుక పనిని విభజించుకోవాలి అన్నారు. సంపాదన విభజించుకోవాలి అంటున్నారు. ఇక్కడే అసలు సమస్య వస్తోంది.
పని విభజన కేవలం వెసలుబాటుకు ఏ ఒక్కరికీ అది భారం కాకుండా ఉండడానికి పనికి వచ్చేది. సంపాదన కూడా ఏ ఒక్కరూ అతిగా కష్టపడడమో లేక అతిగా సుఖపడడమో కాకుండా ఇరువురూ సమాన బాధ్యతలు సమాన బరువులు మోయడానికి వీలుగా ఉండడానికి మాత్రమే ఈ నిర్ణయాలు తీసుకోవాలి కాని మీ వాళ్లు వద్దు అనే భావన ఇద్దరిలోను రాకూడదు. కుటుంబం లోని భార్యభర్తల్లో ఏ ఒక్కరైనా నీ నా అనే ధ్యాసలో కొట్టుకుపోతుంటే మాత్రం ఆ కుటుంబం లోని పిల్లలపై ఆ ప్రభావం పడుతుంది. మొక్క వంగనిది మానై వంగునా అన్నట్టు పిల్లలు ఎక్కువగా అమ్మనాన్నలనే అనుకరిస్తుంటారు. కనుక వారిలో ఏ ఒక్కరైనా మీ నాన్న తరఫున వాళ్లు మంచివాళ్లు కాదనో, లేక మీ అమ్మతరఫు వాళ్లు మంచివాళ్లు కారనో చెప్పితే అది పిల్లలపై చాలా ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఎవరికీ చూపించకుండా తినమని చెప్పడం లాంటివి చేస్తే దొంగతనం అనేది ఉగ్గుపాలతో నేర్పించిన వారు అవుతారు. నాన్నకీ విషయం చెప్పుద్దుఅనో, లేక అమ్మకీ విషయం తెలియకూడదనో చెప్పినట్లు అయితే ఆ పెరిగే పిల్లలలు రేపొద్దున మీకిద్దరికీ తెలియకుండా చేసే పనులు చేయడానికి మీరే దారి చూపిన వారు అవుతారు.
ఇలా ఎన్నో చెడుపనులను పెద్దలే పిల్లల చేత చేయించినవారు అవుతారు. అందుకే ముందు మీరిద్దరూ కలసి మీలో ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగేట్లుగా, మీరిద్దరూ కలసి కుటుంబాన్ని సక్రమమైన దారిలో నడిచేట్టు చేయడానికి మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోవాలి. మీలో ఉండే అసమానతలను పిల్లలపై రుద్దితే మీరు వర్తమానాన్ని చెడు చేసుకొన్నట్లుగానే రేపొద్దున భవిష్యత్తరంలో వెలుగుచూసే మీ పిల్లలు తప్పులు చేసి ఆ తప్పులకు శిక్షలు అనుభవించడానికి కారకులు మీరే అవుతారు. కనుక తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా మీరు ఏం చేస్తున్నారో ఏం చేయాలనుకొంటున్నారో దాని ఫలితాలేవిధంగా ఉంటాయో ఆలోచించుకుని మరీ చేయండి. మంచి కారకులు మీరే అయితే భవిష్యత్తరం మిమ్ములను సీతారాముల్లాగా గౌరవిస్తారు. లేకపోతే ఒక్క మండోదరిని కీర్తించినట్లు, ఒక్క సుగ్రీవుణ్ణి కీర్తించినట్టు మీలో ఎవరో ఒకరికి ఆ కీర్తికిరీటం దక్కుతుంది. అదిసరే కాని ప్రపంచ ప్రజలను ఆకర్షించే మన దాంపత్యవ్యవస్థ మీవల్ల మసిబారితే అది ఎవరికీ మంచిది కాదు కనక ఇక నుంచైనా మీలో అసమానతలు ఉంటే వాటిని సరిచేసుకోండి. భార్యాభర్తల నే పదబంధంలాగానే మీరు ఒక్కటిగా ఉండండి. మన సనాతన ధర్మాన్ని కాపాడండి. అపుడే మీరు మీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించిన వారు అవుతారు. దాంపత్య వ్యవస్థను రక్షించే బాధ్యత మాత్రం గృహస్థాశ్రమంలోకి వెళ్లే వధూవరులదే.

- వేంకటేశ ప్రసన్న