శ్రీకాకుళం

సాగరుడి అందాల నడుమ ‘మహోదయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న ప్రధాన నదులు నాగావళి, వంశధార, మహేంద్రతనయ ఐదు ప్రాంతాల్లో సాగర సంగమం అవుతున్న నేపథ్యంలో ఈ నెల 8న పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారు. ఈ ప్రాంతాల్లో కళింగపట్నం, బారువ బీచ్‌లు కూడా ఉండటంతో ఇటు పుణ్యస్నానాలతోపాటు అటు ప్రకృతి అందాలు కనువిందు చేయనున్నాయి. మహోదయంకు జ్యోతిష్యాస్త్ర పరంగా ఉన్న ప్రాధాన్యత, సాగరతీరాల్లోని ప్రకృతి అందాలపై ప్రత్యేక కథనం...
వైదిక జ్యోతిష్యం ప్రకారం పితృకర్మలు చేయడానికి మూడు పుణ్యకాలాలు ఉన్నాయి. వ్యతిపాత, అర్థోదయ, మహోదయ పుణ్యకాలాలు. ఆదివారం అమావాస్య శ్రవణ నక్షత్రంతో కూడితే వ్యతిపాతపుణ్యకాలం అంటాం. ఇది వందసూర్యగ్రహణాలతో సమానం. పౌష్య లేదా మాఘమాసంలో ఆదివారం అమావాస్య శ్రవణ నక్షత్రంతో కూడిందే అర్థోదయ పుణ్యకాలం. అర్థోదయ అంశాలు సోమవారం పడితే మహోదయ పుణ్యకాలం. మహోదయం కోటి సూర్యగ్రహణాలతో సమానమైనదని జ్యోతిష్య పండితుల ఉవాచ. మాఘమాసం ఈ నెల 9న ప్రారంభమవుతుండగా ముందురోజు మహోదయం ఉండటంతో దీనిని వౌని అమావాస్యగా కూడా పిలుస్తారు. వౌని నిశ్శబ్దం, నిశ్శబ్దం కూడా ఆధ్యాత్మిక క్రమశిక్షణలో ఒక భాగం. వౌనం కూడా సన్యాసి మూడుముఖ్యలక్షణాలలో ఒకటిగా ఆదిశంకరాచార్య అభివర్ణించారు. అనంతరం కాలంలోను ఆధ్యాత్మిక బోధన సాధనంగా నిశ్శబ్దాన్ని ప్రచారం చేసిన రమణమహర్షి గురించి తెలిసిందే. అందుకే మహోదయం రోజున స్నానంతోపాటు ధాన్యం కూడా ప్రధానమే. ఇక మహేంద్రతనయ నది బంగాళాఖాతంలో కలిసే సంగమం ప్రదేశం బారువ తీరం రెండో గోవాగా ప్రసిద్ధి కెక్కింది. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు ఇక్కడ ఎంతో ఆహ్లాదిభరితంగా ఉంటుంది. కోటి లింగేశ్వర, జనార్దన దేవాలయాలు ప్రాచీనమైనవి. ఇసుక తినె్నలు, పచ్చని కొబ్బరిచెట్లు పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తాయి.
వంశధార నది సముద్రంలో కలిసే కళింగపట్నం తీరం కూడా ప్రకృతి అందాల నెలవే. సాగరతీరంతోపాటు లైట్‌హౌస్, పోర్ట్ సందర్శకులను అకట్టుకున్నాయి. నాగావళి నది బంగాళాఖాతంలో కలిసే కళ్లేపల్లిలోని వెలసిన మణీనాగేశ్వరస్వామి దేవాలయం పంచారామాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. ఏది ఏమైన మహోదయ వేళ పుణ్యస్నానాలతోపాటు ప్రకృతి అందాలు సందర్శికులను ఆహ్లాదపరుస్తాయనడంలో సందేహం లేదు.
మహోదయ స్నానం...
గంగాస్నాన ఫలం
మహోదయ సమయంలో సాగర సంగమం వద్ద స్నానం చేయడం వల్ల గంగాస్నాన ఫలితం పొందవచ్చునని ప్రకాశరాయ జ్యోతిష్యాలయం పండితుడు తెనే్నటి విక్రమశర్మ తెలిపారు. మహోదయ పుణ్యకాలం 2016 ఫిబ్రవరి ఏడోతేదీ రాత్రి 10:17 గంటల నుండి 2016 ఫిబ్రవరి ఎనిమిదోతేదీ రాత్రి 9:07 గంటల వరకు ఉంటుందని, అరుదుగా సంభవించే అలభ్యపుణ్యకాలంగా దీనిని చెబుతారన్నారు. ఈ సమయంలో పితృకర్మలు, పితృతర్పణాలు, దశదానాలు, షోడశమహాదానాలు చేయడం వల్ల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని జిల్లా అర్చక సంఘం ప్రతినిధి పెంటా శ్రీనివాసశర్మ తెలిపారు. పుణ్యకాల సమయంలో గోవు, ధాన్యం, బెల్లంకుండ, బంగారం, వెండి వంటివి దానం చేస్తే శుభ ఫలితాలు, వంశాభివృద్ధి జరుగుతుందన్నారు.
