జాతీయ వార్తలు

బుందేల్‌ఖండ్‌కు వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఫిబ్రవరి 21: బడ్జెట్‌లో ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చిన వాగ్దానాన్ని కేంద్రం నెరవేర్చింది. యూపీలో బాగా వెనకబడిన బుందేల్‌ఖండ్ ప్రాంతంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ (డీఈసీ) ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఇక్కడ వెల్లడించారు. రాజధాని లక్నోలో ‘యూపీ ఇనె్వస్టర్స్ సమ్మిట్- 2018’ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిఫెన్స్ కారిడార్‌కు 20 వేల కోట్ల రూపాయలు ప్రకటించారు. యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తోందని ప్రధాని ప్రశసించారు. ‘యోగీ సారథ్యంలో నవీన ఉత్తర ప్రదేశ్ ఆవిర్భవిస్తోంది. దేశానికి యూపీనే చోదక శక్తి అవుతుంది’ అని ఉద్ఘాటించారు. కేంద్ర బడ్జెట్‌లో రెండు డిఫెన్స్ కారిడార్‌లు ప్రకటించినట్టు తెలిపారు. అందులో ఒకటి బాగావెనకబడిన ప్రాంతమైన బుందేల్‌ఖండ్‌లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 22వేల కోట్లతో ఏర్పాటు చేసే కారిడార్ వల్ల రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. బుందేల్‌ఖండ్ అభివృద్ధి చెందితే ఉత్తరప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయన్నారు. ఈ డిఫెన్స్ కారిడార్‌ను ఆగ్రా, అలహాబాద్, లక్నో, కాన్పూర్, ఝాన్సీ, చిత్రకూట్ వరకూ విస్తరించనున్నట్టు ప్రధాని ప్రకటించారు. దేశంలో రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్టు 2018 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో తెలిపారు. ఒక కారిడార్‌ను చెన్నై- బెంగళూరు మధ్య ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం మొన్నీమధ్యే ప్రకటించిన సంగతి తెలిసింది. రెండోదాన్ని బుందేల్‌ఖండ్‌లో ఏర్పాటు చేస్తామని లక్నో వచ్చిన ప్రధాని ప్రకటించారు. చెన్నై కారిడార్ పరిధిలోకి కొయంబత్తూర్ తదితర నగరాలను తీసుకొస్తారు. ఈ కారిడార్లు దేశ రక్షణ రంగం బలోపేతానికి దోహదపడతాయని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి పథకాలను ప్రకటించారు. ప్రధానంగా ముద్రా యోజన పథకం అందులో ఒకటి.
కాగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించాలన్న ఉద్దేశంతో యోగి ప్రభుత్వం ఇనె్వస్టర్ల మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశం రెండు రోజులుపాటు జరుగుతుంది. ఉత్తరప్రదేశ్‌పై ఉన్న అపప్రద తొలగించడానికి యోగీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సంద్భంగా ప్రధాని అన్నారు. గత పాలకుల వల్ల రాష్రాభివృద్ధి కుంటుపడిందని, దాన్ని గాడిలోపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు ఆయన వివరించారు. పారిశ్రామికీకరణతో అభివృద్ధి అలాగే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఆ లక్ష్యం కోసం ఆదిత్యనాథ్ సర్కార్ చేస్తున్న కృషి అభినందనీయమని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా ‘వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రొడక్ట్ పాలసీ’ రాష్ట్ర దశనే మార్చేస్తుందని ప్రధాని తెలిపారు. అభివృద్ధిలో మహారాష్ట్ర, యూపీలు పోటీ పడుతున్నాయన్న మోదీ ‘ఇలాంటి పోటీ అభివృద్ధికి దోహదపడుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సమాఖ్య స్ఫూర్తికి చుక్కానీ’అని మోదీ వ్యాఖ్యానించారు. హవాయ్ చెప్పులు వేసుకున్న వారు కూడా విమానంలో విహరించాలన్నది తన కల అని ప్రధాని స్పష్టం చేశారు.

chitram...

ఉత్తరప్రదేశ్‌లో బుధవారం నిర్వహించిన ఇనె్వస్టర్ల మీట్‌లో ప్రధాని మోదీకి రాష్ట్రం తరఫున మెమెంటో అందచేస్తున్న సీఎం ఆదిత్యనాథ్