తెలంగాణ

సీట్ల సునామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఘన విజయంతో టిఆర్‌ఎస్ చరిత్ర సృష్టిస్తే, అత్యల్ప స్థానాలతో కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు చరిత్ర సృష్టించాయి. వంద సీట్లలో టిఆర్‌ఎస్ గెలిస్తే పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి తప్పుకుంటానని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రకటించారు. సొంతంగా మేయర్ స్థానం గెలిస్తే చెవి కోసుకుంటానని సిపిఐ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. వంద స్థానాల్లో గెలిస్తే రాజకీయాల నుంచి తప్పు కోవడమే కాదు తెలంగాణలో కనిపించను అని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సవాల్ చేశారు. వీరందరి సవాళ్లను తోసిరాజని అంచనాలను మించి టిఆర్‌ఎస్‌కు 99స్థానాలు లభించాయి. ఇంతటి ఘన విజయాన్ని టిఆర్‌ఎస్ నాయకత్వం సైతం ఊహించలేదు. విజయం సాధిస్తాం, మేయర్ స్థానం మాదే అని చెబుతూ వచ్చిన టిఆర్‌ఎస్ వంద స్థానాలను ఊహించలేదు. వంద సీట్లు గెలుస్తాం అని కెటిఆర్ ప్రచారం ప్రారంభం నుంచి చెబుతూ వస్తున్నారు. సీట్ల సంఖ్యపై చాలెంజ్ చేయలేదు కానీ మేయర్ పీఠంపై టిఆర్‌ఎస్ ఉంటుందని, అలా జరగకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ సవాల్ చేశారు. మేయర్ పీఠంపై కెటిఆర్ చాలెంజ్ చేస్తే, వంద సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తామని విపక్షాలు ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి గ్రేటర్ హైదరాబాద్‌లో విస్తృతంగా ప్రచారం చేశారు. సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకే ఒక సభకు పరిమితమైతే, చంద్రబాబు లెక్కలేనన్ని సభల్లో ప్రసంగించి చివరకు ఒక్కటంటే ఒక్క డివిజన్‌లో మాత్రమే విజయం సాధించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న టిడిపి ఈ ఫలితాలతో కంగుతింది. తెలంగాణలో కొన ఊపిరితో ఉన్న టిడిపి గ్రేటర్ ఫలితాలతో పూర్తిగా నిరాశ నిస్పృహలో పడిపోయింది. గ్రేటర్ ఓటర్లపై ఆశలు పెట్టుకున్న చాలామంది నాయకులు టిడిపిలోనే కొనసాగుతున్నారు. గ్రేటర్‌లో ఏ ఒక్క అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోనూ టిడిపి ప్రభావం చూపలేకపోయింది. మొదటి నుంచి టిడిపికి అండగా నిలిచిన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఇతర సామాజిక వర్గాలు గ్రేటర్‌లో టిఆర్‌ఎస్‌కు ఓటు వేశాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం అదే. ఆ పార్టీ సానుభూతిపరులు బాబుపై వ్యతిరేకతతో టిఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. ఆంధ్ర ఓటర్లపై ఆధారపడ్డ టిడిపికి చివరకు సామాజిక వర్గం నుంచి మాత్రమే గట్టి అండ లభించింది.
హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయనా గ్రామీణ ప్రాంతాల్లో టిఆర్‌ఎస్ తరువాత అంతో ఇంతో ప్రభావం చూపేది కాంగ్రెస్ పార్టీనే. గ్రేటర్‌లో మేం ఘోరంగా దెబ్బతిన్నా టిడిపి తుడిచిపెట్టుకు పోవడం వల్ల ఇక భవిష్యత్తు రాజకీయాలు టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే ఉంటాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. తమ మద్దతుతో టిఆర్‌ఎస్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆశతో ఉన్న ఎంఐఎం 44 సీట్లు గెలుచుకున్నా నామమాత్రంగానే మిగిలిపోయంది. ఎవరి మద్దతుపైనా ఆధారపడకుండా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని టిఆర్‌ఎస్ విజయబావుటా ఎగరేయడం ఈ ఎన్నికల ప్రత్యేకం.