మహబూబ్‌నగర్

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, పిబ్రవరి 22: మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై గురువారం జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ కలెక్టర్ చాంబర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరుకాగా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని శాఖలకు సంబంధించిన పనులు నత్తనడకన నడుస్తున్నాయని అధికారులు ఆ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా గృహనిర్మాణశాఖ డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని నెలలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నియోజకవర్గం జిల్లాకే ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా కేంద్రం కాబట్టి మాడల్ నియోజకవర్గంగా తయారు చేయల్సి భాద్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే క్వాటర్‌తో పాటు వివిధ అభివృద్ధి పనులకు మరింత పెంచాలన్నారు. మహబూబ్‌నగర్-్భత్పూర్ వేళ్లే ప్రధాన రహదారిలో గల అమిస్తాపూర్ బ్రిడ్జి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయని త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ మాడల్ రైతుబజార్ పనులు మరింత వేగవంతంగా పూర్తి చేసి రెండునెలల్లో ప్రారంభం అయ్యేలా చూడాలని, బైపాస్‌రోడ్డు పనులను వేగవంతం చేయాలని కోరారు. పాలమూరు పెద్ద చెరువు మినీట్యాంక్ బండ్ పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. రోడ్ల పనులను వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బి ఇఇ చిన్నపుల్లాదాస్, డిఇ సంధ్య, గృహనిర్మాణశాఖ పిడి రమణరావు, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.