రథసప్తమి రోజు ‘డ్రై డే’
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 5: శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి దేవస్థానంలో 14వ తేదీ రథసప్తమి వేడుకలు నిర్వహిస్తుందనందున మద్యం రహిత దినం(డ్రై డే)ను ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫారం ఏ 4, ఫారం ఏ 4(జి), ఫారం 2-బి లైసెన్స్‌లను కలిగిన ఐఎంఎల్ దుకాణాలు, గొడౌన్‌లు, రెస్టారెంట్‌లు, బార్‌లను 13వతేదీ రాత్రి 10గంటలనుండి 15వ తేదీ ఉదయం 6గంటల వరకు మూసివేయాల్సిందిగా ఆదేశించారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ ప్రాంతంతోపాటు నగరపాలక సంస్థకు కిలోమీటర్ దూరంపరిధిలోగల అన్ని ప్రాంతాలకు ఇది వర్తిస్తుందని ఆయన తెలిపారు.

ప్రధాని దృష్టికి పొందూరు చేనేత సొగసులు
పొందూరు, ఫిబ్రవరి 5: విశాఖ నావికా విన్యాసాలను తిలకించేందుకు విశాఖ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన పొందూరు చేనేత ప్రతిష్ఠను వివరించి ఈ పరిశ్రమను మరింత ప్రగతి పథంలో నడిపించేందుకు పాటుపడతానిని గ్రామీణ ఖాదీ పరిశ్రమల అభివృద్ధి మండలి అధ్యక్షుడు వినయ్‌కుమార్ సత్సేన ప్రకటించారు. ఆయన శుక్రవారం ఏఎస్‌కెకె సంఘంను సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. చేనేత ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు, ఇబ్బందులు, నేత కార్మికుల కష్టాలను ప్రధానంగా మోదీకి వివరిస్తానన్నారు. ఇప్పటివరకు తాను పొందూరు ఖాదీ గురించి విన్నానని నేడు తనకు నేత ఒడుకు ప్రక్రియలో ఎంతగానో అబ్బురపరిచాయన్నారు. పది కాలాల పాటు చేనేత ప్రక్రియలు పదిలపరిచేలా ప్రత్యేక ప్యాకేజీని చేపట్టే ఆలోచన ప్రధాని మోదీ దృష్టిలో పెట్టేందుకు విశాఖలో ఏర్పాటు చేసిన ఖాదీ వస్త్ర ప్రదర్శనకు ప్రధానిని ఆహ్వానించనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తోపాటు సౌత్ జోన్ డైరెక్టర్ చంద్రవౌళి, కె.విఐసి డిప్యూటీ సిఇవో ఎస్‌ఎస్ శుక్ల, డిప్యూటీ డైరెక్టర్ ధర్మాజీరావు పాల్గొన్నారు.
మహోదయ భక్తులకు రోడ్డు సౌకర్యం
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 5: మండలంలోని బొంతలకోడూరు పంచాయతీ అనుబంధ గ్రామమైన పాతదిబ్బలపాలెం సమీపాన నాగావళి సంగమంలో ఈనెల 7,8వ తేదీల్లో నిర్వహించే మహోదయంకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం శుక్రవారం రోడ్డు పనులు చేపట్టారు. స్మార్ట్‌విలేజ్ కన్వీనర్, విశ్రాంతి ఉపాధ్యాయులు గుంటుకు వెంకటరావు సొంత నిధులతో ఈ రహదారిని సంఘమం వరకు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులకు మరిన్ని వౌలిక వసతులు కల్పించేలా గ్రామపెద్దలు శ్రమదాన పనులను సాగిస్తున్నారు. మాజీ సర్పంచ్ మాడుగుల చిన్నబాబు, ఎంపిటీసీ సత్యానందం, తెలుగుదేశం పార్టీనాయకులు బాణ్న రమణ, చంద్రవౌళి, తిరుమలరావు, నీటి సంఘం ఉపాధ్యక్షులు అన్నారావుల పర్యవేక్షణలో ఈ మహోదయం ఏర్పాట్లు చురుగ్గా ముందుకు సాగుతున్నాయి.
