హైదరాబాద్

మాతృభాషతో వ్యక్తిత్వ వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: మాతృభాష ద్వారా వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పాఠ్య నిర్ణాయక సంఘం అధ్యక్షుడు ఆచార్య వెల్దండ నిత్యానందరావు సూచించారు. బుధవారం హైదరాబాద్ (నారాయణగుడా) లోని కేశవ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ సైనె్సస్‌లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా నిత్యానందరావు హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు మాతృభాషలో బోధన జరిగితే వారిలో విషయ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. మాతృభాషతో పాటు ఇతర భాషలను అధ్యయనం చేయాలని, వివిధ రంగాల్లో రాణించాలని, అందుబాటులో ఉన్న సదవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ జే. నాగేశ్వరరావు మాట్లాడుతూ మాతృభాష పరాజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, ఇతర భాషలను కూడా నేర్చుకుంటే అన్ని రంగాల్లో రాణించవచ్చని చెప్పారు. స్వభాషను గౌరవించాలని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సోమనాథ్ పేర్కొన్నారు. మాతృభాష పరిరక్షణకు మనమంతా పునరంకితం కావాలని ఈ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షురాలు డాక్టర్ కే. లక్ష్మీఅన్నపూర్ణ అన్నారు.
మాతృభాషను విశ్వవ్యాప్తం చేయాలి
కాచిగూడ: మాతృభాషను విశ్వవ్యాప్తం చేయాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డా.నందిని సిధారెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవ వేడుకలు మాతృభాషా పరిరక్షణ సమితి, త్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిధా రెడ్డి మాట్లాడుతూ.. మాతృభాష మహావృక్షం లాటిందని పేర్కొన్నారు. భాష అభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు డా. ఎల్లూరి శివారెడ్డి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు మావిశ్రీ మాణిక్యం, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ప్రముఖ కవి విఠలాచార్యులు, సుజిత్ పాల్గొన్నారు.