మెయన్ ఫీచర్

‘అందరి కలయిక’ అందమైన ఊహే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏడాది ఎన్నికలు కావడం వల్ల సహజంగానే రాజకీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, లాభ నష్టాలను బేరీజు వేసుకుంటుంది. వామపక్ష పార్టీలకు బలం
లేకపోయినా అన్ని శక్తులను కూడదీసుకుని రాష్ట్రప్రయోజనాలకు
పోరాడుతున్నాయి. ఏ ఉద్యమమైనా విద్యార్థి, యువజన సంఘాల పాత్ర లేకుండా తీవ్రరూపం దాల్చదు. 1972లో ‘జై ఆంధ్ర’ ఉద్యమం తీవ్ర స్ధాయికి చేరుకోవడానికి విద్యార్థి సంఘాలు గణనీయమైన పాత్ర పోషించగా, అప్పటి పార్టీ నేతలు
స్వలాభానికి వాడుకుని ఉద్యమాన్ని నీరుకార్చాయి. వామపక్ష పార్టీలు
బలహీనపడడంతో, విద్యార్థి సంఘాల క్రియాశీల పాత్ర తగ్గుముఖం పట్టింది.

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కాలం చెల్లిన ‘రాజీనామాల సిద్ధాంతాలు’ తెరపైకి వస్తున్నాయి. రాజీనామాల వల్ల ప్రజలకు, రాష్ట్రానికి జరిగే మేలు ఉండదు. దీని వల్ల ఉపఎన్నికలు వస్తే ప్రజాధనం వృథా అవుతుంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు ఆంధ్రా ఎంపీలు రాజీనామా చేసినా ఉపఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుందన్న నమ్మకం లేదు. 8, 9 నెలల వ్యవధిలో లోక్‌సభ కాలపరిమితి అయిపోతుంటే, ఉపఎన్నికలు నిర్వహించడం కష్టమే. లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖలను సమర్పించిన వెంటనే అవి అమలులోకి రావు. స్పీకర్ రాజీనామాలను ఆమోదించినప్పటి నుంచి ఆరు నెలల కంటే మించి ఆ నియోజకవర్గం ఖాళీగా ఉండకూడదు.ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీలు, పార్లమెంటులో ఇచ్చిన వాగ్దానాలు కార్యరూపం దాల్చడానికి తన పార్టీ ఎంపీలు ఏప్రిల్ నెల 5 లేదా 6 తేదీల్లో రాజీనామా చేస్తారని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మరో ముందుడుగు వేసి, హామీల సాధనకు మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టినా మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించారు.
ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో కేంద్రంపై వత్తిడి పెంచుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎటువంటి నిర్ణయం తీసుకునేందుకైనా సిద్ధమంటున్నారు. మంత్రులు, పార్టీ సీనియర్లతో చర్చిస్తూ వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. ‘ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు’ నినాదంతో వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ‘ఏపీ బంద్’ ఇటీవల విజయవంతమైంది. అమరావతిలో ప్రత్యేక హోదా విభజన హామీ సాధన సమితి సమావేశమై ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగారు. సంయుక్త నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి విభజన హామీలు, అమలు, కేంద్రం విడుదల చేసిన నిధులు తదితర అంశాలపై కొన్నిరోజుల్లో నివేదిక వచ్చిన వెంటనే కార్యచరణ ప్రణాళికను ప్రకటిస్తామన్నారు.
టిడిపి మిత్రపక్షం బిజెపి త్వరలో కేంద్రమంత్రులను రాష్ట్రానికి తీసుకువచ్చి, ‘మేము రాష్ట్రానికి చాలా చేశాం, మరింత చేస్తాం’ అని చెప్పే కార్యక్రమాన్ని చేపట్టనుంది.
2014 జూన్ 2 నుంచి ఇంతవరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, విభజన హామీలపై పట్టుమని ఒక నిమిషం కూడా కలుసుకుని మాట్లాడుకోలేదు. మరే రాష్ట్రంలోలేని విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. ఏపీకి కేంద్రంలో 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు బిజెపి అన్యాయం చేసిందని ప్రజలు విశ్వసిస్తున్నారు. శాసనసభ నాయకుడు, ప్రతిపక్ష నేత చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే రాష్ట్రానికి న్యాయం జరిగేందుకు అవకాశం ఉంటుంది. విస్తృతస్థాయి అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు చంద్రబాబు చొరవ తీసుకోవాలి. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరో మాటకు తావులేకుండా వైఎస్ జగన్‌ను సాదరపూర్వకంగా ఆహ్వానించి అమరావతిలోని సచివాలయంలోనే మాట్లాడితే బాగుంటుంది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోయినా వామపక్ష పార్టీలను చంద్రబాబు అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తే హుందాగా ఉంటుంది. చంద్రబాబుకు సరిసమాన నేత మరొకరు రాష్ట్రంలో ఇప్పుడు లేరు. ఆయన పాలనను విమర్శించవచ్చు. కాని తూలనాడే ధోరణిని విపక్షాలు విడనాడాలి. అదే సమయంలో టిడిపి కూడా వైకాపా, ఇతర పక్షాలను వ్యక్తిగతంగా నిందించే పద్ధతికి స్వస్తి చెప్పాలి. జగన్ కూడా పంతాలు, పట్టింపులకు పోకుండా చంద్రబాబు నుంచి ఆహ్వానం వచ్చిన వెంటనే అమరావతికి వెళ్లి రాష్ట్ర సమస్యలపై ఢిల్లీకి వెళ్లి గళం విప్పేందుకు తన వంతు సహకారం ఉంటుందని చెప్పాలి. సీఎణ చంద్రబాబు, విపక్ష నేత జగన్ అన్ని పార్టీలను కలుపుకుని రాష్ట్రప్రయోజనాలకు మేమంతా ఒక్కటే అనే సంకేతాన్ని బలంగా ఢిల్లీకి వినిపిస్తే ప్రధాని నరేంద్రమోదీ తప్పనిసరిగా దిగివస్తారు. ‘మీ ముఖ్యమంత్రి, మీ ప్రతిపక్ష నేత ఒకరికొకరు కలుసుకోరు. కనీసం వారిద్దరి మధ్య మర్యాద కోసం కరచాలనాలు లేవు. పలుకరింపులు ఎక్కడ ఉంటాయి. ఒకరినొకరు తారసపడే సందర్భాలు ఉన్నా, అవి ఎదురుకాకుండా చూసుకుంటారు. ఎన్నికల్లోనే ఎవరి జెండాలు, అజెండాలు. సాధారణ సమయాల్లో కూడా రాష్ట్రానికి ఒక వైపు తీరని ద్రోహం జరుగుతుంటే ఇంకా భీష్మించుకుని కూర్చోవడం, ఎడ ముఖం పెడముఖంతో ఈ ఇద్దరు నేతలు వ్యవహరిస్తే ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారు’ అని ఇతర దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల నేతలు, సీనియర్ రాజకీయనేతలను ఎవరినడిగినా పై మాటలే మాట్లాడుతున్నారు.
మార్చి నెల మొదటి వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అదే సమయంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం కచ్చితంగా ఆంధ్రకు విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై ప్రకటన చేయాలి. దీని కోసం జన సేన, వామపక్ష పార్టీలు ఎవరికి వారు చేస్తున్న ఉద్యమాల వల్ల కేంద్రంలో కదలిక వస్తే మంచిదే. ప్రధాన పార్టీలు టిడిపి, వైకాపా చేతులు కలపాలి. ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉంది. కేంద్రంపై వత్తిడి తెచ్చి కొన్ని హామీలైనా నెరవెర్చే ప్రయత్నం చేస్తే, ఆ క్రెడిట్ మాదంటే మాది అని రెండు పార్టీలు జనంలోకి వెళ్లి చెప్పుకోవచ్చు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో వీరి భవిష్యత్తును నిర్ణయిస్తారు. రాష్ట్రప్రయోజనాలకు ఎవరికి వారు సొంత అజెండాలతో పోరాడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇదే కొనసాగితే చివరకు సమైక్య ఉద్యమంలో వచ్చిన జీరో ఫలితాలే మళ్లీ పునరావృతమవుతాయి.
ఉమ్మడి రాష్ట్రంలో రకరకాల కారణాలతో వరుస రాజీనామాలతో ప్రజలు విసుగు చెందారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక పార్లమెంటు. పార్లమెంటు వేదికగా టిడిపి, వైకాపా పార్టీలు పోరాడాలి. పార్లమెంటులోపల అలజడి సృష్టించాలి. పార్లమెంటులో ఒక్క అంశంపై కూడా చర్చ జరగనివ్వకుండా చేయాలి. లోక్‌సభ సమావేశాల్లో గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్ తన శక్తిమేర ఆంగ్లంలో మాట్లాడి ప్రపంచానికి ఆంధ్రుల బాధలను చెప్పినందుకు అభినందించాలి. రాష్ట్ర సమస్యలపై ఈ తరహాలో మాట్లాడిన నేత ఇటీవల కాలంలో మరొకరులేరు. క్రీడాకారులు క్రీడామైదానంలోనే తమ ప్రతిభతో ఆడి మెప్పించాలి. అంతేకాని రోడ్డుపైకి వచ్చి ఆడితే విలువ ఉండదు. ఆంధ్ర ఎంపీలు పార్లమెంటులో తన పోరాటాన్ని ఉధృతం చేయాలి. పోరాడేందుకు పార్లమెంటుకు మించిన వేదిక మరొకటి ఉండదు. రాజీనామాల విషయమై తెలుగుదేశం పార్టీ తీరును విశే్లషిస్తే సరైన హామీ రానిపక్షంలో కేంద్రమంత్రి పదవులకు టిడిపి ఎంపీలు గుడ్‌బై చెప్పడం మంచిది.
వచ్చే ఏడాది ఎన్నికలు కావడం వల్ల సహజంగానే రాజకీయ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, లాభ నష్టాలను బేరీజు వేసుకుంటుంది. వామపక్ష పార్టీలకు బలం లేకపోయినా అన్ని శక్తులను కూడదీసుకుని రాష్ట్రప్రయోజనాలకు పోరాడుతున్నాయి. ఏ ఉద్యమమైనా విద్యార్థి, యువజన సంఘాల పాత్ర లేకుండా తీవ్రరూపం దాల్చదు. 1972లో‘జై ఆంధ్ర’ ఉద్యమం తీవ్ర స్ధాయికి చేరుకోవడానికి విద్యార్థి సంఘాలు గణనీయమైన పాత్ర పోషించగా, అప్పటి పార్టీ నేతలు స్వలాభానికి వాడుకుని ఉద్యమాన్ని నీరుకార్చాయి. వామపక్షపార్టీలు బలహీనపడడంతో, విద్యార్థి సంఘాల క్రియాశీల పాత్ర తగ్గుముఖం పట్టింది. రాజకీయ పార్టీల కార్యకర్తలు, పెద్దలతో కూడిన ఉద్యమాల వల్ల ఉద్యమ వాతావరణం ఉండదు. హింసాత్మక ఉద్యమాల వల్ల వచ్చే ప్రయోజనం లేదు. రాజ్యాంగ వ్యతిరేకమైన నిరసనలకు ప్రజల ఆమోదం ఉండదు. ఈ పరిస్థితుల్లో గాంధేయ మార్గం ఒక్కటే పరిష్కార మార్గం. ఒక వైపు పార్లమెంటు లోపల, వెలుపల రాజకీయాలకు అతీతంగా టిడిపి, వైకాపాలు చేతులు కలిపి నినదిస్తే, ఇక్కడ ఆంధ్రరాష్ట్రంలో అన్ని పార్టీలు ఒక వేదిక ద్వారా ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజాస్వామ్యయుతంగా గాంధేయ మార్గంలో ఉద్యమానికి శ్రీకారం చుడితే, కచ్చితంగా విభజన హామీలకు పరిష్కారం లభిస్తుంది.

- కె. విజయశైలేంద్ర 98499 98097