Others

నేపథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లలిత కళలకు మూలం జానపద కళలంటారు. మాట నేర్చిన మనిషి ఆటకు పాటకు పరుగులెత్తాడు. ప్రకృతి అందాలు చూసి మురిసి పోయాడు. నెమలిలాగా నాట్యం నేర్చుకున్నాడు. చేప లాగా నీటిలో ఈదులాడాడు. చిలుక లాగా పలికాడు కోయలలాగా పాడాడు. అపుడే అతని మస్తిష్కంలో నూతన ఆలోచనలకు ఆరంభం అయంది. అంతే తాను పాడే పాటకు ప్రకృతి కూడా పరవశించాలనుకొన్నాడు. కోయలమ్మ గొంతుకు తన గొంతు చేరిస్తే మరింత అందం ఇనుమడించిందనుకొన్నాడు. తన పాటకు పక్కన మరో గొంతు కావాలనుకొన్నాడు. అంతే తాను వండుకుని తినే పాత్రలనే వాయద్యాలుగా మార్చుకున్నాడు. ఆ వాయద్యాన్ని తాను పాడుకుంటున్న పాటలకు అనువుగా తడుతూ లయబద్దంగా పాట పాడడం నేర్చుకున్నాడు. ఇదే లలిత కళలు మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆకట్టుకునేట్టు చేయడానికి వీణ, తబలా, మృదంగం లాంటి వాయద్యాలు పురుడుపోసుకొన్నాయ. మనిషి తలుచుకుంటే అతని మెదడులో ఎన్నో నూతనావిష్కరణలకు నాంది వాచకాలు పుడుతూనే ఉంటాయ. కాకపోతే వాటికి సరియైన వేదికలుండాలి. ఆదరించే మనుషులుండాలి. అపుడే ఏ కళనైనా ప్రఖ్యాతవౌతుంది. ప్రసిద్ధవౌతుంది. జానపద కళలకు నాంది పలికిన నేపథ్యాలను కూడా భద్రపరచాల్సిన అవసరం ఉంది. జానపద కళారూపాల నేపథ్యాలు కొత్త వాయద్యాల పుట్టుకకు కారణాలూ అవుతాయ.