తెలంగాణ

సానుకూల దృక్పథం... ఓట్ల ప్రభంజనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: వంద కోట్ల జనాభా, 74లక్షల మంది ఓటర్లు, 150 డివిజన్లు... ఇంత పెద్ద నగరంలో ఒక్కటంటే ఒక్కటే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రసంగించారు. ఓటర్లు మాత్రం పూర్తి విశ్వాసంతో మెజారిటీ సీట్లతో విజయాన్ని చేకూర్చి కెసిఆర్ నాయకత్వంపై తమ విశ్వాసం చాటుకున్నారు. ప్రజలతో కనెక్ట్ కావడం ఎలానో బహుశా సమకాలీన రాజకీయ రంగంలో కెసిఆర్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో! ఉద్యమ కాలంలో తన ఉపన్యాసాలతో నిప్పులు కురిపించిన కెసిఆర్, అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధిపై ప్రజల్లో విశ్వాసం కలిగించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అసలు పోటీనే చేయలేదు. అలాంటి పార్టీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఏకంగా వంద స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది.
ఉద్యమ కాలంనాటి ఉద్రిక్త వాతావరణం అధికారంలోకి వచ్చిన తరువాత కనిపించకుండా చేయడం గ్రేటర్‌లో టిఆర్‌ఎస్ పాగా వేయడానికి దోహదపడింది. తుమ్మల నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి ఇవ్వడం ద్వారా టిడిపికి అండగా నిలిచే సామాజిక వర్గానికి, ఆంధ్ర ప్రాంతం వారికి సానుకూల సంకేతాలు పంపించారు. బిజెపి చేపట్టిన స్వచ్ఛ భారత్‌ను ఆ పార్టీ సరిగా ఉపయోగించుకోలేకపోయినా, స్వచ్ఛ హైదరాబాద్‌ను ముఖ్యమంత్రి కెసిఆర్ బాగా ఉపయోగించుకున్నారు. వారం రోజుల పాటు చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ గ్రేటర్‌లో ప్రభుత్వం పట్ల, టిఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో విశ్వాసం కలగడానికి ఉపయోగపడిందనే చెప్పాలి.
హోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాలు ఒకపక్క వెలువడుతుంటే.. మరోపక్క కెసిఆర్ డబుల్ బెడ్‌రూం ఇళ్ళ పథకంపై జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు, పార్టీ విజయానికి ఈ పథకం బాగా దోహదం చేసిందని గుర్తించిన ఆయన ఈ పథకం అమలుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. అందుకే లక్ష ఇళ్లను ఏడాదిలో నిర్మించి ప్రజలు తనపై పెట్టిన విశ్వాసాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందే కెటిఆర్‌కు గ్రేటర్ ఎన్నికల ప్రచార బాధ్యత అప్పగించారు. ఉద్యమ సమయంలో టిఆర్‌ఎస్ వ్యవహరించిన తీరుకు, అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవహరించాల్సిన విధానానికి సరిగ్గా సరిపోయేలా కెటిఆర్ ప్రచారంలో దూసుకువెళ్లారు. ఇది సరైన నిర్ణయమని ప్రచారంలోనే తేలిపోయనా ఫలితాలతో మరింతగా రూఢీ అయంది. ఉద్యమ కాలం నాటి కెసిఆర్‌కు, ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన కెసిఆర్‌కు విస్పష్టమైన రీతిలో తేడా కనిపించడం అన్ని వర్గాల ఓటర్లలో విశ్వాసం నెలకొనడానికి కేంద్ర బిందువైంది. పూర్తిగా పాజిటివ్ దృక్పథంతో సాగించిన ఎన్నికల ప్రచారం అద్భుత ఫలితాలను అందించింది. ‘ఇక్కడ మా పాలన తీరును చూసి మా వదినమ్మ భువనేశ్వరి కూడా మాకే ఓటు వేస్తుంది’ అంటూ బహిరంగ సభలో ప్రకటించడం ఆయన సానుకూల దృక్పథానికి ఓ సంకేతం. ఎక్కడా పరుషంగా మాట్లాడకపోవడం ఆంధ్రప్రాంతం సహా ఇతర ప్రాంతాల వారి మద్దతు కూడగట్టడానికి ఉపయోగపడింది. గ్రామాల్లోనే కాదు రాజధానిలోనూ కెసిఆర్‌పై ప్రజలకు విశ్వాసం ఉందని గ్రేటర్ ఫలితాలు నిరూపించాయి.