మహబూబ్‌నగర్

ఆగిన పప్పుశనగ కొనుగోలు కేంద్రం ధర్నాకు సిద్ధమైన రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవపాడు, ఫిబ్రవరి 22: మార్కెఫెట్, అలంపూర్ పిఏసిఎస్ ఆధ్వర్యంలో అలంపూర్ మార్కెట్‌యార్డులో పప్పుశనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. గురువారం ఎమ్మెల్యే సంపత్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ విష్ణువర్దన్‌రెడ్డి, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మలు హాజరు కాగా మద్దతు ధరను పెంచాలని రైతులు ఆందోళనకు దిగటంతో కొనుగోలు కేంద్రం ప్రారంభానికి నోచుకోలేదు. రైతులు గిట్టుబాటు ధర, ఎకరాకు 8 క్వింటాళ్లు, రైతుల నుంచి 50 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే సంపత్ కల్పించుకొని మార్క్‌ఫెడ్ అధికారులతో మాట్లాడానని ఎకరాకు ఏడు క్వింటాళ్లు కొనుగోలు చేసేందుకు ఒప్పుకున్నారని వివరించారు. గిట్టుబాటు ధరపై మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి దర పెంపునకు కృషి చేస్తానన్నారు. మంత్రి హరీశ్ తనకు మంచి మిత్రుడని గతంలో పత్తి, మొక్కజొన్న ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించారన్నారు. పప్పుశనగకు సైతం మంత్రితో ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా రైతులు ఉత్పత్తులను విక్రయించరాదన్నారు. అందుకు రైతులు ససేమిరా అనటంతో ప్రారంభం మరోసారి వాయిదా పడింది. రైతులు గిట్టుబాటుధరకై జాతీయ రహదారిపై ధర్నా నిర్వహిస్తామని ఎమ్మెల్యే మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులే తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, మీరు రమ్మంటే రోడ్డెక్కేందుకు సిద్ధమని, కానీ కొంత మందితో ధర్నా నిర్వహిస్తే ప్రభుత్వం స్పందించదని సంపత్ సర్దిచెప్పారు. రెండు రోజుల అనంతరం తాలూకాలోని 35వేల ఎకరాలలో సాగు చేసిన పప్పుశనగ రైతులు ధర్నాకు కలిసిరావాలని కోరారు. దీంతో ధర్నా వాయిదా పడింది. మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ విష్ణువర్దన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం మద్దతు ధరగా రూ.4250లు ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం రూ.150లు కలిపి రూ.4400ల గిట్టుబాటు ధర కల్పించిందని వివరించారు. కేంద్రం తాలూకా ప్రాంత రైతులను దృష్టిలో ఉంచుకొని మద్దతు ధర పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ షాబాద రవి, జిల్లా కాంగ్రెస్ రైతు సంఘం అధ్యక్షుడు నాగరాజు, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, అలంపూర్ పిఏసిఎస్ అధ్యక్షుడు చింతల మహేశ్వరరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మార్కెఫెడ్ జిఎం శివనాగిరెడ్డి, ఎంపీపీ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.