మహబూబ్‌నగర్

పనులు చేయని ఏజెన్సీలను తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 22: పాలమూరు జిల్లాలోని ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే ఖరీఫ్‌లో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల నుంచి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని జలసౌదలో పాలమూరు జిల్లాలోని ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులపై అయా ప్రాజెక్టుల అధికారులు, ఇంజనీయర్లతో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు తీరుపై కొంత మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎట్టిపరిస్థితుల్లో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల ద్వారా పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. శుక్ర, శనివారం రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అయా ప్రాజెక్టుల దగ్గరే బస చేస్తున్నట్లు ఆయన అధికారులకు తెలిపారు. పనులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి మంత్రి ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహింనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా మంత్రి హరిశ్‌రావు భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంపై కూడా మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అదికారులు ఎజెన్సీల పట్ల కఠినంగా ఉండాలని పనులు చేయని ఎజెన్సీలను తప్పించాలని కూడా అధికారులకు మంత్రి ఆదేశించారు. కాగా కల్వకుర్తి ప్రాజెక్టు పనులు అలస్యం కావడానికి ప్రధానకారణం ప్రాజెక్టుకు సంబంధించిన మోటర్లు రన్‌లో ఉన్నాయని మూడు నెలల నుండి నీటిని ఎత్తిపోస్తుడంతో కాల్వల ద్వారా నీరు వస్తుంన్నందున పనలు జరగడంలేదని మంత్రి దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. దాంతో మంత్రి సూచనలు చేస్తూ ఈ నెలాఖరు నాటికి మోటర్లను బంద్ చేసి పనులు చేపట్టాలని కూడా తెలిపినట్లు సమాచారం. మంత్రి హరిశ్‌రావు పాలమూరు ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించడంతోనే రెండు రోజుల పాటు పాలమూరు జిల్లాలోనే పర్యటనకు సిద్దమయ్యారని తెరాస వర్గాలు చెబుతున్నాయి.