ఉప్పుగెడ్డ పనులకు రూ.12 కోట్లు మంజూరు
పోలాకి, ఫిబ్రవరి 5: మండలంలో సుసరాం గ్రామానికి చెందిన తంపరభూములల్లోని పంటలు వరదలు వచ్చేటప్పుడు ఎటువంటి నష్టం రాకుండా రూ.12.12కోట్లతో ఉప్పుగెడ్డ కాలువ పనుల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైందని సాగునీటి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం ఉర్జాం నీటి సంఘం మొదటి సమావేశం సంఘం అధ్యక్షుడు రోణంకి లోకేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఏళ్ళుగా అనేక వరదలు వస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, రాష్టమ్రంత్రి అచ్చెన్నాయుడుల కృషి వలన ఎట్టకేలకు కాలువలు నిర్మించడానికి కృషి జరిగిందని తెలిపారు. వీటి వలన సుమారు 8గ్రామాల రైతులకు వరద నష్టం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో వంశధార ఏఇ గౌరీ ప్రసాదరావు, స్థానిక సర్పంచ్ కణితి సత్తిబాబు, సాగునీటిసంఘ ఉపాధ్యక్షుడు బి.వరహాలు, మాజీ సర్పంచ్‌లు నర్శింగరావు, సత్యం, మండల టిడిపి అధ్యక్షుడు కిల్లి వేణుగోపాలస్వామి పాల్గొన్నారు.

హనుమాన్ చాలీసా దివ్యగ్రంథం
శ్రీకాకుళం(కల్చరల్), ఫిబ్రవరి 5: తులసీదాస్ ప్రసాదించిన హనుమాన్ చాలీసా సూత్రప్రాయంగా హనుమత్ తత్వాన్ని ఆవిష్కరించే దివ్య గ్రంథమని రుషిపీఠం వ్యవస్థాపకుడు సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక వైఎస్‌ఆర్ కల్యాణ మండపంలో ఉపనిషన్మందిరం 63వ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ చాలీసా మహిమా, వైభవంపై ఆయన ప్రసంగించారు. యదార్థం చెప్పేది ఉపనిషత్తు అని, హనుమాన్ చాలీసాను హనుమత్ ఉపనిషత్‌గా చెప్పవచ్చునన్నారు. భారతీయ సంస్కృతిపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో గ్రంథాలు, దేవాలయాలు, మహాత్ములు భారతీయ ధర్మరక్షకులుగా నిలుస్తున్నాయన్నారు. ఆ కోవలోనే సంత్ తులసీదాస్ రామచరితను రాసి శివునికి అంకితమిచ్చి శివకేశవులకు భేదం లేదని నిరూపించారన్నారు. రామచరితమానస్‌కు ముందే హనుమాన్ చాలీసా తులసీదాస్ రచించినట్టు చాలీసాలోని మొదటి దోహ వల్ల తెలుస్తోందన్నారు. ఈ సందర్భంగా తులసీదాస్, రామచరిత మానస్, హనుమాన్‌చాలీసాల గురించి వివరించారు. శాస్త్రంచెప్పింది నమ్మడం శ్రద్ధ, అయితే తోచింది నమ్మడం విశ్వాసమని, పారాయణమంటే సంపూర్ణంగా గ్రహించడమని పేర్కొన్నారు. తొలుత హనుమంతుని చిత్రపటం ముందు జ్యోతి వెలిగించి ప్రవచనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుమ్మా నగేష్, విశ్వనాథం కామేశ్వరరావు, ఆర్‌వి లహరిగోపాలశర్మ, డి.సాంబమూర్తి, అందవరపు సూరిబాబు, కె.అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణపతి సచ్చితానంద దత్తజ్ఞానబోధ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్‌చాలీసా పారాయణం జరిగింది.

ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా జగన్‌పైనే నిందలా?
