హైదరాబాద్

ఆర్డర్ టు సర్వ్ రద్దుచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తాత్కాలిక విధుల నిర్వహణకు ఉద్యోగులకు జారీ చేసిన ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఉద్యోగులు, గజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం సచివాలయం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషికి డిమాండ్ల పత్రాన్ని సమర్పించింది. టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎ పద్మాచారి, గజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు వి మమత అధ్వర్యంలో జేఏసీ సీఎస్ ను కలిసింది. కొత్త జిల్లాలు ఏర్పాటు సందర్భంగా ఆర్డర్ టు సర్వ్ పేరిట జారీ చేసిన ఉత్తర్వులను ఆరు నెలల్లో రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఏడాదిన్నర గడిచినా రద్దు చేయలేదని జేఏసీ గుర్తు చేసింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఉద్యోగుల బదిలీలపై నిషేధం కొనసాగుతుందని, అంతకు ముందు నుంచీ బదిలీలపై నిషేధం ఉండటంతో ఎనిమిదేళ్లుగా ఉద్యోగులు ఇబ్బందు లు పడుతున్నారని సీఎస్ దృష్టకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో చాలావరకు ఉద్యోగాల ఖాళీలు ఉన్నప్పటికీ భర్తీ కావడం లేదని, అర్హులకు పదోన్నతులు కల్పించకపోవడంతో ఖాళీలు అలాగే ఉండిపోయాయని పేర్కొంది. ఒక పదోన్నతి నుంచి మరో పదోన్నతికి ప్రస్తుతమున్న మూడేళ్ల నిబంధనను రెండేళ్లకు కుదించాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రకు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను వెంటనే సొంత రాష్ట్రానికి తీసుకురావాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల వేతన సవరణ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది.
కొత్త పెన్షన్ రద్దుపై మార్చి 25న సభ
కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 25న హైదరాబాద్‌లో భారీ ఎత్తున సకల ఉద్యోగుల మహాసభ నిర్వహించనున్నట్టు టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, మమత, పద్మాచారి, రాజేందర్ ప్రకటించారు. సిఎస్ జోషిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకూ పాత పెన్షన్ విధానానే్న అమలు చేయాలని డిమాండ్ చేశారు.