కృష్ణ

మైలవరం పశువైద్యశాలకు సమస్యల రోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, ఫిబ్రవరి 22: మైలవరంలోని ప్రభుత్వ పశువైద్యశాలలో ప్రధాన వైద్యాధికారి లేక రైతులు, పశుపోషకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పని చేస్తున్న పశువైద్యాధికారి ఇటీవల పదోన్నతిపై బదిలీపై వెళ్ళారు. సుమారు నెల రోజులుగా ఇక్కడ పశువైద్యాధికారి పోస్ట్ ఖాళీగా ఉంది. దీంతో రైతుల బాధలు వర్ణనాతీతం. ఇక్కడ అప్పటి వరకూ ఒక ఏడితోపాటు ముగ్గురు సిబ్బంది ఉండే వారు. ఏడీ బదిలీ అయిన తర్వాత కాంపౌండర్ పదోన్నతిపై బదిలీ అయ్యారు. అటెండర్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్న ఒక్క సిబ్బంది సెలవు పెట్టటంతో గురువారం ఆసుపత్రి తాళాలు తీసే నాధుడు లేక మూతపడింది. ఈ దశలో రైతులు వివిధ రోగాలతో ఉన్న తమ పశువులను తీసుకుని ఆసుపత్రికి వచ్చారు. ఈసమయంలో ఆసుపత్రి మూతపడి ఉండటంతో వారు వైద్యాధికారి కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు చివరకు ఆసుపత్రి గేటు ముందే నిరసనకు దిగారు. మైలవరం పశువైద్యశాలకు పూర్తిస్థాయి వైద్యాధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఉదయం 8గంటలకు తెరవాల్సిన ఆసుపత్రిని 10 గంటలకు జూనియర్ వెటర్నరీ అసిస్టెంట్ ధనలక్ష్మి వచ్చి తాళాలు తీశారు. ఇప్పటి వరకూ ఎందుకు రాలేదని రైతులు ఆమెను నిలదీయగా తాను గణపవరం పశువైద్యశాలలో పని చేస్తున్నానని తనను ఇక్కడికి వెళ్ళమని ఉదయమే తన పై అధికారి చెప్పారని తాను విజయవాడలో ఉండి ఇక్కడికి రావటం ఆలస్యమైందని చెప్పారు. పైగా తాను అనారోగ్యంతో ఉన్నానని, తానే డాక్టర్, కాంపౌండర్, అటెండర్, స్వీపర్ పోస్టులన్నీ చేసుకోవాలని వాపోయారు.
ఏడీ వివరణ
మైలవరం పశువైద్యశాల ఇన్‌చార్జ్ ఏడి హరిహరనాధ్ దీనిపై స్పందిస్తూ సిబ్బంది లేని కారణంగానే ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయని వెల్లడించారు. మైలవరం మండలంలో నాలుగు పశువైద్యశాలలున్నాయని నాలుగింటిలో ఒక డాక్టర్, ఒక కాంపౌండర్, అటెండర్, మరో అసిస్టెంట్ వెటర్నరీ అధికారి వెరశి నలుగురు నాలుగు ఆసుపత్రులను చూస్తున్నామని పేర్కొన్నారు. వీరిలో ఎవరు ఏ కారణంతోనైనా సెలవు పెడితే ఆ ఆసుపత్రి మూతపడటమేనన్నారు. రైతులు సహకరించాలన్నారు.