ఆంధ్రప్రదేశ్‌

తూచ్ అన్నందుకే పోరాట పంథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 23: కేంద్రం విభజన హామీలను నెరవేర్చనందువల్లే పోరాట పంథా ఎంచుకోవాల్సి వచ్చిందంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ- ప్రగతి గ్రాడ్యుయేషన్ సెర్మనీలో శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు పొందడం ఆంధ్రుల హక్కు అన్నారు. విభజన హామీలను నెరవేర్చడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. చట్టంలో ఉన్నవన్నీ సాధించే వరకూ విశ్రమించేది లేదన్నారు. విభజన హామీల సాధనలో తనకు రెండో ఆలోచన లేదని పునరుద్ఘాటించారు. ఎంత అడిగినా కేంద్రంలో కదలిక లేకపోవడంతో పోరాట పథా ఎంచుకోవాల్సి వచ్చిందన్నారు. హక్కుల సాధనలో వెనకడుగు వేసేది లేదని, ఓ వైపు పోరాడుతూనే, అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఐఎస్‌బీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు చాలా కష్టపడ్డానన్నారు. అందులో తన సిఫారసుతో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, ప్రతిభకు పట్టం కట్టారన్నారు. తాను నిత్య విద్యార్థిగా కొత్త విషయాలు నేర్చుకుంటూనే, రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా పని చేస్తున్నానన్నారు. విద్య ప్రపంచ గమనాన్ని మార్చేస్తుందన్నారు. తాను ఫిబ్రవరి 27నాటికి రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు పూర్తవుతుందన్నారు. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం, తాను పడిన కష్టాల గురించి వివరించారు. రాజకీయాల్లో అన్నీ చూశానన్నారు ఐదు నదులను అనుసంధానం చేసి మహా సంగమం ఏర్పాటు చేస్తామని, దీని వల్ల కరవు అనేదే ఉండదన్నారు. గతంలో పాలనను కంప్యూటరీకరించినప్పుడు తనపై అందరూ కోపంగా ఉండేవారని, ఇప్పుడు వాటితో ఎంజాయ్ చేస్తున్నారన్నారు. ధీరూభాయి అంబానీ లాంటి వారికి బ్రాడ్ బ్యాండ్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని అప్పట్లోనే సలహా ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. టెలీకమ్యూనికేషన్స్‌లో సంస్కరణలు తీసుకురావడానికి తమ కమిటీ సిఫారసులే కారణమన్నారు. దీని వల్ల ప్రజలకు ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు.

ఈ-ప్రగతి గ్రాడ్యుయేషన్ సెర్మనీలో మాట్లాడుతున్న చంద్రబాబు