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 5: రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా తమ అధినేత జగన్మోహనరెడ్డిపైనే నిందలు వేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు అలవాటుగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ రాష్ట్ర అద్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. శుక్రవారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లా డారు. ప్రజా పోరాటం చేస్తున్న జగన్‌ను కించపరిచే దిశగా ప్రభుత్వం ప్రయత్నించడం శోచనీయమన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రత్యేక హోదాపై యువకులను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని తప్పుపడుతున్నారు, తుని సంఘటనకు జగనే బాధ్యుడని ప్రచారం చేస్తున్నారని, అసలు ప్రభుత్వం పనిచేస్తుందా అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి తప్పుడు ప్రచారాలతో అధికారం చేపట్టి, ఇచ్చిన హామీలు మరచిపోయారు, నెరవేర్చండి అని యువత నుండి వృద్ధుల వరకు అడుగుతుంటే సమాధానం లేని టిడిపి నేతలు వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై, ప్రజల కోసం ఉద్యమిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దినదినాభివృద్ధి చెందుతోందని, దివంగత నేత వైఎస్ తనయునిగా అనునిత్యం ప్రజల మధ్యనే జగన్ ఉంటున్నారని తెలిపారు. జిల్లాకు చెందిన యువ పార్లమెంటు సభ్యుడు తన తండ్రిలా సక్రమమైన మార్గంలో పయనిస్తే బాగుంటుందని, చంద్రబాబు నాయుడు మెప్పుకోసం తమ నేత జగన్మోహనరెడ్డిని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. అలాగే జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు పాలన అంటే ఏంటో దివంగత రాజశేఖర రెడ్డిని గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో ఎన్ని ధనుంజయ, అంధవరపు సూరిబాబు, సనపల నారాయణరావు, మండవిల్లి రవి, టి.కామేశ్వరి, కోరాడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

12,13వ తేదీల్లో మహాసభలు
ఎచ్చెర్ల, ఫిబ్రవరి 5: ఈనెల 12,13వ తేదీల్లో 19వ ఎన్జీవో రాష్టమ్రహా సభలు చిలకపాలెం కూడలిలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు తెలిపారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ తేదీన సాయంత్రం 3గంటలకు ఈ మహాసభలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారని వివరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను సీ ఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. 13వ తేదీ సాయంత్రం వరకు కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఈ మహా సభలు ముగిస్తామని తెలిపారు. ఎన్జీవోల మహాసభలకు అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌కు చెందిన ప్రతినిధులు, పరిశీలకులు 2200మంది హాజరవుతారని వీరిలో 315మంది మహిళా ప్రతినిధులు ఉంటారని వివరించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుండి 3000మంది ఉద్యోగులు హాజరుకానున్నారని తెలిపారు. మూడేళ్లకొకసారి ఎన్నికలకు అనుగుణంగా మహాసభలు నిర్వహించడం ఓ సాంప్రదాయమయినప్పటికీ ఈ సారి ఎన్నికలతో సంబంధం లేకుండా ఈ సభలకు మరింత ప్రాధాన్యత ఉందన్నారు. శ్రీకాకుళంకు చెందిన ఉద్యోగులు మహా సభలు నిర్వహించేందుకు ముందుకు రావడం స్ఫూర్తిదాయకమన్నారు. ఇప్పటికే పిఆర్‌సి, హెల్త్‌కార్డులు వంటి సమస్యలు ప్రభుత్వ పరిష్కరించిందని కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేసే అవకాశం ఉందన్నారు. 25-30 సంవత్సరాల నుండి ఎన్జీవో సంఘానికి సంబంధించిన బైలాస్, వర్కింగ్ ఎనలైజేషన్, సంఘనాయకత్వం, నడవడిక వంటి అంశాలపై గత నెల 30,31వ తేదీల్లో కార్యవర్గ సమావేశంలో తీర్మాణం మేరకు పంచాయతీ రాజ్ మున్సిపల్ ఆఫీస్ విఆర్‌వో పంచాయతీ కార్యదర్శులను సంఘ సభ్యులుగా చేర్పించుకుంటామన్నారు. ఈ మహాసభలకు ముఖ్యమంత్రితోపాటు ఆర్థికశాఖామంత్రి యనమల రామకృష్ణుడు, ఇంచార్జ్ మంత్రి పరిటాల సునీత, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు హాజరు కానున్నారన్నారు.

స్ర్తినిధి బ్యాంకు ద్వారా
‘్భమి కొనుగోలు’
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 5: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్, స్ర్తినిధి బ్యాంకు ద్వారా భూమిని కొనుగోలు చేసి భూములేని షెడ్యూల్డ్‌కులాల మహిళా వ్యవసాయ కూలీలకు పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం వెల్లడించారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ పథకం కింద సొంత భూములు అమ్మేందుకు సిద్ధంగా ఉన్న షెడ్యూల్డ్‌కులాల, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన రైతులనుండి 381 ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, భూములేని షెడ్యూల్డ్ కులాల మహిళా వ్యవసాయ కూలీలకు పంపిణీ చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించారు. భూమి అమ్మదలచిన రైతులు సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులను, తహశీల్దార్‌లు సంప్రదించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 పి.రజనీకాంతారావు, డిఆర్‌వో సుబ్రహ్మణ్యం, ఆర్డివో దయానిధి, డిఆర్‌డిఏ పిడి తనూజారాణి, ఎస్సీ కార్పొరేషన్ పిడి, నీటి యాజమాన్య సంస్థ పిడి తదితరులు పాల్గొన్నారు.

రూ.100కోట్లతో 220 ఖాదీ సొసైటీలు
నరసన్నపేట, ఫిబ్రవరి 5: దక్షిణ భారతదేశంలో ఖాదీ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయనున్నట్టు ఖాదీ గ్రామోద్యోగ సంఘ కమిషన్ అధ్యక్షుడు వినయ్‌కుమార్ సత్సేన తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక ఖాదీ గ్రామోద్యోగ కార్యాలయ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సొసైటీని ప్రారంభించేందుకు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ. 100 కోట్లతో 220 ఖాదీ సొసైటీలను ఏర్పాటు చేశామని వీటన్నింటిలోనూ 82శాతం మేర మహిళలే పనిచేయడం విశేషమన్నారు. మహిళా శక్తితోనే ఖాదీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఏదేమైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖాదీ సొసైటీలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖాదీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని ఈ క్రమంలోనే అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అనంతరం సొసైటీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సౌత్‌జోన్ సభ్యులు చంద్రవౌళి, సిఇవో శుక్ల, డిప్యూటీ సిఇవో గురుప్రసన్న, స్థానిక అధికారి జగదీశ్వరరావు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

మహిళ నిరాహార దీక్ష
శ్రీకాకుళం(రూరల్), ఫిబ్రవరి 5: కాపులను బిసిలో చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష తమకుటుంబ సభ్యులతో పాటు ఇంటివద్దనే చేస్తున్నారు. ముద్రగడకు సంఘీభావంగా నగరానికి చెందిన శవ్వాన ఉమామహేశ్వరి తన ఇంటివద్దనే ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారం ప్రారంభించింది. ఈమెకు తెలగ సామాజిక వర్గం నాయకులు రొక్కం సూర్యప్రకాశ్‌రావు, రొక్కం మధుసూదనరావు,
కొత్తపల్లి నారాయణ, ఎర్నాగుల జగ్గారావు, అప్పికొండ లక్ష్మీనారాయణ, పసుపురెడ్డి నాగేశ్వరరావు, జి.మహాలక్ష్మీ, వి.రాజేశ్వరి, ప్రగడ శీలారాణి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రొక్కం మధుసూదనరావు మాట్లాడుతూ గత 35 ఏళ్లనుండి కాపు, బలిజ, తెలగ కులాలను బిసిలో చేర్చాలని అనేక సార్లువిన్నవించారని, ఎన్నికల ముందు తమను బిసిలో చేర్చుతామని చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోనికి వచ్చాక ఎటువంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పోరాట యోధుడన్నారు. పార్టీలకతీతంగా ముద్రగడకు అందరూ మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో హింసకు మార్గంలేకుండా చూడాలని కోరారు.
రిజర్వేషన్లపై లోతైన చర్చ జరగాలి
కాపులను బిసిలో చేర్చాలన్న డిమాండ్‌ను 2014 ఎన్నికల్లో ఓట్ల కోసం వాడుకొని ఇప్పుడు రాష్ట్రంలో కులాలమధ్య చిచ్చుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే కారణమని లోక్‌సత్తా పార్టీజిల్లా ఉపాధ్యక్షుడు కె.పోలినాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచాది రాంబాబు అన్నారు. జిల్లా పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలోవారు మాట్లాడారు. రిజర్వేషన్లకు పరిమితి ఉందని తెలిసినా కాపులతో పాటు అన్ని కులాలలోనూ పేదలు ఉన్నారని తెలిసినా అందరికీ న్యాయం చేసేలా సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయకుండా ఎన్నికల్లో లబ్ధికోసం చంద్రబాబు కులాల కుంపటి రాజేసి తూర్పుకాపులు-కాపులు-బిసిల మధ్య చిచ్చుపెట్టారన్నారు. రిజర్వేషన్ల చుట్టూ పెరుగుతున్న వివాదాన్ని పరిష్కరించడంలో ఆలస్యమయ్యేకొద్ది రాజకీయ సామాజిక ఆర్థిక వ్యవస్థలు మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్ల పిల్లలను కాకుండా అనగారిన కులాలలో అర్హులకు మాత్రమే రిజర్వేషన్లు అందించడం మంచిదన్నారు. కార్యక్రమంలో కోశాధికారి అల్లుమల్లేశ్వరరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.