భక్తి కథలు

మొదటి ప్రశ్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామూలుగా అందరిలాగే పెరిగి వుంటే జబ్బులూ, రోగాలూ, వార్ధక్యం, మరణం - ఇవన్నీ సహజంగానే ప్రతి మనిషికీ వచ్చి తీరతాయని తెలిసి వుండేది సిద్దార్థుడికి. అయితే ఒక్కసారి అంతఃపుర వాసం విసుగు పుట్టి బలవంతంగా బయటికి రథంలో వెళ్లినప్పుడు ‘మరణించిన ఒక మనిషి’ శవాన్ని చూసిన వెంటనే తన రథసారథిని అడిగాడు. ఏమైంది ఈ మనిషికి! ఇది అతడి మొదటి ప్రశ్న!
అతడు మరణించాడు అని చెప్పాడు రథసారథి. నేను మీకు చెప్పకూడదు. ఊళ్లో అందరికీ ముందే చాటించి చెప్పారు. మీరు నగరంలోకి వస్తున్నారని, కాబట్టి ఏ రోగిష్ఠివాడూ, ఏ వృద్ధుడూ, ఏ శవమూ మీకు కనిపించకూడదన. అయినా నేను మీకు అబద్ధాలు చెప్పలేను. సత్యం చెపుతున్నాను. ఇది అతడి శవం. మరణించాడు.
సిద్దార్థుని రెండవ ప్రశ్న: నాక్కూడా ఇలా జరుగుతుందా?
రథసారథి : అవును యువరాజా! చెప్పడం ఇష్టం లేకున్నా మీకు అబద్ధం చెప్పకూడదు. అందరికీ ప్రతి ఒక్కరికీ ఇదే జరుగుతుంది. ఏ ఒక్కరూ దీన్ని తప్పించుకోలేరు. ఎవరినీ విడిచిపెట్టదు ‘మృత్యువు’.
మూడవ ప్రశ్న: కాషాయ వస్త్రాలు ధరించిన ఓ సన్యాసిని చూసి అడిగాడు గౌతముడు. ఎవరీ మనిషి? ఏమిటీ విచిత్ర వేషధారణ?
బుద్ధుడికి రథసారథి చెబుతున్నాడు. ఈ మనిషి శాశ్వతత్త్వం కోసం వెదుకుతున్నాడు. జీవితం క్షణికమే అన్న సత్యాన్ని ఆ మనిషి తెలుసుకున్నాడు. జీవితం ఓ కల వంటిదనీ, తెలుసుకున్న ఆ సన్యాసి, తన దేహం మరణించినా, మరణించకుండా తనలో ఇంకేదైనా మిగిలి వుంటుందా.. లేకపోతే శూన్యం మాత్రం మిగిలుంటుందా.. అనే విషయాన్ని గురించి తెలుసుకోవాలని అనే్వషిస్తున్నాడు. సత్యానే్వషి ఆయన.
గౌతముడు సాంవత్సరిక వనోత్సవాన్ని మెదలుపెట్టడానికి పిలువబడ్డాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకున్నా తండ్రి కుమారుడిని పంపవలసి వచ్చింది ఆ యొక్క యవ్వనోత్సవానికి. రథాన్ని మళ్లించు. నన్ను ఇంటికి చేర్చు. నేను మోసగించబడ్డాను. ఏమీ తెలియకుండా పెంచారు నన్ను అని విరక్తితో రాజభవనానికి వెళ్లిపోయాడు గౌతముడు.
అత్యంత ప్రియతమురాలు మేనమరదలు - భార్య అయిన యశోధరను, అప్పుడే జన్మించిన ప్రియతమ కుమారుడిని వదిలి వెళ్లిపోయాడు గౌతముడు ఎవ్వరికీ చెప్పకుండా. ఆ రోజు రాత్రి జన్మించిన రాహులుడిని కనీసం గదిలోకి వెళ్లకుండా వాకిలి వద్ద నుండే చూసి, మళ్లా దగ్గరికి వెడితే బంధంతో వెనుదిరగనేమో అనే భావనతో వెళ్లిపోయాడు.
బుద్ధుడు ఇల్లు విడిచి, భార్యా, కొడుకు, తల్లిదండ్రులను, అధికారాన్ని, రాజ్యాన్ని విడిచి వెళ్లిపోయింది కామానికి భయపడి కాదు, అప్పటిదాకా తానొక చెరసాలలో వున్నానని తెలుసుకోగలిగాడు కనుక. ఆపైని బుద్ధుడి కథను మరొక సందర్భంలో చెప్పుకుందాం.
బుద్ధుడి ప్రజ్ఞోదయం ఎంతో సులభమైన అతిసౌఖ్యపు సంభవం. ఆ దారి ఎంతో సుగమం, సులభం, స్పష్టం. ‘ఆనాపానసతి’ అనబడే ‘శ్వాస మీద ధ్యాస’ ధ్యానాన్ని మీరు కులాసాగా కూర్చుని మీరు మీ అంతరంలోకి వెళ్లి ఆ ‘్ధ్యనమేలుకొలుపు’ను ఆనందంగా అనుభవించవచ్చు.
గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం ఉండినంత దూరం మనకు లేదు. ఓ అంధుడు వెతికినట్లు ఆయన దాని కోసం వెదికాడు. ఎంతోకాలం తానెక్కడికి వెళుతున్నాడో తనకే తెలియకుండా! కానీ ఎంతో ధైర్యం, నిబ్బరం ఉన్న బుద్ధుడు పనె్నండు సంవత్సరాలు నిరంతరం అనే్వషించాడు. ఆ రోజుల్లోని అన్ని పద్ధతులనూ, మార్గాలనూ ప్రజ్ఞోదయం కోసం అనుసరించాడు. వేదాంతం గురించీ, యోగశాస్త్రం గురించీ ఎందరో ఆచార్యుల మాటలను విని ఆచరించాడు. ఓ ఆచార్యుడి నుండి మరొక ఆచార్యుడి వద్దకు అయిదేళ్లు తిరిగాడు. చివరికి ఓ వైశాఖ పూర్ణిమ రోజు ఓ బోధివృక్షం కింద సాధించాడు అపూర్వ జ్ఞానోదయాన్ని! అనంత సత్య సంభవాన్ని! ఏ సంకల్పాలూ లేని క్షణంలో ఉన్నట్లుండి గౌతముడు బుద్ధుడయ్యాడు.

-మారం శివప్రసాద్