తెలంగాణ

దళితులపట్ల అంత నిర్లక్ష్యమా..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నదని జాతీయ ఎస్సీ కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిషన్ చైర్మన్ రాంశంకర్ ఖతారియా, వైస్ చైర్మన్ మురుగన్, జాయింట్ సెక్రటరీ సుమిత, కమిషన్ సభ్యుడు యోగేందర్, రాములు తదితరులు బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎస్ ఎస్‌కె జోషి, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు 39 శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, హత్యలు, సబ్ ప్లాన్ నిధుల దుర్వినియోగం, మళ్లింపు, దళితుల భూములు స్వాధీనం, విద్యార్థుల ఉపకార వేతనాలు, నేరెళ్ల ఘటనలో జిల్లా ఎస్పీపై చర్యలు తీసుకోకపోవడం, దళిత భూములను ఇతరులు ఆక్రమించడం, నిరక్షరాస్యత తదితర అంశాలపై ప్రశ్నలతో అధికారులను ఉక్కిరి బిక్కిరి చేశారు. అనంతరం కమిషన్ చైర్మన్ ఖతారియా, వైస్ చైర్మన్ మురుగన్, సభ్యులు రాములు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సంబంధిత ప్రభుత్వ శాఖలు సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దళితులకు రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులు సక్రమంగా అమలు కావడం లేదన్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, నమోదైన కేసుల్లో చార్జీషీట్లు దాఖలు చేయకుండా జాప్యం చేయడంతో బాధితులకు న్యాయం జరగడం లేదన్నారు. పైగా నష్టపరిహారం చెల్లించడంలోనూ జాప్యం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాచార ఘటనల్లో తెలుగు రాష్ట్రాల్లో స్టేషన్ బెయిల్స్ ఇస్తూ నిందితులను కాపాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పోలీసులు కేసు ఫైల్ చేయకపోతే బాధితులు కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆదేశాల మేరకే కేసు ఫైల్ చేసిన దాఖలాలూ తమ దృష్టికి వచ్చాయన్నారు.
నిధుల ఖర్చు అంతంత మాత్రమే
దళితుల అభివృద్ధికి భారీగా నిధులను కేటాయిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం సగం కూడా ఖర్చు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని వెంటనే సరి చేయాల్సిందిగా రెవెన్యూ శాఖను ఆదేశించామన్నారు. అదేవిధంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దళితుల భూములను బలవంతంగా లాక్కొంటున్నారని, ప్రజల కోసం తీసుకుంటున్న భూములకు ప్రభుత్వం కనీసం నష్టపరిహారం కూడా చెల్లించడం లేదన్నారు. మరో మూడు నెలల్లో తిరిగి కమిషన్ రాష్ట్రంలో సమీక్ష నిర్వహిస్తుందని తెలిపారు. పలు అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషన్ గురుకుల పాఠశాలల విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని ప్రశంసించింది. విద్యార్థులకు సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందుతున్నదని తెలిపింది.