క్రీడాభూమి

సత్తా చాటిన అంకిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హువా హిన్ (్థయిలాండ్), ఫిబ్రవరి 5: ఫెడ్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొన్న భారత జట్టు పూల్-ఎలో శుక్రవారం ఇక్కడ 3-0 తేడాతో ఉజ్బెకిస్తాన్‌ను ఓడించి ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. ఈ పోరులో అంకితా రాణా తన సింగిల్స్ మ్యాచ్‌తో పాటు డబుల్స్ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థులను మట్టికరిపించి భారత జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. తొలుత 57 నిమిషాల్లో ముగిసిన సింగిల్స్ మ్యాచ్‌లో ప్రేరణ బాంబ్రి 6-1, 6-1 తేడాతో సబీనా షరిపోవాపై విజయం సాధించి భారత్‌కు 1-0 ఆధిక్యతను అందించగా, భారత దేశ నెంబర్ వన్ సింగిల్స్ క్రీడాకారిణి అంకితా రాణా 6-1, 6-0 తేడాతో నగీనా అబ్దురైమోవాను మట్టికరిపించింది. ఆ తర్వాత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాతో కలసి డబుల్స్ బరిలోకి దిగిన అంకితా రాణా 6-2, 6-0 తేడాతో అగుల్ అమన్మురదోవా, అరీనా ఫోల్ట్స్ జోడీని చిత్తు చేసింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్ కేవలం 48 నిమిషాల్లోనే ముగిసింది.