హైదరాబాద్

కుంగుబాటు అంటువ్యాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక చైతన్యంతోనే పరిష్కారం టెక్నాలజీ అందుకు సహాయపడాలి
ఐటీ కాంగ్రెస్ వేదికపై మెరిసిన దీపిక ముగిసిన ప్రపంచ ఐటీ కాంగ్రెస్
తదుపరి సమావేశాలు అర్మేనియాలో నిర్వహణకు నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 21: కుంగుబాటు ప్రపంచానికి అంటువ్యాధిలా తయారైందని ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ నటి దీపికా పదుకొనె వ్యాఖ్యానించారు. మానసిక ధృడత్వంపై పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. సామాజిక చైతన్యంతోనే కుంగుబాటుకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తాను ఒంటరిననే భావనను దరిచేయనీయకుండా చూసుకోవాలన్నారు. నిత్యం మనతో కలిసి ఉండేవారు ఏం చెబుతున్నారో, వాళ్లలో వస్తున్న మార్పులేమి టో గమనిస్తూ ఉండాలని, వారిలోని కుంగుబాటు లక్షణాలను గుర్తించి అండగా నిలవాలన్నారు. క్లిష్ట సమయాల్లో తనకు అమ్మ అండగా నిలిచారని ఈ సందర్భంగా దీపిక గుర్తుచేసుకున్నారు. ప్రపంచ ఐటి కాంగ్రెస్, నాస్కామ్ ఐఎల్‌ఎఫ్ -2018 సదస్సులు ఎంతో వేడుకగా బుధవారం సాయంత్రం ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఐటీ కాంగ్రెస్‌లో హేమాహేమీలైన ఐటీ దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు, నిపుణులు పాల్గొన్నారు. తొలి రోజు భారత ప్రధాని నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా సదస్సును ప్రారంభించగా, రెండో రోజు కృత్రిమే మేథోసంపన్నురాలైన సోఫియా తమ మాటలతో మైమరిపించింది. మూడోరోజు ముగింపు సందర్భంగా బాలీవుడ్ సినీనటి దీపికా పదుకొనె హాజరయ్యారు. వివిధ దేశాల నుండి వచ్చిన ప్రముఖులకు పేరుపేరునా నాస్కామ్ చైర్మన్ రామన్‌రాయ్, అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్, విట్సా సెక్రటరీ జనరల్ జిమ్ పోసంట్, విట్సా చైర్మన్ యువన్ చు ధన్యవాదాలు తెలిపారు. డాటా సైన్స్, కృత్రిమ మేథస్సు, భవిష్యత్ ఐటీ సవాళ్లు, బ్లాక్ చైన్ తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది.
వచ్చే సదస్సు ఆర్మేనియాలో
వచ్చే ఏడాది ఐటీ కాంగ్రెస్ సమావేశం ఆర్మేనియాలో జరగనుంది. దీంతో ఆర్మేనియా సదస్సు నిర్వహణ బాధ్యతలను ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌కు అప్పగించింది. అనంతరం హైదరాబాద్- తైవాన్ నగరాల మధ్య అవగాహన ఒప్పందం జరిగింది.
డిజిటల్ ఎకానమీ, బ్లాక్ చైన్‌పై చర్చ
మూడో రోజు డిజిటల్ ఎకానమి, బ్లాక్ చైన్‌పై చర్చ జరిగింది. బ్లాక్‌చైన్ ఇన్నోవేషన్ మీడియా ప్రతినిధి డాన్ తాప్‌స్కాట్ అనేక కొత్త విషయాలను వివరించారు. ఒక విలువైన రహస్య సమాచారాన్ని వివిధ ప్రాంతాల్లో భద్రపరచి దానిని ఇతరులు తస్కరించకుండా ఒకదానితో మరొకటి అనుసంథానించే అత్యాధునిక సాంకేతిక భద్రతా టెక్నాలజీనే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటున్నామని అన్నారు. నెట్‌వర్కులోకి పాస్‌వర్డు ఉన్న వారు మాత్రమే ప్రవేశించగలుగుతారని, ఇతరులు ప్రయత్నిస్తే క్షణాల్లో ఆ విషయం తెలుస్తుందని చెప్పారు. డేటాను భద్రపరిచే ప్రాంతాలను నోడ్స్ అని, పాస్‌వర్టులను హాష్‌కీ అని వ్యవహరిస్తున్నామని, డేటాను క్రిప్టోలజీ విధానం ద్వారా కోడ్స్‌లోకి మార్చి భద్రపరుస్తామన్నారు. ఈ టెక్నాలజీ సైబర్ నేరాలకు ముకుతాడు వేస్తుందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎవరు ఏంచేసినా ఇట్టే తెలుస్తుందని వివరించారు. మరో చర్చలో అప్‌డైనమిక్ సిఇఓ జ్యోతి బన్సాల్, గూగుల్ ఎక్స్ ప్రతినిధి టామ్ మోర్ మాట్లాడారు. నాస్కామ్ ఫౌండేషన్ నిర్వహించిన సదస్సులో మంత్రి కేటీఆర్, సియాంట్ చైర్మన్ బీవీఆర్ మోహనరెడ్డి, నాస్కామ్ ఫౌండేషన్ చైర్మన్ అరుణ్ సేథ్ పాల్గొన్నారు. ఐటీ నిర్వహణపై బీసీజీ ఎండి నీరజ్ అగర్వాల్ మాట్లాడారు.
chitram...

ప్రపంచ ఐటీ కాంగ్రెస్ వేదిక నుంచి మానసిక ధృఢత్వంపై ప్రశ్నలకు సమాధానాలిస్తున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొనె