సబ్ ఫీచర్

అవును.. ప్రజలు చూస్తున్నారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే- ప్రతిరోజూ టీవీ చానల్స్‌లో పొద్దునా, సాయంత్రం వీక్షకుల చెవులు బద్ధలయ్యే స్వరాలతో వచ్చే హోరాహోరీ చర్చోపచర్చలు వింటూ ఉండటం వల్ల! ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీ నిలదీస్తూ, కడిగేస్తున్న సందర్భంలో ఆత్మరక్షణలో పడిన సదరు పార్టీనేత ‘ప్రజలు చూస్తున్నారు.. వాస్తవాలు వాళ్లకు తెలుసు’ అనేస్తాడు. ‘కాగల కార్యం
గంధర్వులే చేస్తారు..! అన్నట్టు సాక్ష్యంగా ప్రజలను నిలబెట్టేస్తే ఠక్కున ఒక పనై
పోతుంది, ‘డైలాగూ పవర్‌ఫుల్‌గా వస్తుంది’ అన్నది తన
అభిప్రాయం కావచ్చు.

రాజకీయ నాయకులకు ఓటర్లంటే చచ్చేంత ప్రేమ. ఎన్నికలు దగ్గరికి వస్తున్నపుడు ఆ ప్రేమ మరింత పెరిగి ఉప్పెనలా పొంగి వరదలై పారుతూ ఉంటుంది. ఇంతకూ ఓటర్లంటే ఎవరు..? నేతల మాటల్లో చెప్పాలంటే- ‘పాలకుల అధికారం కింద పడివుండే ప్రజలు.. ప్రతిపక్షాలకు- ఒకవేళ వాళ్లు గెలిచి పాలకులయితే ‘తమ అధికారం కింద పడి ఉండబోయే ప్రజలు’. ప్రజలే తమ భవిష్యత్ ఆశాకిరణాలు. అందుకే ఎవరికి వాళ్లు ప్రజలను మాటలతో ఎలా మస్కాకొట్టాలా? తమవైపు ఎలా తిప్పుకోవాలా? అని చూస్తుంటారు. ‘ప్రజలే దేవుళ్లు’ అని, ‘ఓటరు మహాశయులు’ అంటారు. ‘ప్రజాసేవే మా లక్ష్యం’.. ‘రాష్ట్భ్రావృద్ధే మా పార్టీ ఆశయం’ అంటారు. వాళ్లు చేసే మోసాలను, అక్రమాలను, అరాచకాలను, స్కామ్‌లను కప్పిపుచ్చుకోవటం కోసం ఇలా ప్రజల నామజపం చేస్తూ ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తారు. సూర్యుడిని, చంద్రుడిని, సకల ప్రకృతినీ తమ పార్టీలో ఇష్టానుసారం చేర్చుకోగల అపర చాణక్యులలాంటి నేతలకు ప్రజలు ఒక లెక్కా! ‘ఆఫ్ట్రాల్ గొర్రెలు’ అన్నది వాళ్ల నిశ్చితాభిప్రాయం.
ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే- ప్రతిరోజూ టీవీ చానల్స్‌లో పొద్దునా, సాయంత్రం వీక్షకుల చెవులు బద్దలయ్యే స్వరాలతో వచ్చే హోరాహోరీ చర్చోపచర్చలు వింటూ ఉండటం వల్ల! ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీ నిలదీస్తూ, కడిగేస్తున్న సందర్భంలో ఆత్మరక్షణలో పడిన సదరు పార్టీనేత ‘ప్రజలు చూస్తున్నారు.. వాస్తవాలు వాళ్లకు తెలుసు’ అనేస్తాడు. ‘కాగల కార్యం గంధర్వులే చేస్తారు..! అన్నట్టు సాక్ష్యంగా ప్రజలను నిలబెట్టేస్తే ఠక్కున ఒక పనైపోతుంది, ‘డైలాగూ పవర్‌ఫుల్‌గా వస్తుంది’ అన్నది తన అభిప్రాయం కావచ్చు. అవతలి పార్టీ వాళ్లేమయినా తక్కువ తిన్నారా? మరికొంతసేపు చర్చ ముందుకు నడిచాక.. తమమీద అభియోగాలు వచ్చినప్పుడు వాళ్లూ అదే డైలాగు- ‘ప్రజలు చూస్తున్నారు.. వాళ్లే మీకు తగిన సమయంలో బుద్ధి చెబుతారు’ అని!
‘ప్రజలు’ అంటే ఏ ఒక్కరో కాదు.. వెళ్లి అక్కడికక్కడ సమాధానం చెప్పటానికి.. అదొక సమూహం..! వాళ్లు వౌనమునులు పాపం..! నోరూవారుూ లేనివాళ్లు. అందుకే రాజకీయ నాయకులందరికీ ప్రజలంటే బోలెడు అలుసు..! వాళ్లను అడ్డం పెట్టుకుని ప్రస్తుతానికి తమ పబ్బం గడుపుకోవచ్చునని.. తాము చేసిన పాపాలను చస్తూ నిలబడుతూ వాళ్లే మోస్తారని వాళ్ల నమ్మకం. అందుకే చర్చల్లో పాల్గొనే నాయకులకు (విశే్లషకులకు తప్ప) ‘ప్రజలు చూస్తున్నారు..!’ అన్నది ఓ రొటీన్ డైలాగుగా మారిపోయింది. ‘దొందూదొందే’.. ‘అందరూ దొంగలే’ అన్నట్టు రాజకీయాలు భ్రష్టుపట్టిపోయిన ఈ పరిస్థితుల్లో అందరూ అదే డైలాగు అంటే ఇక దానికేమయినా విలువ ఉంటుందా..? వీక్షకుల మధ్య ఓ జోక్ అయిపోదూ! ‘ఈ చర్చలు వాళ్ల కంఠశోషకు, మన కర్ణశూలకు తప్ప ఎందుకు పనికి వస్తాయి.. వాటివల్ల ప్రయోజనం ఏమిటి?
ఈ పొలిటికల్ వార్‌లో ఇరు పార్టీల మధ్య చిక్కుకుని ‘ఒకరు అటు, మరొకరు ఇటు’ లాగుతుంటే దిక్కుతోచని స్థితిలో విలవిలలాడిపోతున్నారు పాపం ప్రజలు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో పార్లమెంట్ సమావేశాలప్పుడు మొదలై ఇప్పుడు తీవ్ర రూపం దాల్చిన లడాయిని చూస్తున్నాం కదా! ‘ఆంధ్రప్రదేశ్‌కు మేము కోట్లకు కోట్లు నిధులిచ్చాం.. ఆ విషయం టిడిపి వాళ్లు కాదన్నా ప్రజలకు తెలుసు’.. అంటారు బిజెపి వాళ్లు. ‘మాకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. మా రాష్ట్రాన్ని నిట్టనిలువునా ముంచి నమ్మకద్రోహం చేసింది. ఈ విషయాన్ని వాళ్లు అంగీకరించకపోయినా.. ప్రజలు చూస్తున్నారు. వాళ్లే రేపు ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారు’ అంటారు తెలుగుదేశం వాళ్లు..! ‘హతోస్మి’ అని తలపట్టుకోవటం ప్రజల వంతు అవుతోంది. ఒక రొట్టె కోసం రెండు కోతులు పోట్లాడుకుంటుంటే.. మధ్యలో పంపకం నెపంతో వచ్చిన పిల్లి మొత్తం రొట్టెను కాజేసినట్లు ‘ప్రత్యేకహోదా ఆంధ్రా ప్రజల హక్కు’ నినాదంతో ప్రజల మెళ్లో గంటకట్టి పదవి కోసం అవతల కాచుకుని కూర్చున్నాడు ప్రతిపక్ష పార్టీ నేత.
ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే నెంబర్‌వన్ సీఎంగా పేరు గడిస్తూ రాష్ట్రంలో బలంగా పాతుకుపోయిన కెసిఆర్ పార్టీ జెండాను ఎలా పీకి అవతల పారేసి అయనను గద్దె దించాలా? అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్, బిజెపి పార్టీలు ‘ఆయనవన్నీ ఆచరణ సాధ్యం కాని పథకాలు.. ఆ విషయం ప్రజలకు తెలుసు’ అంటారు. ‘ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధిని తెలంగాణలో సాధించాం. ఇది దేశంలోనే నెంబర్ వన్ స్టేట్. ఆ అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు’ అంటారు టీఆర్‌ఎస్ వాళ్లు. ‘ఇదెక్కడి గోల’ అని తలపట్టుకోవటం ప్రజల వంతు అవుతోంది. అసలే టీవీ చానళ్ల రాజకీయ చర్చలతో విసిగి వేసారిపోయి.. వైరాగ్యంతో ఒకరకమైన ఫ్రస్ట్రేషన్‌తో ‘టీవీ సన్యాసం’ తీసుకోవాలని ప్రజలు డిసైడైపోతున్న సమయంలో మమ్మల్నెందుకు మీ రాజకీయ కొట్లాటల మధ్యలోకి లాగుతారు? అని ప్రశ్నించే పరిస్థితిలో ఉన్నారు జనం.
ఇంతకూ నేనేమంటానంటే- ‘అవును.. ప్రజలు చూస్తున్నారు’ బుల్లితెరమీద రాజకీయ చర్చలు జరుగుతున్న విధానాన్ని మాత్రమే కాదు.. తెరవెనుక నడుస్తున్న బాగోతాలను కూడా చూస్తున్నారు. చూసి.. విని, రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో, ఎవరికి వెయ్యకూడదో అది కూడా డిసైడ్ అయిపోతున్నారు. ఎందుకంటే- వాళ్లలో మహామేధావులు, విశే్లషకులు, రాజకీయ పండితులు ఉన్నారు. ఇప్పుడు అలా ‘కామ్’గా ఉన్నారని వాళ్లని ‘గొర్రెలు, అమాయక చక్రవర్తులు’ అనుకుంటే అది నేతల తెలివితక్కువతనం. వాళ్లు పైకి అలా కనబడతారు గానీ సమయం వచ్చినప్పుడు ‘ఓటు’ అనే మంత్రదండంతో కుర్చీలు తారుమారు చేయగలరు. ‘ఓకే’ అనుకుంటే అధికార పక్షానికి స్థానభ్రంశం లేకుండా, చెక్కుచెదరనీయకుండా కాపాడగలరు. అదంతా వాళ్ల దయ.. నేతల ప్రాప్తం! అందుకే రాజకీయ నాయకులకు ఒక విన్నపం ఏమిటంటే మీ కుళ్లు రాజకీయాల కోసం.. ప్రజలను పావులుగా వాడుకోవటం కోసం ‘ప్రజలు చూస్తున్నారు’ అన్న మాటను వాడకండి. నిజమైన ప్రజాసేవ, రాష్ట్ర అభివృద్ధి చేసి అప్పుడు ఆ మాట అనండి. ప్రజలు హర్షిస్తారు.

- డా. కొఠారి వాణీచలపతి రావు సెల్: 98492 12448