క్రీడాభూమి

సాకులు వెతకడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: భారత క్రికెట్‌లో సంస్కరణలపై లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడంపై తప్పించుకోవడానికి కుంటిసాకులు వెతకడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అంటూ, అయితే ఈ సిపార్సుల లాభనష్టాలపై చర్చించే హక్కు బోర్డుకుందని స్పష్టం చేశారు. సంస్కరణలపై లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని సుప్రీంకోర్టు బిసిసిఐకి స్పష్టం చేసిన నేపథ్యంలో ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘బిసిసిఐ తప్పించుకునే దారి కోసం వెతకడం లేదు. పారదర్శకత, జవాబుదారీతనంపై మాకు నమ్మకం ఉంది. గత తొమ్మిది నెలల్లో మేము సరయిన దిశలో వెళ్తున్నామని సంకేతాలిచ్చే అనేక చర్యలు తీసుకున్నాం. లోధా కమిటీ చాలా విషయాలు సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫార్సులను పరిశీలించే హక్కు బిసిసిఐకి ఉంది’ అని అనురాగ్ ఠాకూర్ శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో చెప్పారు. అయితే కొన్ని సిఫార్సుల అమలు, సాధ్యాసాధ్యాల గురించి అడగ్గా, దీనిపై ఇప్పుడు తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని ఆయన అన్నారు. అయితే లోధా కమిటీ సిఫార్సులపై ఠాకూర్ పూర్తి సంతృప్తితో లేరనే విషయం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. ‘1993లో భారత్ ప్రపంచ కప్ గెలిచినప్పుడు విజయం సాధించిన జట్టు ఆటగాళ్లకు సొమ్ము చెల్లించడానికి కూడా మా వద్ద డబ్బులు లేవు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బిసిసిఐలో గత 30-40 ఏళ్లలో జరిగిన ప్రతి ఒక్కటీ తప్పని చెప్పలేము. అందువల్ల ఏవయినా చర్యలు తీసుకునే ముందు ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఠాకూర్ అన్నారు. బిసిసిఐ న్యాయ నిపుణుల బృందం ఈ సిఫార్సులను పరిశీలిస్తోందని ఈ నెల 7న లోధా కమిటీ సిఫార్సులపై చర్చలు జరుగుతాయని ఠాకూర్ చెప్పారు. వాస్తవానికి ఈ నెల 3వ వారంలో రాష్ట్ర క్రికెట్ సంఘాల ప్రత్యేక సర్వసభ్య సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆ సమావేశాల తర్వాత అన్ని సంఘాలు వ్యక్తం చేసిన ఉమ్మడి అభిప్రాయాన్ని బిసిసిఐ వెల్లడిస్తుంది.