హైదరాబాద్

గోల్కొండ మాస్టర్స్ 2018 గోల్ఫ్ టోర్నీ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, పిబ్రవరి 21: ప్రతిష్టాత్మకమైన గోల్కొండ మాస్టర్స్ 2018 గోల్ఫ్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభమైంది. హైదరాబాద్ గోల్ఫ్ సంఘం (హెచ్‌జీఏ), ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) సంయుక్త ఆధ్వర్యంలో గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్‌ను తెలంగాణ టూరిజం శాఖ కార్యదర్శి రష్మీ వర్మ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. రూ.30 లక్షల ఫ్రైజ్‌మనీ కలిగిన ఈ టోర్నమెంట్‌లో దేశ నలుములల నుంచి దాదాపు 122 మంది గోల్ఫ్ క్రీడాకారులతో పాటు వివిధ దేశాలకు చెందిన మేటి గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈనెల 25 వరకు గోల్కొండ సెవన్ టూంబ్స్ సమీపంలోని హైదరాబాద్ గోల్ఫ్ కోర్టులో నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాలకు చెందిన మేటి గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొంటున్నందున టోర్నమెంట్ ప్రత్యేకతను సంతరించుకుంది.
గోల్ఫ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, ఏపీ ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్.రమేష్ కుమార్, హెచ్‌జీఏ అధ్యక్షుడు జే.విక్రమ్ దేవ్‌రావు, కార్యదర్శి శ్రీకాంత్ రావు, హెచ్‌జీఏ కెప్టెన్ సీ.దయాకర్ రెడ్డి, పీజీటీఐ సీఈవో ఉత్తంసింగ్ ముండే పాల్గొన్నారు.