కృష్ణ

నీటి తీరువా వసూళ్లల్లో వెనుకబాటుతనాన్ని వీడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 21: నీటి తీరువా వసూళ్లల్లో వెనుకబాటుతనాన్ని వీడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె విజయకృష్ణన్ రెవెన్యూ అధికారులకు సూచించారు. నీటి తీరువా వసూళ్లతో పాటు జమాబంది కార్యక్రమాన్ని మార్చి, ఏప్రిల్ మాసాంతానికి పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో బందరు, గుడివాడ డివిజన్‌ల రెవెన్యూ అధికారుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నీటి తీరువా వసూళ్లు, జమాబంది, మీ సేవా దరఖాస్తులు, 22ఎ రిజిష్టర్ ఆధునీకరణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జెసీ విజయకృష్ణన్ మాట్లాడుతూ రెవెన్యూ సేవలకు సంబంధించి ఏ సమస్య ఉత్పన్నమైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. ప్రతి రైతు భూమికి ఆధార్ నెంబర్ సీడింగ్‌తో పాటు మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేయాలన్నారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ మట్టి తవ్వకాలపై సంబంధిత వీఆర్‌ఓలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏ విధమైన అవినీతి ఆరోపణలు వచ్చినా సహించేది లేదన్నారు. తహశీల్దార్లు ప్రతి నెలా 5వతేదీ లోపు రెవెన్యూ డివిజనల్ అధికారికి నివేదికలు పంపాలన్నారు. రెవెన్యూ యాక్ట్‌ను పూర్తిగా నేర్చుకుని నిర్ధేశించిన సమయంలో ఫైల్స్‌ను పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ యంత్రాంగంపై ప్రజల్లో మంచి నమ్మకాన్ని తీసుకురావాలన్నారు. ప్రతి రోజూ గ్రామాల్లో పర్యటించి నీటి తీరువా వసూళ్లను వేగవంతం చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. 2014వ సంవత్సరం నుండి 2019వ సంవత్సరం వరకు ఉన్న బకాయిలను మార్చి, ఏప్రిల్ నెలలోపు వసూళ్లు చేసి జమాబంది నిర్వహించాలన్నారు. భూ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపాలన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర వస్తువుల పంపిణీపై రెవెన్యూ, సివిల్ సప్లయిస్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. చౌకధర దుకాణాలపై ఉన్న పెండింగ్ కేసులను పరిశీలించి వాటిపై వేసిన జరిమానాను తక్షణమే ట్రజరీ ద్వారా ప్రభుత్వానికి జమ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బిఆర్ అంబేద్కర్, బందరు, గుడివాడ ఆర్డీవోలు జె ఉదయ భాస్కరరావు, చక్రపాణి, జిల్లా పౌర సరఫరాల అధికారి జి నాగేశ్వరరావు, తహశీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.