కృష్ణ

విద్యా వ్యవస్థను మనమే కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఫిబ్రవరి 22: ఎలిమెంటరీ పాఠశాలలు ఉంటేనే విద్యా వ్యవస్థ ఉంటుందని, విద్యా వ్యవస్థ లేకుంటే ఉపాధ్యాయులు ఉండరని, ఇందుకు ప్రతి పాఠశాలలో ఎన్‌రోల్‌మెంట్ సాధించాల్సిన అవసరం ఉందని పిఆర్‌టియు జిల్లా అధ్యక్షుడు డి శ్రీను పేర్కొన్నారు. మండలంలో విద్యార్ధుల సంఖ్యను గణనీయంగా పెంచిన ప్రాధమిక పాఠశాలల ఉపాధ్యాయులకు గురువారం సాయంత్రం తోట్లవల్లూరు జడ్పీ హైస్కూల్లో బెస్ట్ ఎన్‌రోల్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన శ్రీను మాట్లాడుతూ చాలా పాఠశాలల్లో 30 మందిలోపు విద్యార్థులు ఉన్నారని, ఇది చాలదని ఇంకా ఎన్‌రోల్‌మెంట్ పెంచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ అవార్డులు సదరు ఉపాధ్యాయులకు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు. మండలంలో 20 మంది ఉపాధ్యాయులకు బెస్ట్ ఎన్‌రోల్‌మెంట్ అవార్డులను ప్రదానం చేశారు. అలాగే నూరుశాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు చెందిన 20 మంది ఉపాధ్యాయులను సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వరరావు, మండల పిఆర్‌టియు అధ్యక్షుడు వి రమేష్, కార్యదర్శి వరప్రసాద్, ఇన్‌చార్జి హెచ్‌ఎం గిడియోన్ తదితరులు పాల్గొన్నారు.